Jump to content

Infosys in full form


kakatiya

Recommended Posts

ఇన్ఫీ అబ్బబ్బబ్బో

నికర లాభంలో 23.7% వృద్ధి
రూ.23,000 కోట్లకు ఆదాయాలు
2019-20 అంచనాలు పెంపు
బెంగళూరు

ఇన్ఫీ అబ్బబ్బబ్బో

మా ప్రయాణం స్థిరంగా ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. క్లయింట్లతో మా భాగస్వామ్యం తదుపరి డిజిటల్‌ ప్రపంచానికి వారిని తీసుకెళతాం. ఈ ప్రయత్నం వల్లే మా పలు విభాగాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. ఆపరేటింగ్‌ మార్జిన్లూ పెరగనున్నాయి. అందుకే ఆదాయ అంచనాలనూ పెంచాం.

- సలీల్‌ పరేఖ్‌
సీఈఓ, ఎండీ, ఇన్ఫోసిస్‌


ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఫలితాల్లో రాణించింది. అంచనాలను మించి గణాంకాలను ప్రకటించింది. అంతే కాదు.. 2019-20 ఆదాయ అంచనాలను సైతం పెంచడం విశేషం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో సంస్థ నికర లాభం 23.7% పెరిగి రూ.4,466 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నికర లాభం రూ.3610 కోట్లుగా ఉన్నట్లు బీఎస్‌ఈకిచ్చిన సమాచారంలో సంస్థ తెలిపింది. ఆదాయాలు రూ.21,400 కోట్ల నుంచి 7.9% వృద్ధితో రూ.23,092 కోట్లకు చేరుకున్నాయి.

డాలర్లలో
అమెరికా డాలర్లలో చెప్పాలంటే.. కంపెనీ నికర లాభం 24.8 శాతం హెచ్చి 627 మిలియన్‌ డాలర్లకు చేరగా.. ఆదాయాలు 8.6 శాతం వృద్ధితో 3.24 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

పెరిగిన ఉద్యోగులు
డిసెంబరు 2019 చివరకు మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,43,454కు చేరింది. అదనంగా 6,968 మంది జత చేరారు. వలసల రేటు 19.6 శాతంగా నమోదైంది.

భారీ ఒప్పందాల వల్లే..
2019-20 ఏడాదికి ఆదాయ అంచనాలను పెంచింది. స్థిర కరెన్సీ వద్ద లెక్కగట్టిన ఈ అంచనాలు అక్టోబరులో 9-10 శాతంగా ఉండగా.. తాజాగా వాటిని 10-10.5 శాతానికి చేర్చింది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా భారీ ఒప్పందాల్లో 56 శాతం వృద్ధి నమోదైందని ఇన్ఫోసిస్‌ సీఓఓ ప్రవీణ్‌ రావు పేర్కొన్నారు. బ్రెగ్జిట్‌ కారణంగా ఐరోపాలో బ్యాంకింగ్‌, రిటైల్‌ రంగాల్లో కొంత స్తబ్దుత ఉన్నా.. ఉత్తర అమెరికాలో వ్యాపారం రాణించిందన్నారు. ‘వలసలు కూడా తగ్గాయి. ఉద్యోగుల బలోపేతం దిశగా మేం కొనసాగించిన బలమైన చర్యలు ఇందుకు దోహదం చేశాయ’ని అన్నారు.

త్రైమాసిక గణాంకాలు..
* ఆదాయాలు డాలర్లలో 8.6%; స్థిర కరెన్సీలో 9.5% పెరిగాయి.
* అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే ఆదాయాలు డాలర్లలో, స్థిర కరెన్సీ లెక్కల్లో 1% వృద్ధిని నమోదు చేశాయి.
* డిజిటల్‌ ఆదాయాలు 1318 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. మొత్తం ఆదాయాల్లో ఇవి 40.6 శాతానికి సమానం. అంతక్రితం ఏడాది డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే 40.8%; సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే 6.8 శాతం మేర వృద్ధి చెందాయి.
* ఆపరేటింగ్‌ మార్జిన్లు 21.9 శాతంగా నమోదయ్యాయి. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే ఇవి 0.2% పెరిగాయి.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను పెంచినా.. ఆపరేటింగ్‌ మార్జిన్‌ అంచనాలను 21-23 శాతం వద్దే కంపెనీ ఉంచింది.

బీఎస్‌ఈలో శుక్రవారం షేరు 1.47%(రూ.10.70) లాభంతో రూ.738.25 వద్ద ముగిసింది.


‘ఎటువంటి సాక్ష్యాలు లభించలేదు’

ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ‘ప్రజావేగు’ ఫిర్యాదులకు ఎటువంటి సాక్ష్యాలూ లభించలేదని ఇన్ఫోసిస్‌ బోర్డు ఆడిట్‌ కమిటీ తెలిపింది. ‘గుర్తుతెలియని వ్యక్తులు చేసిన ఆరోపణలను ఆడిట్‌ కమిటీ గట్టిగా పరిశీలించింది. స్వతంత్ర సంస్థలతో చేసిన సహాయంతో దర్యాప్తు చేపట్టాం. అయితే ఎటువంటి ఆర్థిక అవకతవకలు కానీ.. ఉన్నతాధికారులు నిబంధనలు ఉల్లంఘించినట్లు కానీ ఎటువంటి ఆధారాలూ లభించలేదు’ అని దర్యాప్తు పూర్తి చేసిన అనంతరం కమిటీ ఛైర్‌పర్సన్‌ డి. సుందరం పేర్కొన్నారు. ఇన్ఫోసిస్‌లో బలమైన కార్పొరేట్‌ పాలన నమూనా ఉందని.. ఆ ఆరోపణలను అదే అత్యున్నత ప్రమాణాలతో పరిశీలిస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్‌ నీలేకని ఈ సందర్భంగా అన్నారు. దర్యాప్తులో సీఈఓపై వచ్చిన ఆరోపణల్లో కూడా నిజం లేదని తేలినట్లు ఆయన స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

1 hour ago, TechAdvice said:

Thesukoni me team leads, managers ki mandu party evvu.. antha set ayyepoddi

Poyi poyi desi company enduku ani mestri a better emo ani

19 minutes ago, quickgun_murugun said:

H1 chestadatana?

Chestandanta kani pay ne WA lo 105K antunnadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...