Jump to content

ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థలకు సెలవులు


kakatiya

Recommended Posts

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారిని కట్టడిచేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్‌ సెంటర్లను మూసివేయాలని ఆదేశించింది. కరోనా ప్రభావం నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో విద్య, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. చేపట్టిన చర్యలపై వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం నిర్ణయించారు. ఈనెల 31 వరకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అనంతరం పరిస్థితిని సమీక్షించి సెలవుల పొడిగింపుపై నిర్ణయం తీసుకోనుంది

Link to comment
Share on other sites

16 minutes ago, superhit3 said:

what happened to elections though?

జగన్ సర్కార్ కి షాకిచ్చిన సుప్రీం

 

సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తమను సంప్రదించకుండా ఎన్నుకలను వాయిదా వేసిందని ఆరోపిస్తూ జగన్ ప్రభుత్వం కోర్టుకు ఎక్కింది. అయితే ఎన్నికల వాయిదాపై ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను కొట్టేసింది కూడా. అయితే ఇక్కడ ఒక్క విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించిందని చెప్పచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ని ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ ఎత్తి వేయమని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణ ఎప్పుడనే దానిపై ఎస్‌ఈసీదే తుది నిర్ణయమన్న సుప్రీంకోర్టు కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే ఎస్‌ఈసీ అనుమతి తీసుకోంవాలని సూచించింది. కమిషన్ చెప్పినట్టే ఆరు వారాల తర్వాత ప్రభుత్వంతో సంప్రదించి.. ఎన్నికల నిర్వహణపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం తరపున అరగంటపాటు వాదనలు వినిపించారు సొలిసిటర్‌ జనరల్‌ మెహతా.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...