Jump to content

ట్రంప్‌ కోసం ముస్తాబవుతోన్న తాజ్‌మహల్‌ !


r2d2

Recommended Posts

Would the Trump couple take the customary picture on the bench with the Taj in the background?

ట్రంప్‌ సందర్శన నేపథ్యంలో ముస్తాబవుతోన్న తాజ్‌ పరిసరాలు

ట్రంప్‌ కోసం ముస్తాబవుతోన్న తాజ్‌మహల్‌

లక్నో: మొదటిసారిగా భారత్‌ పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోసం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్‌మహల్‌ముస్తాబవుతోంది. భారత ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు అమెరికా అధ్యక్షుడు భారత్‌లో పర్యటించనున్నారు. ట్రంప్ దంపతులు తాజ్‌మహల్‌ను సందర్శించనున్నట్లు సమాచారం. దీనికోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి రాక నేపథ్యంలో ఆగ్రా పరిసర ప్రాంతాలనుముస్తాబుచేస్తున్నారు. ఇప్పటికే సుందరీకరణ పనులు చేపట్టిన అధికారులు పట్టణంలోని ప్రముఖ కూడళ్లను అందంగా తీర్చిదిద్దడంతోపాటు, రోడ్ల మధ్య విభాగినిలకు రంగులు వేసే కార్యక్రమం చేపట్టారు. స్థానిక పోలీసులకు కూడా సెలవులను రద్దు చేశారు.  విమానాశ్రయం నుంచి తాజ్‌మహల్‌ వరకు ఉన్న రోడ్డు మార్గాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. తాజ్‌మహల్‌ చుట్లూ ఉన్న గోడలపై కళాకారులతో పెయింటింగ్‌లతో వేయిస్తున్నారు. సందర్శన సమయంలో తాజ్‌మహల్‌ సమీపంలో ఉన్న కళాకృతి ఆడిటోరియంలో ‘మొహబ్బత్‌-తాజ్‌’ అనే కళా ప్రదర్శనను తిలకించే అవకాశం ఉంది. భద్రతా చర్యల్లో భాగంగా ఇప్పటికే అమెరికా భధ్రతా దళాలు తాజ్‌మహల్‌ను సందర్శించాయి. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...