Jump to content

గర్జించిన అమరావతి


snoww

Recommended Posts

గర్జించిన అమరావతి

వేల సంఖ్యలో వాహనాలతో రాజధాని ప్రజల ర్యాలీ
భారీగా పాల్గొన్న మహిళలు
3 రాజధానుల నిర్ణయంపై నిరసన ఉద్ధృతం
అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌
ఈనాడు డిజిటల్‌-అమరావతి

గర్జించిన అమరావతి

రాజధాని అమరావతి గర్జించింది. మూడు రాజధానుల నిర్ణయాన్ని ముక్తకంఠంతో ప్రశ్నించింది. రాజధాని ప్రాంతంలోని ఊరూవాడా పోరాటపటిమను చాటిచెప్పింది. నదీపాయలా పుట్టిన జనవాహిని జలతరంగిణిలా ప్రవహించింది. 29 గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళలు బుధవారం నిర్వహించిన భారీ వాహన ర్యాలీ ఇంటింటినీ ముందుకు నడిపించింది. బాలల నుంచి వయోవృద్ధుల వరకు తాము సైతం అంటూ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. దీంతో కిలోమీటర్ల కొద్దీ వేల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. జైఅమరావతి, మూడు రాజధానులు వద్దు అన్న నినాదాలు పల్లెల్లో ప్రతిధ్వనించాయి. ఉదయం పదిన్నరకు తుళ్లూరులో ప్రారంభమైన ర్యాలీ నిర్విఘ్నంగా 18 గ్రామాల మీదుగా సాగి సాయంత్రం 5.45 గంటలకు మళ్లీ తుళ్లూరుకు చేరుకుంది. వృద్ధులు, చిన్నారులు ట్రాక్టర్లలో తరలివచ్చారు. ర్యాలీ ప్రారంభమయ్యే సమయానికి వందల సంఖ్యలోనే ఉన్న వాహనాలు రాయపూడికి చేరుకునేసరికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారితో ఒక్కసారిగా వేలకు చేరుకున్నాయి. వాహనాలు దాదాపు కిలోమీటరుకన్నా ఎక్కువ దూరం బారులుదీరడంతో ఒక్కో గ్రామం మీదుగా ర్యాలీ వెళ్లేందుకు దాదాపు 25 నిమిషాల సమయం పట్టింది. ర్యాలీలో ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నప్పటికీ పూర్తి సమన్వయంతో, శాంతియుతంగా ముందుకుసాగారు.

గర్జించిన అమరావతి

గ్రామగ్రామాన హారతులతో స్వాగతం
తొలుత వాహన ర్యాలీని తుళ్లూరులో మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రాయపూడి, ఉద్ధండరాయునిపాలెం, మోదులింగాయపాలెం, వెలగపూడి, మల్కాపురం, మందడం, వెంకటాయపాలెం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఐనవోలు, కురగల్లు, పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, హరిశ్చంద్రాపురం, బోరుపాలెం, దొండపాడు గ్రామాల మీదుగా ముందుకు సాగుతూ చివరకు తుళ్లూరుకు చేరుకుంది. ర్యాలీలో భాగంగా రైతులు, మహిళలు గ్రామాలు, వీధులగుండా వెళ్లే సమయంలో స్థానిక మహిళలు హారతులు పట్టారు. బొట్టు పెడుతూ, పసుపు నీళ్లతో స్వాగతం పలికారు. కొందరు మహిళలు కొబ్బరికాయలు కొట్టారు. మంచి నీళ్లు, మజ్జిగ అందించారు. పెదపరిమికి చేరుకునేసరికి ఒకేసారి వందల సంఖ్యలో కాలినడకన వచ్చిన మహిళలు ర్యాలీలో చేరడంతో వారిని చేర్చుకోవడానికి వాహనాలు సరిపోలేదు. ఐకాస నేతలు కొద్దిసేపు ర్యాలీని నిలిపేసి ట్రాక్టర్లలో, ఇతర వాహనాల్లో సర్దుబాటు చేశారు. ర్యాలీ సందర్భంగా ఇరుకుదారుల్లో కిక్కిరిసిన కొన్ని వాహనాలు ఒకదానికొకటి తగిలాయి. ద్విచక్రవాహనాలపై వచ్చిన పలువురు మహిళలు, వృద్ధులు ఐనవోలు వద్ద రహదారిపై అదుపు తప్పి పడ్డారు.  సహచరులు వచ్చి వారిని పక్కన కూర్చోబెట్టేందుకు ప్రయత్నించినా వారిస్తూ ఉద్యమస్ఫూర్తితో ముందుకు సాగారు. ఐనవోలు దాటాక వాహనశ్రేణికి గేదె అడ్డొచ్చింది. దీంతో ముందువెళ్తున్న వాహనం ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో వెనక నుంచి వచ్చిన ఒకరిద్దరు ముందు వాహనానికి ఢీకొట్టి అదుపుతప్పి కిందపడ్డారు. వెంటనే పైకి లేచి చిరునవ్వుతో ‘జై అమరావతి’ అంటూ నినదించారు.


స్కూటీలతో వచ్చిన మహిళలు
గర్జించిన అమరావతి

పలువురు మహిళలు, యువతులు స్కూటీలను నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. అందరికన్నా ముందు వరసలో సాగారు. ‘సేవ్‌ అమరావతి.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’... ‘చేయి చేయి కలుపుదాం... అమరావతిని సాధించుకుందాం’ తదితర నినాదాలతో ఉన్న టీషర్టులను ధరించారు.


