Jump to content

అమెరికాలో ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం మాయం!

All_is_well

Recommended Posts

  • అమెరికాలో 1930 మహామాంద్యం నాటి పరిస్థితులు
  • గత వారం నిరుద్యోగ భృతి కోసం 44 లక్షల మంది దరఖాస్తు
  • నిరుద్యోగ రేటు 10 శాతానికిపైగా నమోదయ్యే అవకాశం
 
tn-3d8fb26541be.jpg
app-ad1.gif
కరోనాతో విలవిల్లాడుతున్న అమెరికాలో ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కోట్లాదిమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. తాజా ఉద్యోగ గణాంకాల ప్రకారం అక్కడ ప్రతి ఆరుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోతున్నట్టు తేలింది. 1930లో ఏర్పడిన మహామాంద్యం తర్వాత మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఏర్పడినట్టు నిపుణులు చెబుతున్నారు. 1931-40 మధ్య నిరుద్యోగ రేటు కనిష్ఠంగా 14 శాతానికి పైగా ఉండగా, గరిష్ఠంగా 25 శాతంగా నమోదైంది.  

2008-09లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం సమయంలో నిరుద్యోగ రేటు 10 శాతం ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన సంక్షోభం వల్ల వచ్చే ఏడాదికి నిరుద్యోగ రేటు 10 శాతానికి పైగా నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాదిమంది ఇప్పటికే నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గత వారంలో 44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు ట్రంప్ ప్రభుత్వం తెలిపింది
Link to comment
Share on other sites

సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయింది. అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తూ బతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జన సంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడ్డాడు.

ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజూ భగవంతుని వేడుకుంటూ ఉన్నాడు. ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఎవరూ కానరాలేదు. చూసి చూసి విసిగిపోయాడు.

ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒకబ్చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. ఆ గుడిసె లో అలల తాకిడికి కొట్టుకువచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు దాచుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు.

తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి. తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు. తనకు పట్టిన దుర్గతిని తలుచుకుని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు.

తెల్లవారి లేచి చూసేసరికి ఒక నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది. అది అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి అవధుల్లేవు. ఆ నావలోని వాళ్ళలో ఒకర్ని "నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది?" అని అడిగాడు.

"నువ్వు మంట పెట్టి పొగ ద్వారా మాకు సంజ్ఞలు చేశావు కదా. దానిని గుర్తు పట్టే ఇక్కడికి రాగలిగాం" అన్నాడు ఒక్కోసారి మన ఆశల సౌధాలు ఇలాగే ఒక్కసారి తగలబడిపోవచ్చు. కానీ అదే మంటలు ఏ మంచికో సంకేతం
కావచ్చు.

వాన రాకడయును బ్రాణంబు పోకడ
కానబడ దదెంత ఘనునికైన
గానబడిన మీద గలియేట్లు నడచురా
విశ్వదాభిరామ వినురవేమ!

ఎంత గొప్పవాళ్లకైనా వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అలా తెలిస్తే మనిషి భయానికి, నిరాశకు లోనవుతాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి - చెడు, సుఖం - దుఃఖం, కష్టం - నష్టం వస్తూ ఉంటాయి. ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా అంతా మన మంచికే అనుకొని మనుషులు ఆటుపోట్లను తట్టుకొని జీవించాలి.

           🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏

Link to comment
Share on other sites

2 minutes ago, All_is_well said:
  • అమెరికాలో 1930 మహామాంద్యం నాటి పరిస్థితులు
  • గత వారం నిరుద్యోగ భృతి కోసం 44 లక్షల మంది దరఖాస్తు
  • నిరుద్యోగ రేటు 10 శాతానికిపైగా నమోదయ్యే అవకాశం
 
tn-3d8fb26541be.jpg
app-ad1.gif
కరోనాతో విలవిల్లాడుతున్న అమెరికాలో ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కోట్లాదిమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. తాజా ఉద్యోగ గణాంకాల ప్రకారం అక్కడ ప్రతి ఆరుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోతున్నట్టు తేలింది. 1930లో ఏర్పడిన మహామాంద్యం తర్వాత మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఏర్పడినట్టు నిపుణులు చెబుతున్నారు. 1931-40 మధ్య నిరుద్యోగ రేటు కనిష్ఠంగా 14 శాతానికి పైగా ఉండగా, గరిష్ఠంగా 25 శాతంగా నమోదైంది.  

2008-09లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం సమయంలో నిరుద్యోగ రేటు 10 శాతం ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన సంక్షోభం వల్ల వచ్చే ఏడాదికి నిరుద్యోగ రేటు 10 శాతానికి పైగా నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాదిమంది ఇప్పటికే నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గత వారంలో 44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు ట్రంప్ ప్రభుత్వం తెలిపింది

TV9 debate ki topic dorkindi e roju..

Link to comment
Share on other sites

కరోనాతో విలవిల్లాడుతున్న అమెరికాలో”

Koncham pichakuntla athi for TRPs thaggiste baguntundi. Dead body meeda chillar erukune beggars laga sounding ee news reporters. Thoo nee yabba!

no problem with unemployment - the country will deal with it. It always has!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...