Jump to content

***** Andhra High Court Daily Updates ******

snoww

Recommended Posts

డాక్టర్ అనితారాణి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

06222020130757n34.jpg

అమరావతి: చిత్తూరు ప్రభుత్వ వైద్యశాల సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ అనిత రాణి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వంతో పాటు సీఐడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హాస్పిటల్‌లో అవకతవకలు జరిగాయని దానిపై సీబీఐతో విచారణ చేయించాలని డాక్టర్ అనిత రాణి పిటిషన్ వేశారు. తాను లేవనెత్తిన అంశాలపై సీబీఐతో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె హైకోర్టును కోరారు.

Link to comment
Share on other sites

యనమల, చినరాజప్పను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు

06222020180420n24.gif

అమరావతి: టీడీపీ నేతలు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక వివాహానికి హాజరైన సందర్భంలో యనమల, చినరాజప్పపై నమోదైన అట్రాసిటి కేసుపై హైకోర్టు విచారణ జరిగింది. ఈ కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రులు కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో వీరి పిటిషన్‌పై హైకోర్టులో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా

06232020190741n30.gif

అమరావతి: అమరావతి రాజధాని బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపటం లేదంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలంటూ మండలి కార్యదర్శి, ప్రభుత్వం కోరింది. బుధవారం ఉదయానికి కౌంటర్లు దాఖలు చేయాలని మండలి కార్యదర్శి, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధర్ తెలిపారు.

Link to comment
Share on other sites

హైకోర్టులో ఇద్దరు ఉద్యోగులకు పాజిటివ్‌

28 వరకు కార్యకలాపాల నిలిపివేత..

సిబ్బంది మొత్తానికీ పరీక్షలు

అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): హైకోర్టులో కరోనా కలకలం రేగింది. ఇద్దరు ఉద్యోగులకు పాజిటివ్‌ అని తేలడంతో హైకోర్టుతో పాటు, విజయవాడలో ఉన్న మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిల యూనిట్‌లో ఈ నెల 28వరకు కార్యకలాపాలను నిలిపేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు రిక్రూట్‌మెంట్‌ రిజిస్ట్రార్‌ గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా ఇటీవల బదిలీ ఉత్తర్వులు పొందిన వివిధ జిల్లాల జడ్జీలు రిలీవ్‌ అయ్యేందుకు, కొత్త పదవిలో బాధ్యతలు స్వీకరించేందుకు మరో 15రోజుల వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు గడువు పొడిగిస్తున్నట్లు మరో ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదిలాఉండగా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హైకోర్టుకు చెందిన మొత్తం సిబ్బందికి, భద్రతా సిబ్బందికి కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా గురువారం మధ్యాహ్నం నుంచి సుమారు 300 మందికి పరీక్షలు చేశారు. శుక్రవారం కూడా ఈ పరీక్షలు కొనసాగనున్నట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. అదేవిధంగా న్యాయమూర్తులకు సైతం పరీక్షలు జరుపనున్నారు. కాగా, బుధవారం మృతిచెందిన ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌కు పాజిటివ్‌ అని ప్రచారం జరుగుతుండటంతో హైకోర్టు సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆయనతో సన్నిహితంగా ఉన్న వారంతా స్వీయ క్వారంటైన్‌కు వెళ్లినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. 

Link to comment
Share on other sites

5 minutes ago, snoww said:

Lemongadda case online lo vini jalaganna ki mottikaya veyyali ani pulkas briefing. 

