Jump to content

Maaku Capital vaddu antunna Vizag people


snoww

Recommended Posts

Maaku Capital vaddu Ani majority of vizag briefed to boothu kittu anta

ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖని ఎంపిక చేయవద్దంటూ జీఎన్ రావు కమిటీ చేసిన సిఫారసు సాగరనగరంలో ప్రకంపనలు రేపుతోంది. రాజధాని ఏర్పాటుకి విశాఖలో పలు ప్రతికూలతలు ఉన్నాయంటూ కమిటీ తన నివేదికలో పేర్కొనడం నగరవాసుల్లో భయాందోళనలకు దారితీసింది. మెజారిటీ ప్రజలు రాజధాని ఏర్పాటుకి విముఖత కనబరుస్తుండగా.. కొందరు మాత్రమే ఆ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు. ఇంతకీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ని ఎవరు స్వాగతిస్తున్నారు? రాజధాని అంశంపై విశాఖ నగరవాసుల్లో వినిపిస్తోన్న భిన్నాభిప్రాయాలేంటి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
 
 
   కొసరుకి పోతే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది అంటారే.. అలాగే ఉంది విశాఖపట్టణంలో రాజధాని అంశంపై మెజారిటీ నగరవాసుల్లో వ్యక్తమవుతోన్న భయాందోళన సారాంశం. విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని చెబుతున్న పాలకుల మాటలు... నగరంలోని చాలామందిని భయపెడుతున్నాయి. అందుకు పలురకాల కారణాలను వారు వినిపిస్తున్నారు. రాజధాని వస్తే ఇక్కడ రేట్లు అన్నీ పెరిగిపోతాయనీ, పన్నులు కూడా విపరీతంగా పెంచుతారనీ, స్థానికేతరులు కూడా పెద్దఎత్తున వస్తారనీ, అందాల నగరం కాస్తా కాలుష్య కాసారంగా మారే ప్రమాదముందనీ, ఇతర జిల్లాల సంస్కృతి ఇక్కడ వస్తుందనీ విశాఖ వాసుల్లో చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి విశాఖ మహానగరంలో అన్నివర్గాల ప్రజలున్నారు. ఇందులో పేద, సామాన్య, మధ్యతరగతి, ధనిక వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలలో ఎక్కువ మంది విశాఖలో క్యాపిటల్ అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందుకే రాజధానికి అనుకూలంగా కొందరు నిర్వహిస్తున్న ర్యాలీలో మెజారిటీ నగరవాసులు అసలు పాల్గొనడం లేదట. అయితే ధనిక, రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారస్తులు మాత్రం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని స్వాగతిస్తున్నారు.
 
  నగరంలో ఈ వర్గాలే కాకుండా స్థానిక, స్థానికేతరులు కూడా ఉన్నారు. తాతలు, ముత్తాతల నుంచి విశాఖలో ఉన్న స్థానికులు క్యాపిటల్ ను వ్యతిరేకిస్తుంటే... ఇతర ప్రాంతాల నుంచి వలసవచ్చిన స్థానికేతరులు మాత్రం క్యాపిటల్ ను స్వాగతిస్తున్నారు. విశాఖ నగరం రాజధాని అయితే ఇక్కడకు స్థానికేతరులు ఇంకా పెద్దఎత్తున వస్తారనీ, అంతిమంగా వారే తమ అవకాశాలను కొల్లగొడతారనీ స్థానికంగా ఉన్నవారిలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే విశాఖ వాసుల్లో చాలామంది రాజధానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
 
 
   విశాఖ నగరంలో చదువుకున్నవారు, చదవు లేనివారితోపాటు చాలా వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. వారిలో చాలామందికి ఇప్పటికీ హైదరాబాద్ నే రాష్ట్ర రాజధానిగా భావిస్తున్నారు. ఏపీకి కొత్త రాజధాని అమరావతి అని చాలా తక్కువ మందికే తెలుసు! అయితే రాజధాని నగరం అంటే ప్రతీది ఖర్చుతో కూడుకున్న పననీ, అలాంటి ఖరీదైన నగర జీవితాన్ని తాము భరించలేమనీ వారు అంటున్నారు. అందుకే విశాఖలో కార్యనిర్వహక రాజధాని ఏర్పాటుపై పేద, సామాన్య, మధ్యతరతి ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. పైగా ఇక్కడ రాజధాని వస్తే ధరలు అన్ని పెరిగిపోతాయని మాత్రం కొంతమంది ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. అందుకే విశాఖకు రాజధాని వస్తుందన్న ఆనందం కానీ, సంతోషం కానీ వారిలో ఎక్కడా కనపడటంలేదని విశ్లేషకులు అంటున్నారు. అలాగే వారు విశాఖలోనే రాజధాని ఏర్పాటు చేయాలని ఎక్కడా డిమాండ్ చేయడం లేదనీ, అనుకూల ర్యాలీలు కూడా నిర్వహించడం లేదనీ చెబుతున్నారు.
 
