Jump to content

AP Hot Spots

AndhraneedSCS

Recommended Posts

04162020025748n91.jpg

  • రాష్ట్రంలో 11 జిల్లాలు ఆ జాబితాలోకే
  • 20కి పైగా కేసులు నమోదైతే ఆ పరిధిలోకి
  • సేఫ్‌ జోన్‌లో శ్రీకాకుళం, విజయనగరం
  •  

అమరావతి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): కంటికి కనిపించకుండా కకావికలం చేస్తున్న కరోనా మహమ్మారి ఏపీలో హాట్‌స్పాట్‌గా మారింది. రాష్ట్రంలో 11 జిల్లాలను హాట్‌స్పాట్లుగా గుర్తించినట్టు కేంద్రం బుధవారం ప్రకటించింది. మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ మార్గదర్శకాలు ఇచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి కేంద్ర బిందువుగా మారిన జిల్లాల్లో ప్రత్యక్ష కార్యాచరణ అమలుపై కేంద్రం దృష్టి సారించింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 170 జిల్లాలను హాట్‌స్పాట్లుగా గుర్తించామని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతీ సుడాన్‌ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖరాశారు. కేంద్రం ప్రకటించిన హాట్‌స్పాట్‌లన్నీ రెడ్‌జోన్‌ పరిధిలోకి వచ్చేవే. ఈ జాబితాలో ఏపీ నుంచి కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.

ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదుకాని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మాత్రం సేఫ్‌జోన్‌లో ఉన్నాయి. 20కిపైగా కేసులు నమోదైన ప్రతీ జిల్లాను హాట్‌స్పాట్‌గా.. అందులోనూ అత్యధిక కేసులున్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌ క్లస్టర్లుగా ప్రకటించారు. దేశం మొత్తమ్మీద 43 ప్రాంతాలు హాట్‌స్పాట్‌ క్లస్టర్లుగా వర్గీకరించారు. అయితే, ఏపీలో క్లస్టర్‌ ప్రస్తావన లేదు. అంటే మొత్తం 11 జిల్లాలు హాట్‌స్పాట్‌ క్లస్టర్లుగానే భావించాల్సి ఉంటుంది. క్లస్టర్‌ అంటే జిల్లాలో కేసుల సంఖ్యభారీగా ఉన్న ప్రాంతాలతో కూడిన సముదాయం. ఈ నెల 20 నుంచి కేంద్రం ఇచ్చిన మినహాయింపులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు మాత్రమే వర్తిస్తాయి. 

ప్రతీ వారం సమీక్ష 

హాట్‌స్పాట్‌లపై ప్రతీవారం సమీక్ష ఉంటుందని కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు కూడా ఈ పని చేయాలంటూ ప్రీతీ సుడాన్‌ వెల్లడించారు. ‘హాట్‌స్పాట్‌లపై ప్రతీ సోమవారం సమీక్ష చేయాలి. వీటి పరిధిలో లేకుండా, రెట్టింపు కేసులు నమోదయ్యే ప్రాంతాలను జాబితాలో చేర్చాలి. ఆరెంజ్‌ జోన్‌లో 14రోజుల వ్యవధిలో ఒక్క కేసు నమోదు కాకపోతే అక్కడ కంటైన్‌మెంట్‌ ముగిసినట్లే. 28 రోజుల తర్వాత కొత్త కేసులు నమోదు కాకపోతే అది పూర్తిగా గ్రీన్‌జోన్‌లోకి వెళ్లినట్లుగా భావించాలి’ అని ప్రీతీ సుడాన్‌ రాష్ట్రాలను కోరారు. 

ఏపీ ముందున్న కర్తవ్యం!

కేంద్రం ఆదేశాల నేపథ్యంలో హాట్‌స్పాట్‌ల జాబితాను రాష్ట్రం ప్రకటించాలి. కరోనా నియంత్రణకు తీసుకునే చర్యలు, ఏ ప్రాంతాలకు వెసులుబాట్లు కల్పిస్తారో? కఠినంగా నియంత్రించే అంశాలను ప్రకటించాల్సి ఉంది. ‘హాట్‌స్పాట్‌ల పరిధిలో ఇంతకుముందు ప్రకటించిన కార్యకలాపాలు, వెసులుబాట్లు వర్తించవు. ప్రజల కదలికలు, వాహనాల రాకపోకలు నియంత్రణలో ఉండాలి. కాబట్టి వీటిపై వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు పక్కాగా అమలు చేస్తూ రాష్ట్రాలు తగిన మార్గదర్శకాలు ఇవ్వాలి’ అని కేంద్రం హోంశాఖ కోరింది.

Link to comment
Share on other sites

5 minutes ago, AndhraneedSCS said:

Anni ayye unnayi oka 2 districts tappinchi ...

@snoww and @bhaigan please ask Jagananna to split each mandal into a district and fix this ASAP.

Baboru already briefed Bodi about zones. He will take care

Link to comment
Share on other sites

It comes and it goes annaru kadha ra... It came and it will never go.... Country motham lo andhra antha safe state inkokati ledhu annaru.. State motham red zone lo undhi kadha..... Ippudu em antaaru 

Link to comment
Share on other sites

లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం..!

Coronavirus Outbreak, లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం..!

