Jump to content

మృతుల్లో 1600 మంది ప్రవాస భారతీయులు


snoww

Recommended Posts

 

అమెరికాలో భారతీయుల భవిత అగమ్యగోచరం

04162020031244n6.jpg

 

  • ఉపాధి కోల్పోయున లక్షలాది మంది 
  • మృతుల్లో 1600 మంది ప్రవాస భారతీయులు 
  • వారిలో 23 మంది తెలుగు రాష్ర్టాల వారు 
  • ‘ఆంధ్రజ్యోతి’తో తానా కేంద్ర కమిటీ సభ్యుడు లెక్కల వెంకటేశ్వరరావు
  •  

నర్సీపట్నం, ఏప్రిల్‌ 15: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికాలో భారతీయుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని తానా కేంద్ర కమిటీ సభ్యుడు లెక్కల వెంకటేశ్వరరావు చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడిన ఆయన అక్కడ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, రెండు ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు యజమానిగా కూడా కొనసాగుతున్నారు. విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన ఆయన గతంలో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్‌ విద్యా బోధనకు అవసరమైన సామగ్రిని అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీకి జన్మభూమి సమన్వయకర్తగా కూడా సేవలందించారు. ప్రస్తుతం అమెరికాలోని తెలుగువారికి అండగా ఉంటూ పలు సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ‘కరోనా’ నేపథ్యంలో అమెరికాలోని ప్రవాస భారతీయులపైన, ప్రత్యేకించి తెలుగు వారిపైన ఆ ప్రభావం గురించి సోమవారం ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఫోన్‌ ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఆ స్థాయి మరణాలకు జీవన విధానమే కారణం..

కరోనా బాధితుల మరణాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. అయితే అమెరికాలో 70 శాతం రాష్ర్టాలు సురక్షితంగా ఉన్నాయి. వాషింగ్టన్‌, న్యూయార్క్‌, ఫ్లోరిడా, న్యూజెర్సీ, టెక్సాస్‌, కాలిఫోర్నియా వంటి రాష్ర్టాలు మాత్రమే డేంజర్‌ జోన్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో జనసాంధ్రత, అంతర్జాతీయ విమానాశ్రయాలు అధికంగా ఉండడం, నగరాల శివారు ప్రాంతాల్లో అధికంగా నివసించే ప్రజలు ప్రతిరోజు లోకల్‌ రైళ్లలో ఉద్యోగాలకు వెళ్లి రావడం, బస్సుల్లోనూ ప్రయాణించే సమయంలో భౌతిక దూరం పాటించకపోవడం, సకాలంలో లాక్‌డౌన్‌ అమలు చేయకపోవడం, కెనడా, మెక్సికో దేశాల సరిహద్దులు సమీపంలో ఉండడం వంటి కారణాల వల్లనే వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది. ఇక్కడ మృతుల్లో ప్రవాస భారతీయుల సంఖ్య 1600కు పైగా ఉంది. న్యూయార్క్‌, న్యూజెర్సీ వంటి ప్రాంతాల్లో సమాచారం మాత్రమే భారత మీడియాకు అందుతోంది. అందుకే వాస్తవ గణాంకాలు వెల్లడికావడం లేదు. ఇప్పటి వరకు తెలుగు రాష్ర్టాలకు చెందిన 23 మంది వరకు మృత్యువాత పడినట్టు తానాకు సమాచారం అందింది. 

 

విద్యార్థులు కష్టాల పాలు..

ఉన్నత విద్య కోసం ఏటా వేలాది మంది భారతీయ విద్యార్థులు అమెరికా వస్తున్నారు. కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించడంతో వసతి గృహాలను మూసివేశారు. విమాన రాకపోకలు నిషేధించడంతో స్వదేశానికి వెళ్లే మార్గమూ లేదు. దీంతో తానా చొరవ తీసుకొని అమెరికాలో స్థిరపడిన కొందరు గుజరాతీల హోటళ్లలో రెండు నెలల పాటు ఉండే అవకాశాన్ని భారతీయ విద్యార్థులకు కల్పించింది. ప్రస్తుతం 20 వేల మందికిపైగా భారతీయ విద్యార్థులు ప్రస్తుతం భోజన, వసతి సదుపాయాలకు అష్టకష్టాలు పడుతున్నారు. 

 

ఆంధ్రుల అలవాట్లే కాపాడుతున్నాయి..

ఆసియా ఖండంలో నివసించే వారికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా భారతీయులకు ప్రత్యేకించి  ఆంధ్రుల ఆహారపు అలవాట్లే కరోనా వంటి ప్రాణాంతక వైరస్‌ బారి నుంచి కొంత కాపాడుతున్నాయి. మసాలా దినుసులు, కారం, అల్లం, పసుపు వంటివి ఎక్కువగా వినియోగించడం వల్ల ఆంధ్రుల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటోంది. 

భారత్‌ చర్యలపై ప్రశంసలు..

కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. 130 కోట్ల ప్రజానీకాన్ని ఒకేమాటపై నిలబెట్టడం ప్రధాని మోదీకే చెందింది. భారత్‌లోని ప్రజల క్రమశిక్షణ, కృతనిశ్చయం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయి.

 

 

వీధిన పడుతోన్న ప్రవాస భారతీయులు..

కరోనా ప్రభావంతో అమెరికాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారిలో ప్రవాస భారతీయులే అధికం. విద్యార్థులు, హెచ్‌1 వీసాపై వచ్చిన వారు, గ్రీన్‌కార్డు పొందినవారు, అమెరికా పౌరసత్వం పొందినవారు అనే నాలుగు రకాలుగా విదేశీయులు ఉన్నారు. అమెరికా పౌరసత్వం ఉన్నవారికి వీసా స్టేట్‌సతో అవసరం ఉండదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి అమెరికాలో ఉద్యోగం పోతే జీతం ఉండదు. బీమా సదుపాయం అమలు కాదు. అటువంటివారు 60 రోజుల్లో మరో ఉద్యోగం వెతుక్కోవాలి. లేకుంటే అనధికారికంగా నివసిస్తున్న వ్యక్తులుగా పరిగణించి అమెరికా నుంచి పంపించివేస్తారు. రానున్న అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అమెరికన్లందరికీ ఏదో ఒక విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ట్రంప్‌ నిర్ణయించారు. దీంతో విదేశీయులందరికీ రానున్నవి గడ్డురోజులే.

  • Like 1
Link to comment
Share on other sites

 

ఆ వార్తకు.. ‘తానా’కు సంబంధం లేదు: తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి

 

వాషింగ్టన్: మీడియాలో "అమెరికాలో భారతీయుల భవిత" అనే అంశం పేరిట ప్రచురితమైన వార్తకు.. తానా సంస్థకు సంబంధం లేదని తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, బోర్డు చైర్మన్ హరీష్ కోయ, కార్యదర్శి రవి పొట్లూరి స్పష్టం చేశారు. తానాలో కేంద్ర కమిటీ అనేదే లేదని తేల్చి చెప్పారు. అందులో సభ్యుల పేరిట వచ్చిన వార్త కేవలం వ్యక్తిగత అభిప్రాయాలుగా మాత్రమే  భావించవల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో అమెరికన్ల మాదిరిగానే భారతీయులు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అయితే పరిస్థితులు తీవ్రంగానే ఉన్నప్పటికీ భారతీయులు ప్రత్యేకంగా తెలుగువారు తగు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగానే ఉంటున్నారని తెలిపారు. తానా టీం స్క్వేర్ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ ప్రారంభించి సాధ్యమైనంత మేరకు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. వివిధ రంగాలలోని నిపుణులతో వెబినార్స్ నిర్వహించి, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండే విధంగా తెలుగువారిలో అవగాహన పెంపొందించడానికి కృషి చేస్తున్నామని తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి తెలిపారు.

  • Upvote 2
Link to comment
Share on other sites

Aat maaka...

idi emi variety news va...aadu emo TANA antadu...eedu emo kaadu antadu...rendu news lo vastayi..

ae paper kaka idi ? ABN ae na ?

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

Aat maaka...

idi emi variety news va...aadu emo TANA antadu...eedu emo kaadu antadu...rendu news lo vastayi..

ae paper kaka idi ? ABN ae na ?

Yes

Link to comment
Share on other sites

4 minutes ago, Hydrockers said:

1600 ?

 

Don't think so. Edo stores lo work sese low paying sese indians thappa ekkuva Indians affect ayyi vundaru. 

1600 nijam avuthe gofundme crash ayyedi new listings tho. 

it might be 100-200 at most. 

Link to comment
Share on other sites

Lekkala Babu anta... Peruthone Lekkalu seyyatam first time sustunna .. Uncle Credit card lekkallo enni shopping vunnayo seppamanu with details appudu nammutham... Ledante mingeymanu

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Thu eedi bratuku...akariki isonti lafda information kuda verify chesukoni veyaleda ? 

Adi bathuke antha kada

Anni anta .com news le

Link to comment
Share on other sites

According to HIPPA rules they cant disclose this without patient's consent. How can thye know these details? Even for govt projects for statistics,  new bills and initiatives we obfuscate these demographics and race details for death records and provide data. Morons !

Link to comment
Share on other sites

23 minutes ago, Amrita said:

According to HIPPA rules they cant disclose this without patient's consent. How can thye know these details? Even for govt projects for statistics,  new bills and initiatives we obfuscate these demographics and race details for death records and provide data. Morons !

Sontha kavithvam 

  • Upvote 1
Link to comment
Share on other sites

17 minutes ago, Sucker said:

Eeyana daggara shopping list vuntada ? TANA anagane pranam lechechindi. 

Ni karuvu tagaleyya

Hyd local ee ga aa nandu gadi contact dorikite try chesuko

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...