Jump to content

తమ లొకేషన్ చరిత్రను క్రియాశీలం చేసిన వినియోగదారుల డేటా


jetwings

Recommended Posts

what oO whattt eenadu..  (Good try. Nothing wrong by looks a bit strange ..lol I had to think for a minute to understand it)

పారిస్‌: కొవిడ్‌-19 మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భౌతిక దూరం నిబంధనను తెచ్చాయి. ఇది ఆశించిన ఫలితాలను ఇస్తోందా అన్నది కీలకం. ఈ నిబంధన ఎంత సమర్థంగా పనిచేసిందన్నది నిర్ధరించడంలో ప్రభుత్వాలకు ‘గూగుల్‌’ సాయపడనుంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల కదలికల తీరుతెన్నుల వివరాలను ఈ సంస్థ వెల్లడించనుంది. 131 దేశాలకు సంబంధించిన వివరాలను ఇవ్వనుంది. పార్కులు, దుకాణాలు, ఇళ్లు, పని ప్రదేశాలు వంటి చోట్లకు రాకపోకలు పెరిగాయా లేక తగ్గాయా అన్నది గూగుల్‌ వెల్లడిస్తుంది. ఉదాహరణకు ఫ్రాన్స్‌లో సాధారణ రోజులతో పోలిస్తే రెస్టారెంట్లు, షాపింగ్‌ కేంద్రాలు, మ్యూజియంలు, థీమ్‌ పార్కులు వంటి చోట్లకు ప్రజలు వెళ్లడం 88% మేర తగ్గినట్లు డేటాలో వెల్లడైంది. కొవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు ఈ వివరాలకు వీలు కల్పిస్తాయని గూగుల్‌ ప్రతినిధులు తెలిపారు. అత్యవసరంగా ఇళ్ల బయటకు రావాల్సిన వారు ఏ సమయంలో రావాలన్నది నిర్ధరించేందుకు తోడ్పడుతుందని చెప్పారు. సెల్ ఫోన్లో  తమ 'లొకేషన్' చరిత్రను క్రియాశీలం చేసిన వినియోగదారుల డేటా సాయంతో ఈ వివరాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో విడిగా వ్యక్తులను గుర్తించడానికి దోహదపడే సమాచారమేదీ ఉండదు.

 

https://www.eenadu.net/nationalinternational/latestnews/general/0700/120045254

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...