Jump to content

Congress Ahmed patel - IT notices.


TheBrahmabull

Recommended Posts

కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్‌కు.. ఆదాయపు పన్ను శాఖ నోటీసు ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్ పార్టీకి హవాలా మార్గంలో నిధులు అందాయని.. ఐటీ శాఖ గుర్తించింది. నవంబర్‌లో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఓ బడా ఇన్‌ఫ్రా కంపెనీతో పాటు… దేశవ్యాప్తంగా 42 చోట్ల ఐటీ సోదాలు చేసింది. అప్పుడు రూ. 3,300 కోట్ల హవాలా లావాదేవీలను గుర్తించినట్లుగా ఐటీ ప్రకటించింది. ఆ సమయంలో.. కాంగ్రెస్ పార్టీకి కూడా.. రూ. వంద కోట్ల నిధులు అందినట్లుగా.. ఆయా కంపెనీల్లో రికార్డులు స్వాధీనం చేసుకున్నారని జాతీయ మీడియా ప్రకటించింది. ఈ నిధులకు సంబంధించి వివరాల కోసం.. కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా ఉన్న అహ్మద్ పటేల్‌కు ఐటీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఐటీ నోటీసులను అందుకున్న అహ్మద్ పటేల్ విచారణకు హాజరు కాలేదు. తాను అనారోగ్యంతో ఉన్నందున మరో తేదీని ఫిక్స్ చేయాలని ఐటీ వర్గాలకు సమాచారం అందించారు.

తెలుగు రాష్ట్రాల హవాలా వ్యవహారంలోనే అహ్మద్‌పటేల్‌కు నోటీసులు..! అహ్మద్ పటేల్‌కు ఐటీ నోటీసుల వ్యవహారం.. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలతో ముడిపడి ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే… తెలుగు రాష్ట్రాల్లో రెండు విడతలుగా ఐటీ అధికారులు భారీ సోదాలు చేశారు. నవంబర్‌లో ఓ సారి… రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా ప్రాజెక్టులు చేపట్టిన సంస్థపైన..ఈ నెలలో… రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార, ప్రతిపక్షాలకు సన్నిహితులైన వారి కంపెనీలపైనా ఐటీ దాడులు జరిగాయి. నవంబర్‌లో జరిగిన ఐటీ దాడుల్లో రూ. 3,300కోట్ల హవాలా లావాదేవీలు, ఫిబ్రవరిలో జరిగిన ఐటీ దాడుల్లో రూ. 2వేల కోట్ల హవాలా లావాదేవీల్ని గుర్తించించినట్లుగా ప్రకటించింది.

వీటికి సంబంధించి దొరికిన ఆధారాలతో నోటీసులు జారీ చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. కాంగ్రెస్‌కు ధన సాయం చేసింది తెలంగాణ ప్రముఖ పార్టీనా..? కాంగ్రెస్ పార్టీకి తెలుగు రాష్ట్రాల కంపెనీల నుంచి సొమ్ము వెళ్లడం అనేది కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే.. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలో లేదు. రేసులో కూడా కూడా లేదు.

తెలంగాణలో అప్పటికే ముందస్తు ఎన్నికలు ముగిసిపోయాయి కూడా. ఏపీలో అసుల ఉనికిలో లేదు. అయితే.. నవంబర్‌లో జరిగిన ఐటీ సోదాలప్పుడు.. కాంగ్రెస్‌కు నిధులందిన విషయం… మీడియా ప్రకటించింది. అప్పుడు సోదాలు జరిగిన కంపెనీల వ్యవహారాలు పరిశీలిస్తే.. పూర్తిగా తెలంగాణ ప్రముఖ పార్టీకి చెందిన లింకులు బయటకు వస్తాయని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీతో సన్నిహితంగా మెలికిన ప్రముఖ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి.. కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంది. కాంగ్రెస్ పార్టీ అయితేనే.. తన చక్రంకు అనుకూలమని.. ఆ పార్టీకి ఆర్థిక సాయం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ కంపెనీ తెలంగాణలో మెగా ప్రాజెక్టులన్నీ చేపట్టడంతో.. ఆ కంపెనీ ద్వారా కాంగ్రెస్‌కు ప్రముఖ పార్టీ ఆర్థిక సాయం చేసిందన్న అభిప్రాయం.. బలంగా ఉంది. కాంగ్రెస్‌ను పైకి తేవాలనుకున్న నాటి ఏపీ ప్రముఖ పార్టీనా..? అయితే.. కాంగ్రెస్ పార్టీతో పార్లమెంట్ ఎన్నికలలో నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా… కాంగ్రెస్ పార్టీ కోసం.. ఏపీలో అప్పటి ప్రముఖ పార్టీ కూడా.. తీవ్రంగా ప్రయత్నించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సాయం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఆ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ కు ధన సాయం చేసిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. అప్పట్లో.. ఐటీ దాడులు జరిగిన కంపెనీకి .. అతి భారీ ప్రాజెక్టులేవీ ఏపీలో లభించలేదు. అంతే కాదు.. అసలు ఆ పార్టీకే ఆర్థిక సమస్యలు వెంటాడాయన్న ప్రచారమూ జరిగింది. ఈ క్రమంలో.. మొన్నటి ఐటీ దాడులతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తానికి నవంబర్‌లో.. ఫిబ్రవరిలో జరిగిన ఐటీ దాడుల వ్యవహారంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పార్టీలు.. ఇరుక్కోవడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అహ్మద్ పటేల్ విషయంలో ఐటీ ఎలా ముందడుగు వేస్తుందన్నదానిపై.. మిగతా అంశాలు ఆధారపడి ఉండవచ్చు.

 

Link to comment
Share on other sites

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TheBrahmabull

    13

  • bhaigan

    12

  • Sreeven

    8

  • Hydrockers

    3

Popular Days

Raids were mainly on Myhome and Megha - So it could be TRS sending funds to congress.

 

            OR

TDP joining hands with Congress - but raids were not on TDP related companies..

Link to comment
Share on other sites

Just now, TheBrahmabull said:

Raids were mainly on Myhome and Megha - So it could be TRS sending funds to congress.

 

            OR

TDP joining hands with Congress - but raids were not on TDP related companies..

Andaru baga ne involve..bayata kottukuntaru business lu kalisi chestaru..

Link to comment
Share on other sites

2 minutes ago, bhaigan said:

Gummadi Kaya dongalu

arey bhaigan - neeku tondara ekkuva.. NABARD la loan techukunnava ?

evidence showing it is TRS.  kani election time lo pothu pettukundi TDP.

 

but mukkodi jitthulamari veshalu andariki telusu..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...