Jump to content

పెళ్లి చేసుకుందాం రమ్మని...


nag_mama

Recommended Posts

పెళ్లి చేసుకుందాం రమ్మని...

పెళ్లి చేసుకుందాం రమ్మని... అరెస్ట్‌ చేసింది

మాధవీ అగ్నిహోత్రి మధ్యప్రదేశ్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఓ ఫైర్‌ బ్రాండ్‌. ఆమె పేరు చెబితే చాలు ‘భయమంటే తెలియని... ఆడపులి’ అంటూ ఎవరికి తోచిన రీతిలో వారు పొగుడుతుంటారు. పదేళ్లుగా మూడు రాష్ట్రాల పోలీసులతో దోబూచులాడిన ఓ కరడుగట్టిన నేరస్తుడికి పెళ్లి వల వేసి... నెలరోజుల్లోనే పట్టించి ధైర్యసాహసాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలవడమే అందుకు కారణం. ఆ విశేషాలు ఏంటంటే...
బాలకృష్ణన్‌ చౌబే... మూడు రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్న ఓ కరడుగట్టిన నేరస్తుడు. హత్యలూ అత్యాచారాలూ దారి దోపిడీలూ పిల్లల కిడ్నాపులూ వంటి ఎన్నో నేరాలకు పాల్పడి మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పదేళ్లుగా ఖాకీలతో దోబూచులాడుతున్న బాలకృష్ణన్‌ కోసం మహామహులే రంగంలోకి దిగారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చిక్కినట్టే చిక్కి చేజారిపోయేవాడు. ముప్పు తిప్పలు పెట్టి పోలీసులకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ తలనొప్పిగా మారిన బాలకృష్ణన్‌ ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. దాంతో ఎలాగైనా పట్టుకుతీరాలనే కసి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పెరిగింది. అతడిని పట్టుకుంటే లక్ష రూపాయల రివార్డు కూడా ఇస్తామని ప్రకటించింది డిపార్ట్‌మెంట్‌.

*    *    *

నాలుగు నెలల క్రితం...
‘లేడీ సింగం’ అని ఉన్నతాధికారులంతా పిలుచుకునే మాధవీ అగ్నిహోత్రి చేతికొచ్చింది బాలకృష్ణన్‌ కేసు. కేవలం నెల రోజుల్లోనే అతణ్ని చట్టం ముందు నిలబెట్టింది.
సినీ ఫక్కీలో వేటాడి వెంటాడింది. అజ్ఞాతంలో అజ లేకుండా తిరుగుతున్న బాలకృష్ణన్‌ తనంతట తానే బయటకొచ్చేలా స్కెచ్‌ వేసి రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్టు చేసింది. సాహసోపేతంగా మాధవి చేసిన ప్రయత్నాన్ని ఆ రాష్ట్ర పోలీసులే కాదు యావత్‌దేశం అభినందించింది.

*    *    *

అసలేం జరిగింది... ఉన్నతాధికారులే తలలు పట్టుకున్న ఆ కేసును ఓ ముప్ఫై ఏళ్ల మహిళ ఎలా ఛేదించింది? అసలు ఎవరీ మాధవీ అగ్నిహోత్రి? ఏం చేసి అతడిని రెడ్‌హ్యండెడ్‌గా చట్టానికి పట్టించింది అనే సందేహాలు కలుగుతున్నాయి కదూ. మహిళలందరికీ స్ఫూర్తినిస్తున్న మాధవి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాల్సిందే.
మాధవీ అగ్నిహోత్రి పేరులోనే కాదు మనిషిలో కూడా ఫైర్‌ ఉంది. నౌగాన్‌ జిల్లాలోని గరోలీ పోలీస్‌ స్టేషన్‌లో ప్రస్తుతం అవుట్‌పోస్టింగ్‌ ఇన్‌ఛార్జిగా విధులు నిర్వహిస్తోంది. ఇంతకుముందు అక్కడ ఈవ్‌ టీజింగులూ, ర్యాగింగులూ, దొంగతనాలూ ఎక్కువగా జరిగేవి. మాధవి అక్కడ ఛార్జ్‌ తీసుకున్నాక అలాంటి కేసులు తగ్గిపోయాయి. ఎప్పటికప్పుడు పక్కా నిఘా, పెట్రోలింగుతో కాపు కాస్తూ ఆడవాళ్లకు రక్షణ ఇస్తోంది. నిందితులకు కౌన్సెలింగు చేస్తూ... వీలైతే ఫోర్త్‌ డిగ్రీ ఉపయోగిస్తూ వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. కేసుల్ని త్వరగా పరిష్కరించి క్లోజ్‌ చేయడంలో కూడా మాధవి ముందుంటుంది. అందుకే పోలీస్‌ అధికారులు ఆమెని లేడీ సింగం అంటుంటారు.

