Jump to content

కేసులు పెరుగుతున్నా.. హిందుపురాన్ని వదిలేశారా


Hydrockers

Recommended Posts

పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌లో అలసత్వం

కట్టడి వ్యూహంలో తప్పుతున్న గురి

శాంపిళ్ల సేకరణలో మీనమేషాలు..

క్వారంటైన్‌కు తరలించటంలోనూ అదే వైఖరి..

ప్రత్యేక దృష్టి సారిస్తేనే నియంత్రణ

 

అనంతపురం(ఆంధ్రజ్యోతి): హిందూపురంలో రోజూ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా జిల్లా అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైరస్‌ కట్టడి చర్యల్లో అడుగడుగునా విఫలమవుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కరోనా బాధితుల కాంటాక్ట్‌లను గుర్తించటం, వారిని క్వారంటైన్‌కు తరలించటంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారుల తీరును చూస్తుంటే హిందూపురాన్ని వదిలేశారనిపిస్తోందని స్థానికులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు.

 

హిందూపురం ప్రజల గోడు వినే నాథుడే కరువయ్యాడు. రోజురోజుకీ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. జిల్లాలో నమోదైన 36 పాజిటివ్‌ కేసుల్లో 20 హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోవే. దీంతో ఏ రోజు ఏ కాలనీలో ఎవరికి కరోనా పాజిటివ్‌ తేలుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పట్టణంలో ఇప్పటికే ఏడు ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. తాజాగా బోయపేటకు చెందిన మహిళకు పాజిటివ్‌ అని తేలటంతో ఆ ప్రాంతాన్ని కూడా చేర్చారు. హిందూపురం మున్సిపాలిటీ 75 శాతం రెడ్‌జోన్‌లో ఉన్నట్లే. ఆ ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు, పండ్లు, మెడిసిన్‌ ఇలా ఏది కావాలన్నా.. బయటి వ్యక్తులు, ప్రభుత్వం నియమించిన వలంటీర్లే దిక్కు. ఈ దుస్థితికి కారణం అధికారుల్లో ముందుచూపు కొరవడటమేనన్న అభిప్రాయం ఆ ప్రాంత ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవటంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌లో అలసత్వం

కర్ణాటక రాష్ట్రంలోని గౌరీబిదునూరు, హిందూపురానికి చెందిన దాదాపు 45 మంది మక్కా యాత్రకు వెళ్లివచ్చారు. వారంతా గతనెల 16న జిల్లాకు వచ్చారు. అప్పటి వరకూ జిల్లాలో కరోనా ప్రకంపనలు లేవు. అదేనెల 20న గౌరీబిదునూరుకు చెందిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ నమోదైంది. 21వ తేదీ జిల్లా యంత్రాంగానికి ఆ సమాచారం చేరింది. మరుసటి రోజే అధికారులు అప్రమత్తం కావాల్సి ఉంది. మూడ్రోజుల తరువాత అంటే 25న రంగంలోకి దిగారు. రాత్రికిరాత్రే వారందరినీ క్వారంటైన్‌లో ఉంచారు. వారి శాంపిళ్లు సేకరించాలి. ఆ విషయంలోనూ అలసత్వం ప్రదర్శించారు.

 

తర్వాత వరుసగా పాజిటివ్‌ కేసులు నమోదవుతూ వచ్చాయి. వైరస్‌ బారిన పడిన వ్యక్తులు అంతకుముందు ఎవరెవరితో కలిశారో వివరాలు సేకరించాలి. అధికారులు ఆ చైన్‌ లింక్‌ను కొనసాగించటంలో మీనమేషాలు లెక్కించారు. ఈ పర్యవసానాలే హిందూపురంలో పాజిటివ్‌ కేసులు పెరగటానికి ప్రధాన కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గౌరీబిదునూరులో పాజిటివ్‌ కేసు తేలిన వెంటనే జిల్లా అధికారులు అప్రమత్తమై ట్రేసింగ్‌.. టెస్టింగ్‌.. ట్రీట్మెంట్‌ ఫార్ములాను అనుసరించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

 

ఇప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎంతసేపూ పాజిటివ్‌ కేసుల దగ్గరి కాంటాక్ట్‌లపైనే దృష్టి పెడుతున్నారు తప్పా.. వారు ఏడు రోజులకు ముందు ఎవరెవరితో.. ఏ ప్రాంతాల్లో తిరిగారోనన్న వివరాలను స్పష్టంగా సేకరించలేకపోతున్నారన్న వాదన ఉంది. కాంటాక్ట్‌లను వేగంగా గుర్తించకపోవటంతోనే ఈ పరిస్థితి ఎదురవుతోందన్న నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

 

కట్టడి వ్యూహంలో తప్పుతున్న గురి

మక్కా యాత్రికులు, వారి కాంటాక్ట్‌లపైనే ప్రధానంగా అధికారులు దృష్టి సారించారు. ఇక్కడే కరోనా కట్టడి వ్యూహంలో గురి తప్పుతోంది. తాజాగా గుజరాత్‌కు చెందిన ఇద్దరు కరోనా వైర్‌స బారిన పడ్డారు. వారిద్దరికి పాజిటివ్‌ అని తేలింది. వీరికి ఢిల్లీ జమాత్‌తో సంబంధాలున్నట్లు ఆ ప్రాంతంలో ప్రచారం సాగుతోంది. నెలన్నర రోజులుగా 126 మంది దాకా.. ఆ ప్రాంతవాసులు అక్కడే గుజరాత్‌ వాసులతో కలిసి బస చేశారు. వారిని పరీక్షించి, క్వారంటైన్‌కు పంపటంలోనూ అధికారులు కొంత మెతక వైఖరి అవలంబిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కరోనా మూలాలున్న ప్రాంతంలో ప్రధానంగా దృష్టి పెట్టడంతోనే కట్టడి చేయగలమనటంలో సందేహం లేదు. ఆ దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేయాలి.

 

ప్రత్యేక దృష్టి సారిస్తేనే మనుగడ

హిందూపురం ప్రజల్లో నెలకొన్న భయం, అభద్రతాభావాన్ని పోగొట్టాలంటే జిల్లా యంత్రాంగం ఆ ప్రాంతంలో మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రత్యేక దృష్టి సారిస్తేనే ఆ ప్రాంత ప్రజలకు మనుగడ ఉంటుంది. లేదంటే పాజిటివ్‌ కేసులు మరిన్ని పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మేల్కోవాలి. కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సి ఉంది

Link to comment
Share on other sites

adhi maa rayalaseema kaka, emanna amrika naa thummithe 911 kal chesthe immediate ga police and ambulance ravadaaniki. . . what tests u r talking abt, more than 70% people ku ippati varaku okkasari kuda normal blood test chesundaru in their life time for fever or any other reason. . . antha healthy mem, jonna rottelu thinna body. . . 

Link to comment
Share on other sites

17 minutes ago, chintumintu1 said:

eesari hundupur loo ycp flag hoisting chedam ni pulkas ki corona spread chestunaru anta @tdp told 

Mari balaya babu em peeking ?

Mansoon House ekkada dorukuda ani andariki phone lu chestunada ani @ycp asking

Link to comment
Share on other sites

10 minutes ago, SilentStriker said:

ma blood ,breed veru ..yevadra ma deggara cases perugutunnayi antunna bala

ahh blood ki corona raa kudadhu kada. how affected?

gallery_48905_1_50670.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...