Jump to content

వుహాన్‌ నుంచి మేమిచ్చే సలహాలివే......వుహాన్‌లోని భారతీయులు


Tomb__ayya

Recommended Posts

వుహాన్నుంచి మేమిచ్చే సలహాలివే......వుహాన్లోని భారతీయులు

 

'ప్రమాదకరమైన కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే కఠిన లాక్‌డౌన్‌, స్వీయ నిర్బంధమే శరణ్యమని వుహాన్‌లోని భారతీయులు అంటున్నారు. ఇంట్లోంచి కాలు బయట పెట్టొద్దని ఇక్కడి పౌరులకు సూచిస్తున్నారు. వైరస్‌ ముప్పుతో చైనా నుంచి 700 మంది పౌరులను భారత్‌ స్వదేశానికి తరలించినా... వుహాన్‌ నుంచి మేమిచ్చే సలహాలివే....'ప్రమాదకరమైన కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే కఠిన లాక్‌డౌన్‌, స్వీయ నిర్బంధమే శరణ్యమని వుహాన్‌లోని భారతీయులు అంటున్నారు. ఇంట్లోంచి కాలు బయట పెట్టొద్దని ఇక్కడి పౌరులకు సూచిస్తున్నారు. వైరస్‌ ముప్పుతో చైనా నుంచి 700 మంది పౌరులను భారత్‌ స్వదేశానికి తరలించినా... వుహాన్‌ నుంచి మేమిచ్చే సలహాలివే.

బీజింగ్/వుహాన్: ప్రమాదకరమైన కరోనా వైరస్ను కట్టడి చేయాలంటే కఠిన లాక్డౌన్, స్వీయ నిర్బంధమే శరణ్యమని వుహాన్లోని ప్రవాసభారతీయులు అంటున్నారు. ఇంట్లోంచి కాలు బయట పెట్టొద్దనిఇక్కడిపౌరులకు సూచిస్తున్నారు. వైరస్ ముప్పుతో చైనా నుంచి700 మంది పౌరులనుభారత్ స్వదేశానికి తరలించినా కొందరుధైర్యంగా అక్కడే ఉండిపోయారు.76 రోజుల కఠిన లాక్డౌన్ ముగియడంతో సంతోషంగా ఉందన్నారు. అయితే లక్షణాలు కనిపించని వైరస్ వాహకులు ఉండొచ్చన్న భయంతో బయటకు వెళ్లడం లేదంటున్నారు.

ముందే లాక్డౌన్ పెట్టుంటే: మరో శాస్త్రవేత్త

 

prk7-wuahan1.jpg

లాక్డౌన్ ముగిసినందుకు సంతోషంగా ఉన్నా వైరస్ వాహకుల భయంతోబయటకు వెళ్లడం లేదని పేరు చెప్పేందుకు ఇష్టపడనిమరో శాస్త్రవేత్త అన్నారు. భారతీయులు కచ్చితంగా, కఠినంగా లాక్డౌన్ పాటించాలని సూచించారు. వుహాన్లో మరికొన్ని రోజులు ముందుగానేలాక్డౌన్ పెట్టుంటేఈ స్థాయిలో వైరస్ విజృంభించేది కాదన్నారు. స్వదేశంలో కుటుంబ సభ్యుల సంక్షేమం కోసంభారత దౌత్యకార్యాలయం కోరినా వుహాన్లోనే ఉండిపోయానన్నారు. ఇక్కడి ఆతిథ్యాన్ని నేను ఆస్వాదిస్తాను. నా యజమాని, స్థానిక మిత్రులుజాగ్రత్తగా చూసుకుంటారన్న నమ్మకం ఉండేది. వారు అలాగే నన్ను చూసుకున్నారు అని ఆయన పేర్కొన్నారు

 

స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష

prk7-wuahan2.jpg

 

కష్టాల్ని వదలిపారిపోవడం భారతీయుల నైజం కాదనికేరళకు చెందిన అరుణ్జీత్ అన్నారు. ఒకవేళ కేరళకు తిరిగొచ్చినాతన భార్య, పిల్లలు,70 ఏళ్ల వయసున్నతల్లిదండ్రులకు ప్రమాదమని వుహాన్లోనే ఉన్నానన్నారు.ఒకప్పుడు మైక్రో బయాలజిస్టైనఆయన ప్రస్తుతం హైడ్రాలజిస్టుగా పనిచేస్తున్నారు. భారత్ సరైన సమయంలో లాక్డౌన్ విధించిందని, వర్షాకాలం ఆరంభమైతే ప్రజల రోగనిరోధక శక్తి తగ్గి సమస్య అత్యంత జటిలమయ్యేదని వివరించారు.చల్లని వాతావరణంలో వైరస్ విజృంభిస్తుందని వెల్లడించారు. లాక్డౌన్ కఠినంగా అమలు చేయడం, స్వీయ నిర్బంధంలో పాల్గొనడమే వుహాన్ నుంచి భారతీయులకు తానిచ్చే సలహా అన్నారు. 72 రోజులు నా గదికే అంకితమయ్యా. మా పొరుగింట్లో వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు ఒక్కసారీ ఫ్లాట్బయటకు రావడం నేను చూడలేదు అని ఆయన అన్నారు.

ఇంకా భయం భయంగానే..

prk7-wuahan3.jpg

 

గతేడాది డిసెంబర్లోనే సహచర శాస్త్రవేత్తలు వైరస్ వ్యాప్తి గురించి విన్నారని అరుణ్జిత్ చెప్పారు. పరిస్థితి విషమించడంతో మాస్క్లు ధరించారని తెలిపారు.వుహాన్లో లాక్డౌన్ ఎత్తేసినప్పటికీ లక్షణాలు కనిపించని వ్యక్తులు తిరుగుతారన్న భయంతో చాలామంది బయటకు రావడం లేదన్నారు. వైరస్ను అర్థం చేసుకోవడం సులభం కాదు. ఎంతో సంక్లిష్టమైన జీరో కేస్ను గుర్తించేంత వరకు అర్థమవ్వదు. అందుకేమొదట చైనీస్ త్వరగా చర్యలు చేపట్టలేదు. తర్వాత వేగంగా చర్యలు తీసుకున్నారు. చైనా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అటవీ జంతువులను విపరీతంగా తినే అలవాటుంది.అందుకే జంతువుల నుంచే మనుషులకు వైరస్ సోకిందన్న అనుమానాలు ఉన్నాయి అని అరుణ్జిత్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 15 లక్షల మందికి కరోనా సోకగా 88,500కి పైగా మృతిచెందిన సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

Gruddalu pagalad€ngi intlo kusopedithe sweeya nirbandam antadenti na sinthakay... comedy+dance+GIF.gif

Anni cheppadu Kani asalu lekkallo bokka vunda Leda Ani Matram seppaledu eedu! 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...