పెళ్లి చేసుకుందాం రమ్మని... అరెస్ట్‌ చేసింది

అసలు విషయంలోకి వస్తే... గతేడాది మాధవి పని చేస్తున్న స్టేషన్‌ పరిధిలో ఓ బడా వ్యాపారి హత్యకు గురయ్యాడు. ఆత్మహత్యగా చిత్రీకరించిన ఆ కేసును లోతుగా పరిశీలించిన మాధవికి అది హత్యని అర్థమైంది. దాంతో దర్యాప్తును ముమ్మరం చేయడంతో ఆ హత్య చేసింది మరెవరో కాదు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఏళ్ల తరబడి వెతుకుతున్న బాలకృష్ణన్‌ అని తెలిసింది. కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా మొదట అతడి అనుచరులు కొందర్ని అరెస్ట్‌ చేసింది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా బాలకృష్ణన్‌ ఆచూకీ మాత్రం తెలియలేదు. దాంతో మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి అతడి కోసమే వెతకడం ప్రారంభించింది. దాంతో చాలామంది అధికారులూ, సహోద్యోగులూ ‘ఎందుకు నీ టైం వేస్ట్‌ చేసుకుంటావ్‌. వాడు దొరకడు... దొరికేవాడైతే ఎప్పుడో పై అధికారులకే దొరికేవాడు’ అంటూ నిరాశపరిచారు. ఆ మాటలకి ‘ఎన్నో కుటుంబాల్ని బాధ పెట్టాడు వాడు... ఎంతో మందికి తండ్రుల్నీ, భర్తల్నీ దూరం చేశాడు. ఆ కుటుంబాల బాధేంటో నాకు తెలుసు. తండ్రి లేని కూతురిగా, తల్లి కష్టంతో పెరిగిన నాకు తెలుసు’ అని కసిగా మనసులో అనుకుంది. ఎలాగైనా అతణ్ని పట్టుకోవాలని నిర్ణయించుకుంది.