 
   మరోవైపు జిల్లాలో వైసీపీకి చెందినవారు మాత్రమే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కి అనుకూలంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవి కూడా ఏదో మొక్కబడిగా చేస్తున్నారని చెబుతున్నారు. అధికార పార్టీ జరిపే ర్యాలీల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్న దాఖలాలు కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజధాని కావాలంటూ వైసీపీ శ్రేణులు కాగడాలు, కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించినా... అందులో నాయకులు ఫోటోలకు, టీవీ కెమెరాలకు ఫోజులిచ్చి.. రెండు ముక్కలు మాట్లాడి.. ఇంటికి వెళ్లిపోతున్నారని విశాఖలో గుసగుసలు వినబడుతున్నాయి.
 
 
   విశాఖలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్న రాజధానిపై పలువురు మేధావుల్లోనూ అనుమానాలు నెలకొన్నాయి. రాష్ట్రంలో వైసీపీ తప్ప ఏ పార్టీ మూడు రాజధానులకు మద్దతు ఇవ్వడంలేదని వారు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ బలవంతంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుచేసినా.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే.. ఇక్కడి నుంచి రాజధాని మారుస్తారనే అనుమానాలు కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే.. ఇప్పుడు అమరావతిలో రైతులు, మహిళలు చేస్తున్నట్లుగానే, అప్పుడు విశాఖ ప్రజలు కూడా పోరాటాలు చేయాల్సి వస్తుందేమోనని వారు శంకిస్తున్నారు. ఇదే తరహాలో ఆలోచిస్తున్న చాలామంది విశాఖవాసులు.. తమ నగరంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని ఏర్పాటు చేస్తామన్నా.. వారు అందుకు విముఖంగా ఉన్నారని తెలుస్తోంది.
 
 
   ఇక ధనిక వర్గాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మాత్రం విశాఖలో ఎగ్జిక్యూటివ్ కాపిటల్ ను స్వాగతిస్తుండటం గమనార్హం. వీరంతా విశాఖ మీద ప్రేమతో రాజధానిని ఏర్పాటు చేయాలని కోరుకోవడం లేదట. తమ వ్యాపారాలు మరింత లాభసాటిగా మారుతాయనీ, తమ ఆస్తుల విలువ మరింత పెరుగుతుందని వంటి ఆలోచనలు తప్ప.. ప్రజా ప్రయోజనాలు ఆశించిమాత్రం కాదని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. అలాగే ఇక్కడ స్థానికేతరులలో ఎక్కువగా ధనికులు, రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారస్తులు ఉన్నారు. వీరంతా వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా రాజధానికి సై అంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాపార ధోరణి లేని స్థానికులు.. ఇక్కడ రాజధాని వస్తే మాత్రం ధరలన్నీ పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. అలాగే విశాఖ రాజధాని అయితే స్థానికేతరుల బలం కూడా పెరుగుతుందనీ, వారి ఆధిపత్యంలోకి నగరం వెళ్లిపోతుందనీ స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇవండీ రాజధాని అంశంపై విశాఖ వాసుల్లో వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు. మరి మున్ముందు ఏం జరుగుతుందో.. లెట్స్ వెయిట్ అండ్ సీ
Link to comment
Share on other sites

విశాఖ నగరంలో చదువుకున్నవారు, చదవు లేనివారితోపాటు చాలా వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. వారిలో చాలామందికి ఇప్పటికీ హైదరాబాద్ నే రాష్ట్ర రాజధానిగా భావిస్తున్నారు.ఏపీకి కొత్త రాజధాని అమరావతి అని చాలా తక్కువ మందికే తెలుసు!

Link to comment
Share on other sites

రాజధాని వస్తే ఇక్కడ రేట్లు అన్నీ పెరిగిపోతాయనీ, పన్నులు కూడా విపరీతంగా పెంచుతారనీ, స్థానికేతరులు కూడా పెద్దఎత్తున వస్తారనీ, అందాల నగరం కాస్తా కాలుష్య కాసారంగా మారే ప్రమాదముందనీ, ఇతర జిల్లాల సంస్కృతి ఇక్కడ వస్తుందనీ విశాఖ వాసుల్లో చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Link to comment
Share on other sites

Just now, snoww said:

రాజధాని వస్తే ఇక్కడ రేట్లు అన్నీ పెరిగిపోతాయనీ, పన్నులు కూడా విపరీతంగా పెంచుతారనీ, స్థానికేతరులు కూడా పెద్దఎత్తున వస్తారనీ, అందాల నగరం కాస్తా కాలుష్య కాసారంగా మారే ప్రమాదముందనీ, ఇతర జిల్లాల సంస్కృతి ఇక్కడ వస్తుందనీ విశాఖ వాసుల్లో చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Agreed. Amaravati ki ee problems emi vundavu

Link to comment
Share on other sites

8 hours ago, snoww said:

విశాఖ నగరంలో చదువుకున్నవారు, చదవు లేనివారితోపాటు చాలా వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. వారిలో చాలామందికి ఇప్పటికీ హైదరాబాద్ నే రాష్ట్ర రాజధానిగా భావిస్తున్నారు.ఏపీకి కొత్త రాజధాని అమరావతి అని చాలా తక్కువ మందికే తెలుసు!

@ARYA bro. 5 kotla Andhrula kalala rajadhani Amaravati Ani Mee vizag vallaki last 5 years lo enduku seppaledu bro nuvvu. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...