Jump to content

అమరావతి ఆంధ్రులభవిష్యత్తు


Armanii

Recommended Posts

అమరావతిఆంధ్రులభవిష్యత్తు 
రాజధాని కోసం పోరాడుతున్న రైతులు కాదు 
మొదటిగా పోరాటం మొదలు పెట్టారు రైతులు ఇప్పుడు అన్ని వర్గాల వారు,కులాల వారు,యువత, మహిళలు అందరూ భాగస్వామ్యులయ్యారు రాష్ట్రవ్యాప్తంగా 🙏

మొదటిగా పోరాటం మొదలు పెట్టిన రైతులకు పాదాభివందనం చేస్తూ కొన్ని విన్నపాలు 

అమరావతిఆంధ్రులభవిష్యత్తు
మొట్టమొదట మీరు పోరాటం మొదలు పెట్టారు సరే, రోజురోజుకీ పోరాటం ఉధృతం చేస్తున్నారు నిజమే కానీ మీ పోరాటం పరిధి ఎంత?? మిగతా ప్రపంచానికి మీ పోరాటాన్ని మీరెలా పరిచయం చేస్తున్నారు?? బయటి ప్రపంచం మీ పోరాటాన్నెలా చూస్తుంది??
తెలుసా మీకు??ఆలోచించారా??

అంతెందుకు రాష్ట్రంలోని, దేశంలోని మిగతా రైతులకు రైతులకు మీ పోరాటాన్ని పరిచయం చేసారా?? మీకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేశారా ?? లేదే 

20 రోజులుగా పోరాటం ఉధృతమయ్యింది 
కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక లేదు ఎందుకు ??

50 వేల మంది మహారాష్ట్ర రైతులు కిసాన్ మార్చ్ పేరుతో రాజధాని ముంబై వరకు కదం తొక్కారు గుర్తుంది కదా!! వారికి దారి పొడవునా లభించిన సామాన్య ప్రజల మద్దత్తు గుర్తుందా??వారు సాధించుకున్న డిమాండ్లు గుర్తున్నాయా?? 

వాళ్ళ పోరాటం దేశవ్యాప్త
చర్చనీయాంశం గుర్తుందా

నందిగ్రామ్ రైతులు గుర్తున్నారా ప్రభుత్వమిచ్చిన భూమిలో 
టాటా కార్ ఫ్యాక్టరీ మొత్తం పూర్తయ్యాక 
కూడా వాళ్ళు ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకునేలా వాళ్ళు సాధించిన విజయం గుర్తుందా?? 

ఇవన్నీ వర్తమానంలో మనం చూసిన సమరాలు సమీప విజయాలు 👏👏

రైతు ప్రతినిధి బృందాల్ని ఏర్పాటు చెయ్యండి
ఆ బృందాల ద్వారా కిసాన్ మార్చ్ చేసిన మహారాష్ట్ర రైతుల్ని, నందిగ్రామ్ రైతుల్ని మీకు మద్దత్తు ఇవ్వమని కోరండి. మీ దీక్షా ప్రదేశానికి ఆహ్వానించండి. 

వాళ్ళు పోరాడిన క్రమం,అనుభవాలు తెలుసుకోండి.వారి రాష్ట్రాల్లో 

#అమరావతి రైతులకు మద్దతుగా దీక్షా శిబిరాలు నిర్వహించమని కోరండి 

అలా దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలని,
ప్రజా సంఘాలని, దళిత సంఘాలని,మానవ హక్కుల సంఘాలను కలిసి అమరావతిని సందర్శించమని కోరండి.తిరిగి వెళ్ళాక  మద్దత్తుగా శాంతియుత ప్రదర్శనలు,శిబిరాలకై కోరండి 
ప్రధాన మంత్రికి ,రాష్ట్రపతికి,మానవ హక్కుల కమిషన్ కు,స్త్రీల,బాలల హక్కుల కమిషన్ కు,ఎన్ని వీలైతే అన్నిటికి ఒకసారి 
రైతు ప్రతినిధులుగా,ఒకసారి దళిత ప్రతినిధులుగా, ఒకసారి రాజధాని మహిళా
ప్రతినిధులుగా వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చి రండి, కనీసం 3 విధాలుగా కలవాలి
కోర్టుల్లో కేసులు వెయ్యండి.పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది అని వాదించండి.

ఎవరు విన్నారా లేదా ??ఎవరు స్పందించారా అని కాదు.దేశవ్యాప్త చరచ్చ జరుగుతుందా లేదా అనేది ముఖ్యం. ప్రధానమంత్రికి,రాష్ట్ర పతికి.. తప్పో ఒప్పో స్పందించక తప్పని పరిస్థితి రావాలి

సినిమా వాళ్లని తిట్టుకోవడం కాదు.కలిసి మద్దతు అడిగారా ఎప్పుడన్నా ?? ఇదే రీతిలో కలిస్తే వాళ్లకు స్పందించక తప్పని పరిస్ధితి వస్తుంది.వాళ్ళు గట్టి మద్దత్తు ఇవ్వకపోవచ్చు, ఇబ్బంది ఉంది కాబట్టి సన్నాయి నొక్కులు నొక్కొచ్చు కానీ మాట్లాడతారు.అదే కావాలి 
మనకి 

బౌద్ధభూమి అమరావతి కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్దులను, బౌద్ధ గురువులను, #దలైలామా ని కూడా కలిసి మద్దత్తు అడగండి. వాళ్ళు మాట్లాడటం, మద్దతుగా ప్రదర్శనలు చేయడం మొదలు పెట్టారు అంటే అంతర్జాతీయ చర్చనీయాంశం అవుతుంది. ప్రపంచం మాట్లాడుతుంది

సోషల్ మీడియా ప్రాధాన్యత తెలుసుకోండి 
హిందీ,ఇంగ్లీషు రిటైర్డ్ టీచర్లను ఆహ్వానించి 
ఆ భాషల్లో సమాచారం సోషల్ మీడియాలో ఉన్న యువతకు ఇస్తే వాళ్ళు చూసుకుంటారు మిగతాది అంతా

ముఖ్యంగా మీ పిల్లలు సినిమాల గురించి కంటే ఎక్కువగా రాజధాని సమస్యను చర్చించేలా చూడండి

ఒక WAR Room ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి సాగాలి ఇదంతా. 
జాతీయ మీడియాను ఆహ్వానించి వాళ్ళకు 
వసతి కల్పించండి.మీ ప్రతి కష్టాన్ని వీడియో రూపంలో వాళ్ళు న్యూస్ వేస్తారు.

గంట గంటకీ ఒక న్యూస్ బులెటిన్ రిలీజ్ చేయండి. వాళ్ళు మాట్లాడింది కాదు మీరు చెప్పాలనుకుంది మాత్రమే న్యూస్ అవ్వాలి


ఒక్కవిషయం గుర్తు పెట్టుకోండి మీ పోరాటం
వెనుక రాష్ట్ర భవిష్యత్తు ఉంది అన్న సందేశం బలంగా వెళ్ళాలి ప్రజల్లోకి.

చెప్పాలంటే చాలా ఉన్నాయి

అన్నదాతకు మద్దత్తు సంపాదించలేకపోతే 
ఇంక ఎవరికీ సంపాదించలేం..కాబట్టి 

పోరాటాన్ని జాతీయ సమస్యగా తీర్చిదిద్దండి
గెలుస్తారు

Link to comment
Share on other sites

Vellantha pedda yerri pushpalu avadam khayam...

oka one month tarvata chudandi, ask a question as to why were there protests in Amaravati, okka answer kuda vundadu...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...