గ్రామంలోకి వెళ్లనివ్వని పోలీసులు
గర్జించిన అమరావతి

వాహన ర్యాలీ నిర్వహించేందుకు పోలీసులు సాయంత్రం ఐదింటివరకే అనుమతినిచ్చారు.  5గంటలు దాటే సమయానికి ర్యాలీ తుళ్లూరుకు సమీపంలోని హరిశ్చంద్రపురానికి చేరుకుంది. అప్పటికే గడువు మించిపోవడంతో పోలీసులు ర్యాలీని గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతించకుండా బయటి దారి గుండా పంపారు. తుళ్లూరు చేరుకున్నాక జాతీయ గీతాన్ని ఆలపించి ర్యాలీని ముగించారు.


అమరావతిని కొనసాగించే వరకూ ఉద్యమం
గర్జించిన అమరావతి

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే వరకూ ఉద్యమం ఆగబోదని రైతులు, రైతు కూలీల ఐకాస స్పష్టం చేసింది. భారీ వాహన ర్యాలీ ముగిశాక ఐకాస నేత సుధాకర్‌ మాట్లాడుతూ.. అమరావతి సాధనకు శాంతియుతంగానే ఉద్యమిస్తామన్నారు. ఉద్యమమంటే హింసాయుతం అనుకునే రోజుల్లో శాంతి, అహింస, దీక్ష ఆయుధాలుగా నిరసనలు కొనసాగిస్తామని.. పాలకులను కదిలించేలా ముందుకు సాగుతామని చెప్పారు.


గుండెపోటుతో మహిళా వ్యవసాయ కూలీ మృతి
గర్జించిన అమరావతి

రాజధాని అమరావతి తరలిపోతుందనే ఆవేదనతో తుళ్లూరు మండలం మందడంకు చెందిన వ్యవసాయ కూలీ టి.భారతి(55) బుధవారం గుండెపోటుతో చనిపోయారు. అమరావతిని తరలించొద్దంటూ రైతులు చేపట్టిన నిరసన దీక్షల్లో ఆమె ప్రతిరోజూ పాల్గొంటున్నారు. శాసన మండలి రద్దు తర్వాత ఆమె మరింత దిగులు చెందారని బంధువులు తెలిపారు.


ఒకే వాహనంపై శ్రావణ్‌, ముప్పాళ్ల
గర్జించిన అమరావతి

మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు ఒకే వాహనంపై ర్యాలీలో పాల్గొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి నేత శ్రీనివాస్‌ కూడా ఉన్నారు. కృష్ణాయపాలెం నుంచి ర్యాలీ వెళ్లే సమయంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి ట్రాక్టరుపై కూర్చుని ముందుకుసాగారు.


రాజధాని ముక్కలు కాకుండా చూడాలి

గర్జించిన అమరావతి

గన్నవరం అర్బన్‌, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి ముక్కలు కాకుండా చూడాలని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నాయకులు బుధవారం కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఊమెన్‌చాందీకి వినతినిచ్చారు. పీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్‌ ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలసి విజయవాడకు వచ్చిన ఆయనను గన్నవరం విమానాశ్రయంలో ఐకాస నాయకులు కలిసి మాట్లాడారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను కలిసి తమ గోడు వినిపించేందుకు అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని వివరించారు. తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. ఆయనను కలిసిన వారిలో అమరావతి పరిరక్షణ సమితి ఐకాస అధ్యక్షుడు శివారెడ్డి, కన్వీనర్‌ తిరుపతిరావు, మహిళా
అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళి తదితరులు ఉన్నారు

Link to comment
Share on other sites

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను కలిసి తమ గోడు వినిపించేందుకు అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని కోరారు. 

great job Amaravati people

Link to comment
Share on other sites

4 minutes ago, cosmopolitan said:

intha mandhki paisal ichi thechara..antuna karakatta kamalhassan..

RK gadu scrap ayyipoyinatte. Vadu support chesthe full Mileage vachedhi and ee party lo unna gelichipoye vallu. But Jagan gadu won't tolerate. Tammineni Sitaram son ni Jagan kottadu ani talk Sand issue meeda party ki bad name vastundhi ani. Truth entha undo teliyadhu

Link to comment
Share on other sites

26 minutes ago, tacobell fan said:

baga vacharu anta janam 

Anta. Com ee.. 

Ippudu capital shift ledu ante vizag lo porambokulu bike pattukoni vachina oo 20000 ayitharu... 

Malli inko capital vaallu kuda oo 10000 vuntaru ga.. So ltt ivanni...  Grudda noru musukoni nastanni tagginchadaniki Jagga ni land mafia nunchi control cheyadaniki try cheyali ... Anthe Kani Ucha ooosukuntu deeksha, full meals deeksha, neetlo deeksha ante d€ngaru prajalu

Link to comment
Share on other sites

2 minutes ago, DaatarBabu said:

Anta. Com ee.. 

Ippudu capital shift ledu ante vizag lo porambokulu bike pattukoni vachina oo 20000 ayitharu... 

Malli inko capital vaallu kuda oo 10000 vuntaru ga.. So ltt ivanni...  Grudda noru musukoni nastanni tagginchadaniki Jagga ni land mafia nunchi control cheyadaniki try cheyali ... Anthe Kani Ucha ooosukuntu deeksha, full meals deeksha, neetlo deeksha ante d€ngaru prajalu

yup deeksha chesina no labham...valla lands nastam lekunda vacchetattu settlement chesukovaali...

Ippudu vizag vallu oorukoeru vallu idey start chesthaaru..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...