Jump to content

అమరావతిని ఏందుకు కట్టటం లేదు అంటే


TokyoJaani

Recommended Posts

తాటి చెట్టు ఎందుకు ఏక్కావు అంటే, దూడ గడ్డి కోసం అన్నట్లుగా, దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయమన్నట్లుగా నేటి మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దల తీరు ఉన్నది.

అమరావతిని ఏందుకు కట్టటం లేదు అంటే, ముందు ముంపు ప్రాంతం అన్నారు. తరువాత ఒక కులం కోసం అన్నారు. తరువాత శివరామకృష్ణన్ కమిటీ వద్దు అన్నారన్నారు, తరువాత మద్రాసు ఐఐటీ వద్దన్నారన్నారు. తరువాత సోమ్ములు లేదంటున్నారు. తరువాత కమిటీల రిపోర్టుల ప్రకారం అన్నారు. ఇలా తలా తోక లేని పలు కారణాలు చెబుతున్నారు. చివరికి అమరావతి నుంచి పాలన చేయాలంటే 4,000 కోట్లు రుపాయలు ఖర్చు అవుతుంది, అదే విశాఖపట్నం నుంచి అయితే 3,500 కోట్లు రుపాయలు ఖర్చు అవుతుంది అని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు చెప్పింది అంటున్నారు. అటువంటప్పుడు కేవలం 500-1,000 కోట్లు రుపాయలు మాత్రమే తేడా ఉన్నప్పుడు, విశాఖపట్నం ఇప్పటికే మహనగరం స్థాయిలో ఉన్నది. అటువంటప్పుడు రెండో మహనగరంగా అమరావతి నిర్మాణం జరగాలి. బుథ్థి, బుర్ర, కనీస ఇంగీత జ్ఞానం ఉన్న వారేవరైనా ఇలాగే అలోచన చేస్తారు.

కానీ ప్రభుత్వ పెద్దలకు ఖచ్చితంగా ఇదే లోపించింది. ఏందుకో మూర్ఖంగా, మొండిగా వాదన చేయటం చూస్తే మాత్రం, వారి అలోచనలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 1,000 కోట్లు రుపాయలు ఖర్చు నేటి ప్రభుత్వ ఖజానా భరించగలదు. కారణం 1,300 కోట్లు రుపాయలు ఖర్చు రంగులకు పెట్టారు. మరోక 1,300 కోట్లు రుపాయలు ఖర్చు మరలా తుడవటానికి హైకోర్టు తీర్పు ప్రకారం పెట్టాలి. అటువంటి నిరర్థక, వృథా ఖర్చు అయిన 2,500కోట్లు రుపాయలు ఖర్చు అనవసరంగా భరించగలిగే స్థితిలో రాష్ట్రం ఉన్నప్పుడు, అంత ఖర్చు అమరావతి రాజథాని ప్రాంతం కోసం పెట్టలేరా, మీరు చెప్పిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం. లక్ష కోట్లు రుపాయలు ఖర్చు అనేది కేవలం బూచి మాత్రమే. అయినా ఈ రాష్ట్రంలో బుథ్థి, బుర్ర, కనీస ఇంగీత జ్ఞానం ఉన్న ఏవరూ కూడా చంద్రబాబు భ్రమరావతి కట్టమని అడగటం లేదు. కనీస స్థాయిలో నిర్మాణాలు మాత్రమే చేయాలి అని అడుగుతున్నారు.

ఇక్కడే ప్రజలను మోసం చేస్తూన్నారు అంటే ఏమాత్రం తప్పు లేదు కదా! ఏదేమైనా బుథ్థి పూర్వకంగా ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేస్తూన్నారు. ఇది నేరపూరితమైన థోరణి. కాదంటారా ప్రజలారా?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...