Jump to content

చంద్రబాబు కలల రాజధానిలో తోటకూర, పాలకూర, కరివేపాకు


Golfchalera

Recommended Posts

అవునూ, రాజధాని భూముల్ని ఏం చేస్తాడు జగన్..? మరీ చంద్రబాబు వెక్కిరింపు భాష ప్రకారం ఆ భవనాలు కూల్చేసి రైతులకు వాపస్ ఇవ్వలేడు గానీ, మరేం చేయాలి వాటిని… రోడ్లు వేశారు, ఎడాపెడా కేటాయింపులు చేశారు, ఎడ్యుకేషన్ సంస్థలు కొన్ని వచ్చినయ్, కొన్ని భవనాలు నిర్మాణంలో ఉన్నాయి… అసలు ఎన్ని ఎకరాలు మిగులుతాయి..? వాటినేం చేయాలి… భూములిచ్చిన రైతులకు ఏటా చెల్లించే కౌలు ఎలా..? వాళ్లకిచ్చిన రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు ఏవి..? పెద్ద చిక్కు ప్రశ్న కదా… రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలే కాదు, ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 60 నుంచి 70 వేల ఎకరాలు… నిజంగా ఏటా మూడు పంటలు తీసేవాళ్లు గతంలో అక్కడి కౌలు రైతులు… ఇప్పుడవి రైతులకు వాపస్ ఇచ్చిన వ్యవసాయ యోగ్యమేనా..? జగన్‌కు దానిపైనా ముందు నుంచీ ఓ ఆలోచన ఉన్నట్టుంది… ఎలాగూ కేపిటల్ మార్చాలని ఎప్పుడో డిసైడయ్యాడు కదా… ఆమధ్య జెరూసలెం తీర్థయాత్ర పోయినప్పుడు పనిలోపనిగా ఇజ్రాయిల్ వ్యవసాయ టెక్నాలజీ కూడా పరిశీలించి వచ్చాడు…

అమరావతిలో భవనాలన్నీ అలాగే ఉంచేసి, సగం సగం కట్టినవి ఎలాగోలా పూర్తిచేసి, ఎడ్యుకేషన్ హబ్‌గా డెవలప్ చేస్తూనే ఇంకా మిగిలే వేల ఎకరాల భూమిని ఓ ప్రత్యేక వ్యవసాయ మండలిగా డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నాడు

ఓకమిటీకి దీని అధ్యయనం బాధ్యత కూడా అప్పగించాడు
చంద్రబాబు మార్క్ కుప్పం తరహా వ్యవసాయం చేయించాలా..? లేక ఇంకేదైనా కొత్త పద్ధతి ఆలోచించాలా..? అది ఇంకా తెగలేదు కుప్పంలోనూ ఇజ్రాయిల్ మార్క్ వ్యవసాయం చేయించాడు చంద్రబాబు, కానీ ఆ ప్రాజెక్టు ఫెయిలైంది
చంద్రబాబు కలల రాజధానిలో తోటకూర, పాలకూర, కరివేపాకు
ఎలాగూ నీటివసతికి ఢోకా లేదు, మంచి సారమున్న భూములే
రాజధాని వల్ల పనులు కోల్పోయిన కూలీలకు మళ్లీ పనులు దొరుకుతాయి
ఆ భూముల్ని వృథా ఉంచకుండా వినియోగంలోకి తెచ్చినట్టూ అవుతుంది
అక్వా, హార్టీ, అగ్రి, లైవ్ స్టాక్, ఫ్లోరీ, ఆర్గానిక్, వర్టికల్ ఫామింగ్, హైడ్రోపోనిక్స్ తదితరాల మిశ్రమ ప్రయోగశాల కమ్ ఎగుమతుల మండలి

ఆలోచన బాగానే ఉంది గానీ ఇంకా జగన్ ఆమోదముద్ర పడనట్టుంది

Finally green capital is in progress 👍💪💪💪

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...