Jump to content

స్టార్ హీరోయిన్స్ ఈమెను చూసి నేర్చుకోవాలి


tamu

Recommended Posts

హైదరాబాద్‌: అందంతోనే కాదు, మంచి మనసుతోనూ ఫిదా చేస్తున్నారు కథానాయిక ప్రణీత. తెలుగులో ‘బావ’, ‘అత్తారింటికి దారేది’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో రోజు కూలీలు, పేదల పరిస్థితి దయనీయంగా మారింది. ఆహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తనవంతు కృషి చేస్తున్నారు ప్రణీత.

తొలుత ఆర్థికంగా సహాయం చేసిన ప్రణీత.. ఆ తర్వాత పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. తాజాగా భోజనం తయారు చేసి ప్యాకెట్లలో సర్ది పేదలకు పంపిణీ చేస్తున్నారు. తానే స్వయంగా రంగంలోకి దిగి వంట చేయడం, వండిన పదార్థాలను ప్యాక్‌ చేసి పేదలకు అందిస్తున్నారు. అలా ఇప్పటివరకూ 75వేల పార్శిళ్లు పంపిణీ చేశారట. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ప్రణీత మంచి మనసును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ప్రణీతలో అందంతో పాటు, అందమైన మనసు కూడా ఉందని ప్రశంసిస్తున్నారు.

2704PranithaSubhash002.jpg

2704PranithaSubhash001.jpg

2704PranithaSubhash003.jpg

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...