Jump to content

ఒకరి, బదులు, మరొకరు, డిశ్ఛార్జ్‌ . .కరోనా పాటిజివ్ వ్యక్తి కలకలం


Tomb__ayya

Recommended Posts

ఒకరి, బదులు, మరొకరు, డిశ్ఛార్జ్‌

కరోనా పాటిజివ్ వ్యక్తి కలకలం

తిరిగి ఆసుపత్రికి వెళ్లేందుకు ససేమిరా

12_119.jpg

 

తాడేపల్లి, న్యూస్టుడే: కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని పొరపాటున డిశ్ఛార్జ్ చేయడం కలకలం రేపింది. గుంటూరులోని కాటూరి వైద్య కళాశాల క్వారంటైన్ కేంద్రంలో ఇద్దరు కరోనా అనుమానితులు ఉన్నారు. వారిద్దరి పేర్లూ ఒకటే. ఇద్దరికీ కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా, వారిలో ఒకరికి నెగెటివ్ వచ్చింది. అయితే సిబ్బంది పొరపాటున తాడేపల్లికి చెందిన వ్యక్తికి నెగెటివ్ వచ్చినట్లుగా ధ్రువపత్రంతో పాటు రూ.2వేల నగదు అందజేసి శనివారం రాత్రి అతడిని ఇంటికి పంపేశారు. కానీ నివేదిక అదే పేరుతో ఉన్న రెండో వ్యక్తిది. జరిగిన పొరపాటును ఆదివారం ఉదయం గుర్తించిన అధికారులు తాడేపల్లి చేరుకుని పాజిటివ్ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో సంఘటన వెలుగుచూసింది. అప్పటికే వ్యక్తి ఇంట్లోని వారితో కలిసిపోయారు. తనకు నెగెటివ్ వచ్చిందంటూ ధ్రువపత్రం చూపించి.. తిరిగి ఆసుపత్రికి వెళ్లేందుకు నిరాకరించారు. వైద్యాధికారి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి.. అతడిని 108 అంబులెన్సులో ఎన్నారై వైద్యశాలలోని ఐసోలేషన్కు తరలించారు. అనంతరం ఆయన భార్య, కుమార్తెను, మరో ఇద్దరిని మరో అంబులెన్సులో క్వారంటైన్కు పంపారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...