అది 1990  ఆగస్ట్ నెల, తాటిచెట్లపాలెం అనే చిన్నపల్లెటూరు. ఊరు పేరుకు తగ్గట్టే , ఆ ఊరు లో తాటి చెట్లు ఎక్కువ. ఆ వూరిలో మస్తాన్ అనే ఒక రోజువారీ కూలి ఉండేవాడు. మస్తాన్ సంవత్సరం క్రితం వరకూ ఆ ఊర్లోనే సర్పంచ్ దగ్గర పని చేసేవాడు, కానీ కొన్ని కారణాల వాళ్ల ఆ పని మానేసి, పక్కనున్న టౌన్ కు వెళ్ళి కూలి పని చేస్తున్నాడు. ప్రతి రోజు సైకిల్ ఫై పక్కనే  వున్న టౌన్ లోకి వెళ్లి సాయంత్రం వరకు కూలి పనులు చేసుకుని, సాయంత్రానికి టౌన్ లో ఏదో ఒక సారా దుకాణం లో తాగి, మళ్ళి తన వూరికి సైకిల్ పైనే వచ్చేస్తుంటాడు. వాళ్ళ ఊరి