Jump to content

సీఎం జగన్‌కు షేక్‌ హ్యాండిచ్చిన కేటీఆర్ కొడుకు


AndhraneedSCS

Recommended Posts

637145313547671088.jpg
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రగతిభవన్‌లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌కు వచ్చిన జగన్‌కు కేసీఆర్, కేటీఆర్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. సరిగ్గా మధ్యాహ్న భోజన సమయంలో ఇద్దరు సీఎం కలుసుకున్నారు. ఈ క్రమంలో గులాబీ బాస్‌తో కలిసి వైఎస్ జగన్ భోజనం చేశారు. ఈ భేటీలో భాగంగా ప్రగతిభవన్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది.
 
 
భోజనం చేసిన అనంతరం సీఎం జగన్, ఎంపీ సంతోష్ కుమార్ మీటింగ్‌ హాల్‌కు వెళ్తుండగా.. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు తారసపడ్డాడు. ఈ సందర్భంగా హిమాన్షు పైకిలేచి జగన్‌కు నమస్కరించాడు. ఏపీ సీఎం ప్రతి నమస్కారం చేయగా.. జగన్‌కు హిమాన్ష్ షేక్‌ హ్యాండిచ్చాడు. నవ్వుతూ ఆప్యాయంగా జగన్‌ పలకరించారు. అనంతరం హాల్‌కు సీఎం వెళ్లారు. ఈ ఆసక్తికర సన్నివేశంకు సంబంధించిన ఫొటో, వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై పలు రకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా.. మరోవైపు టీఆర్ఎస్, వైసీపీ కార్యకర్తలు ఈ ఫొటోను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
 
 
ఇదిలా ఉంటే.. జగన్-కేసీఆర్ మధ్య ఇంకా భేటీ జరుగుతోంది. మరో రెండు గంటలపాటు సమావేశం జరిగే అవకాశముంది. ప్రధానంగా విభజన అంశాలు, రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో చర్చిస్తున్నారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా.. ఎన్‌ఆర్సీతో పాటు..పలు విషయాలపై నిశితంగా చర్చిస్తారని సమాచారం. భేటీ అనంతరం చర్చకొచ్చిన అంశాలపై ప్రగతి భవన్ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది
Link to comment
Share on other sites

5 minutes ago, AndhraneedSCS said:

ఈ ఆసక్తికర సన్నివేశంకు సంబంధించిన ఫొటో, వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై పలు రకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా.. మరోవైపు టీఆర్ఎస్, వైసీపీ కార్యకర్తలు ఈ ఫొటోను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...