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు మన దేశంలో 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ చైన్‌ను నియంత్రించడానికి కేంద్రం విధించిన లాక్ డౌన్‌ను విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌ స్థానంలో నిలిచిందని జాతీయ మీడియా సర్వే వెల్లడించింది. కేంద్రం విధించిన లాక్ డౌన్‌ను సక్రమంగా అమలు చేస్తూ.. కరోనా కట్టడికి కృషి చేస్తున్న రాష్ట్రాలపై ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ ఎన్డీటీవీ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం, కేరళ రెండో ప్లేస్‌లో నిలిచాయి. కరోనా వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని.. అందువల్లే పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా పెరగడం లేదని తెలిపింది.

కాగా కరోనాను నియంత్రించడంలో ఏపీ ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. ప్రతీ ఆసుపత్రిలోనూ ఐసోలేషన్ వార్డు తప్పనిసరిగా ఉండాలన్న సీఎం జగన్.. కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేయనున్నారు. అటు ప్రతీ జిల్లాలోనూ ఇంటింటా సర్వే నిర్వహిస్తూ.. పొడి దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నారు. అంతేకాక ఎక్కువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి కంటైన్‌మెంట్‌ జోన్లుగా పెడుతున్నారు. కాగా ఈ ఎన్డీటీవీ సర్వే వీడియోను మంత్రి పేర్ని నాని, హోం మినిస్టర్ మేకతోటి సుచరిత ట్వీట్ చేసి రాష్ట్ర ప్రజలు దేనికి భయపడాల్సిన పని లేదని.. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపడుతోందని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ నెల 30 వరకు లాక్ డౌన్ కొనసాగించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో రెండోదశ లాక్ డౌన్ ఎలా ఉంటుంది.? సడలింపులు ఏమైనా ఉంటాయా.? ఏయే పరిశ్రమలకు, సంస్థలకు మినహాయింపు ఇస్తారు.? అనే వివరాలను తెలియజేయనున్నారు.

తెలియజేయనున్నారు.

Andhra Pradesh has been consistently performing better each day because of the various strict measures & initiatives taken by the Govt under the leadership of @ysjagan. The curve is flattening & no. of cases are reducing by the day. Rest assured, #APInSafeHands

View image on Twitter
 
Andhra Pradesh has been ranked the most successful Lockdown state in India by @ndtv. By obeying the strict measures laid out by the Govt., we are breaking the chain of #Covid19.
I urge you all to #StayAtHome & not worry because you are in safe hands. #APInSafeHands

Embedded video
 
  • Upvote 1
Link to comment
Share on other sites

3 hours ago, ARYA said:

District vise doesnt work, they should get down you pin code wise

Agreed Mari district level red zones ante bokke...US lo laga county wise iyyali appudu a area lo unnollu relax avvocchu

Link to comment
Share on other sites

25 minutes ago, Somedude said:

లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం..!

Coronavirus Outbreak, లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం..!

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు మన దేశంలో 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ చైన్‌ను నియంత్రించడానికి కేంద్రం విధించిన లాక్ డౌన్‌ను విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌ స్థానంలో నిలిచిందని జాతీయ మీడియా సర్వే వెల్లడించింది. కేంద్రం విధించిన లాక్ డౌన్‌ను సక్రమంగా అమలు చేస్తూ.. కరోనా కట్టడికి కృషి చేస్తున్న రాష్ట్రాలపై ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ ఎన్డీటీవీ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం, కేరళ రెండో ప్లేస్‌లో నిలిచాయి. కరోనా వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని.. అందువల్లే పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా పెరగడం లేదని తెలిపింది.

కాగా కరోనాను నియంత్రించడంలో ఏపీ ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. ప్రతీ ఆసుపత్రిలోనూ ఐసోలేషన్ వార్డు తప్పనిసరిగా ఉండాలన్న సీఎం జగన్.. కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేయనున్నారు. అటు ప్రతీ జిల్లాలోనూ ఇంటింటా సర్వే నిర్వహిస్తూ.. పొడి దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నారు. అంతేకాక ఎక్కువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి కంటైన్‌మెంట్‌ జోన్లుగా పెడుతున్నారు. కాగా ఈ ఎన్డీటీవీ సర్వే వీడియోను మంత్రి పేర్ని నాని, హోం మినిస్టర్ మేకతోటి సుచరిత ట్వీట్ చేసి రాష్ట్ర ప్రజలు దేనికి భయపడాల్సిన పని లేదని.. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపడుతోందని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ నెల 30 వరకు లాక్ డౌన్ కొనసాగించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో రెండోదశ లాక్ డౌన్ ఎలా ఉంటుంది.? సడలింపులు ఏమైనా ఉంటాయా.? ఏయే పరిశ్రమలకు, సంస్థలకు మినహాయింపు ఇస్తారు.? అనే వివరాలను తెలియజేయనున్నారు.

తెలియజేయనున్నారు.

Andhra Pradesh has been consistently performing better each day because of the various strict measures & initiatives taken by the Govt under the leadership of @ysjagan. The curve is flattening & no. of cases are reducing by the day. Rest assured, #APInSafeHands

View image on Twitter
 
Andhra Pradesh has been ranked the most successful Lockdown state in India by @ndtv. By obeying the strict measures laid out by the Govt., we are breaking the chain of #Covid19.
I urge you all to #StayAtHome & not worry because you are in safe hands. #APInSafeHands

Embedded video
 
AP Kerala and Karnataka cases considerable ga taggai Gujrat worst performing state anta lol bodi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...