Jump to content

డబ్బులిస్తే కేసు మాఫీ!


AndhraneedSCS

Recommended Posts

637150008278052620.jpg
  • సీబీఐ డైరెక్టర్‌ బాగా తెలుసు
  • జగన్‌ కూడా బాగా తెలుసు 
  • రాయపాటికి నకిలీ ఆఫీసర్‌ వల
  • నేరుగా ఇంటికొచ్చి బేరసారాలు
  • అదుపులోకి తీసుకున్న సీబీఐ
 
గుంటూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ‘నేను సీబీఐలో పనిచేస్తున్నాను. నాకు సీబీఐ డైరెక్టర్‌ బాగా సన్నిహితుడు. మిమ్మల్ని కేసులో నుంచి తప్పిస్తాను’ అంటూ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నుంచి డబ్బులు గుంజాలని చూసిన వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు. ఇటీవల బ్యాంకు రుణాలకు సంబంధించి ట్రాన్స్‌ట్రాయ్‌ ఎండీ చెరుకూరి శ్రీధర్‌తోపాటు, ఆ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న రాయపాటిపై సీబీఐ కేసు నమోదైన సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... మణివర్ధన్‌ రెడ్డి అనే వ్యక్తి మూడు రోజుల కిందట రాయపాటికి ఫోన్‌ చేశాడు. రెండు రోజుల క్రితం నేరుగా ఆయన ఇంటికి వచ్చాడు. ‘‘మీ మీద అరెస్టు వారెంటు కూడా ఉంది. డబ్బులిస్తే కేసు నుంచి తప్పిస్తాను’’ అని చెప్పాడు. రూ.10 కోట్ల దాకా డబ్బు డిమాండ్‌ చేశాడు. సీబీఐ డైరెక్టర్‌ తనకు బాగా సన్నిహితుడని నమ్మబలికాడు.
 
‘డైరెక్టర్‌ సార్‌ మాట్లాడతాడు’ అంటూ ఫోన్‌లో మరెవరితోనూ మాట్లాడించాడు. అంతేకాదు... ముఖ్యమంత్రి జగన్‌ కూడా తనకు బాగా తెలుసునంటూ, సీఎంతో దిగిన ఫొటో కూడా చూపించాడు. మణివర్ధన్‌ రెడ్డి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన రాయపాటి... సీబీఐ అధికారులకు ఈ సమాచారం ఇచ్చారు. ఆయన ఇచ్చిన వివరాలతో రంగంలోకిదిగిన సిబ్బంది... మణివర్ధన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. శనివారం సీబీఐ అధికారులు రాయపాటి నివాసానికి వచ్చి లిఖితపూర్వక ఫిర్యాదు తీసుకున్నారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...