పెళ్లి చేసుకుందాం రమ్మని... అరెస్ట్‌ చేసింది

పట్టువదల్లేదు...
సరిగ్గా అప్పుడే మధ్యప్రదేశ్‌ పోలీసు అధికారులు బాలకృష్ణన్‌ను పట్టుకోవడానికి ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఇన్‌ఛార్జిగా ఎవర్ని నియమిస్తే బాగుంటుందా అని చూస్తున్నప్పుడే అధికారులకు మాధవి గురించి తెలిసింది. ఆమె ట్రాక్‌ రికార్డూ, కేసులు పరిష్కరించిన తీరూ నచ్చడంతోపాటు ఎలాగైనా బాలకృష్ణన్‌ను పట్టుకోవాలని మాధవి పడుతున్న తపనకు ఇంప్రెస్‌ అయి ఆ బృందానికి ఇన్‌ఛార్జిగా నియమించారు. తాను తలిచిందే దైవం తలిచింది అన్నట్టు అధికారులు తనని నమ్మి... మూడు రాష్ట్రాల పోలీసులకి దొరక్కుండా పరారీలో ఉన్న నేరస్తుణ్ని పట్టుకొనే బాధ్యతను తనపై పెట్టినందుకు రెట్టించిన ఉత్సాహంతో రంగంలోకి దిగింది. ఆడవాళ్లు తలచుకుంటే ఏదైనా సాధించగలరని ఆ కేసు ద్వారా నిరూపించాలనుకుంటూ దాన్ని ఛేదించే పనిలో నిమగ్నమైంది. నిద్రాహారాలూ మాని బాలకృష్ణన్‌ వ్యక్తిగత జీవితం, చేసిన నేరాలూ, అతని బలాలూ, బలహీనతల వంటివాటిని సేకరించడం మొదలుపెట్టింది. ఆ సమాచారంతో ఓ పుస్తకాన్నే తయారు చేసుకుంది. అప్పుడు తెలిసిన ఓ విషయమే మాధవి అనుకున్నది సాధించడానికి కారణమైంది. అదేంటంటే... బాలకృష్ణన్‌కి బలహీనత ఆడవాళ్లు. వాళ్ళ పొందుకోసం అతడేమైనా చేస్తాడు. అందుకు లోధీ అనే మహిళ అతడికి సహకరిస్తుండేది. కానీ లోధీకి బాలకృష్ణన్‌ ఎవరూ, ఎక్కడుంటాడూ అనేది మాత్రం తెలియదు. కేవలం డబ్బుకోసమే అదంతా చేస్తుంటుంది. ఆ ఒక్క క్లూతోనే మాధవి పది అడుగులు ముందుకేసింది. రాధ పేరుతో తన ఫొటోల్ని లోధీకి పంపి ఆసక్తి ఉన్న అబ్బాయిల్ని తనకి పరిచయం చేయమని అడిగింది. తరచూ లోధీకి ఫోన్‌ చేస్తూ ఆమెతో సాన్నిహిత్యం పెంచుకుంది. కొన్ని రోజులకు మాధవికి ఓ ప్రయివేట్‌ నంబరు నుంచి ఫోన్‌ వచ్చింది. అది కచ్చితంగా బాలకృష్ణన్‌ ఫోనే అని మాధవి అనుమానించింది. అయితే అతడు పేరు మాత్రం చెప్పకుండా రోజూ గంటలకొద్దీ మాట్లాడుతుండేవాడు. అతడు మాట్లాడుతున్న ఫోన్‌ ఆధారంగా ట్రేస్‌ చేసి దాడి చేయొచ్చు. కానీ పొరబాటున అతడు తప్పించుకుంటే మళ్లీ నమ్మించడం కష్టమవుతుందని ఆ దిశగా ప్రయత్నించకుండా ఓపిక పట్టింది. తనకు ఫోన్‌ చేస్తున్నది బాలకృష్ణనో కాదో మాత్రం నిర్ధారించుకోలేక చాలా సతమతమయ్యేది.
ఇదిలా ఉంటే... మాధవి ఫొటోలు నచ్చిన బాలకృష్ణన్‌ ఆమెని టెస్ట్‌ చేయడానికి అడిగిన ప్రశ్నలే అడుగుతుండేవాడు. అసభ్యమైన మాటలు మాట్లాడుతుండేవాడు. ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఫోన్‌ చేసేవాడు. ఏం మాట్లాడినా, ఎప్పుడు ఫోన్‌ చేసినా మాధవి విసుక్కోకుండా ఓపిగ్గా అతనికి సమాధానాలు చెప్పేది. దాంతో కొన్నాళ్లకి ఆమెపై నమ్మకం కలగడంతో తన పేరు చెప్పాడు. దాంతో ఊపిరి పీల్చుకున్న మాధవి ఆ మర్నాడు తనని ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకుందామనీ అడిగింది. అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలున్న బాలకృష్ణన్‌ వయసులో ఉన్న అందమైన అమ్మాయి అడగడంతో కాదనలేక పెళ్లికి సిద్ధమైపోయాడు. దాంతో ఆ మర్నాడు ఉదయాన్నే పెళ్లి బట్టలతో యూపీ-ఎంపీ బోర్డరులోని ఓ ఊళ్లో ఉన్న గుడికి రమ్మని చెప్పింది మాధవి. ఆ విషయం తన బృందంలోని సభ్యులకు తప్ప మరెవరికీ తెలియకుండా జాగ్రత్తపడింది. ఆ గుడిలోనూ చుట్టుపక్కలా సివిల్‌ డ్రెస్‌లో పోలీసులను ఉంచింది. తను కూడా అతను చెప్పినట్టు ఆకుపచ్చ రంగు చీర కట్టుకుని పెళ్లి కూతురిలా తయారై హ్యాండ్‌బ్యాగ్‌లో ఫోన్‌, గన్‌తో వెళ్లింది. కాసేపటికి పెళ్ళి బట్టల్లో వచ్చిన బాలకృష్ణన్‌ ఆమెని చూసి దగ్గరకు రాగానే ‘హ్యాండ్సప్‌’ అంటూ ఒక్కసారిగా తలకి గన్ను గురిపెట్టింది. ఈ లోపులో ఆ చుట్టుపక్కలున్న మిగతా పోలీసులు వచ్చి అతడికి బేడీలు వేశారు. అలా నెల తిరిగేసరికి అతడిని చట్టానికి అప్పగించి రివార్డులూ, అవార్డులూ అందుకుంది. తనని తాను ఫణంగా పెట్టుకుని కేసును ఛేదించిన ఈ సాహసికి మనమూ హ్యాట్సాఫ్‌ చెబుదామా!

 

  • Upvote 1
Link to comment
Share on other sites

8 hours ago, karthik25 said:

matter in 2 lines?

vandha godlanu thinna raabandhi okka gaali vaanaka poyinattu, entho mandini lepi mingina lafoot gaadokadu fafa kosam aasapadi bakara ayyaadu

Link to comment
Share on other sites

9 hours ago, Waffle said:

vadu malli 1 month lo bayataku vastadu 
appudu he will target her personal life 
#IndianLaws

Sad but true ... proofs anni pakka untey they should execute that criminal 

Link to comment
Share on other sites

12 hours ago, Waffle said:

vadu malli 1 month lo bayataku vastadu 
appudu he will target her personal life 
#IndianLaws

This is too much cheating. Papam vadi pasi manasutho adukondi 🤦‍♂️.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...