Link to comment
Share on other sites

On 6/25/2020 at 2:52 PM, snoww said:

30వరకూ హైకోర్టు కార్యకలాపాలు రద్దు

అమరాతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టు, ఏపీ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ, విజయవాడ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్సెస్‌ యూనిట్‌లలో మరో 2రోజుల పాటు కార్యకలాపాలు రద్దయ్యాయి. ఈ మేరకు హైకోర్టు ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ సునీత ప్రకటించారు. 29, 30వ తేదీల్లోనూ కార్యకలాపాలను నిలిపివే

Link to comment
Share on other sites

 ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు బుధవారం హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్టు రిజిస్ట్రార్‌ ప్రకటించారు. హైకోర్టు పరిధిలోని అన్ని దిగువ కోర్టుల్లో కూడా కార్యకలాపాలు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశారు. అయితే అత్యవసర పిటిషన్‌లను ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

క‌రోనా: ఏపీ హైకోర్టు కీల‌క నిర్ణ‌యం

1 Jul, 2020 19:36 IST|Sakshi
AP-High-Court.jpg?itok=MV57TnxX
 
సాక్షి, అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో క‌రోనా కేసులు వెలుగు చూడ‌టంతో న్యాయ‌స్థానం కీల‌క‌ నిర్ణ‌యం తీసుకుంది. కేవ‌లం అత్య‌వ‌స‌ర కేసులు మాత్ర‌మే విచార‌ణకు స్వీక‌రించ‌నున్న‌ట్లు తెలిపింది. వాటిని కూడా వీడియో కాన్ఫ‌రెన్స్ ప‌ద్ధ‌తిలో విచార‌ణ జ‌రపాలని నిర్ణయించింది. న్యాయమూర్తులు తమ అధికారిక నివాసాల నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్‌ విధానంలో కేసుల విచారణ‌లో పాల్గొంటారు. అలాగే, న్యాయస్థానం ముందు దాఖలయ్యే వివిధ పిటిష‌న్లు సైతం ఈ-ఫైలింగ్ ప‌ద్ధ‌తిలో మాత్ర‌మే న‌మోదు చేయాల‌ని ఆదేశించింది. ఈ మెయిల్‌లో అటాచ్‌మెంట్లు స్వీక‌రించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. తాజా మార్పులకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ బుధ‌వారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగ‌ళ‌వారం ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా సోకిన విష‌యం తెలిసిందే. (16 మంది ఏపీ హైకోర్టు సిబ్బందికి కరోనా)

Link to comment
Share on other sites

Just now, snoww said:

Lemongadda case is urgent important issue. Please hear the case in online and give mottikaya to jalaganna. 

Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:

Lemongadda case is urgent important issue. Please hear the case in online and give mottikaya to jalaganna. 

Mari  meymu antunnnaaa dr. Sudhaker, yanamala and co.

Link to comment
Share on other sites

హైకోర్టు సీజే తీరుపై విచారణకు ఆదేశించండి

2 Jul, 2020 05:42 IST|Sakshi
 
33.jpg?itok=0Nmci87K

కోవిడ్‌ పరిస్థితులను ఎదుర్కోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు

ఫలితంగానే ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ చనిపోయారు

ఉద్యోగులకు కరోనా సోకింది

రాష్ట్రపతి, సీజేఐ, కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఆల్‌ ఇండియా బీసీ ఫెడరేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హన్స్‌రాజ్‌ లేఖ

సాక్షి, అమరావతి: హైకోర్టులో కోవిడ్‌ పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీరుపై అంతర్గత విచారణకు ఆదేశించాలని పేర్కొంటూ ఆల్‌ ఇండియా బీసీ ఫెడరేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హన్స్‌రాజ్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, సుప్రీం న్యాయమూర్తులకు, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాశారు. జస్టిస్‌ మహేశ్వరి నిర్లక్ష్య చర్యలు, నిర్ణయాల వల్ల ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ బి.రాజశేఖర్‌ మరణం సంభవించిందని, కొందరు ఉద్యోగులకు కరోనా సోకిందని, అంతిమంగా వారం పాటు కోర్టు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని హన్స్‌రాజ్‌ పేర్కొన్నారు. న్యాయమూర్తులు, అధికారులు, ఉద్యోగులు, కక్షిదారుల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ప్రమాదరహితంగా హైకోర్టు, కింది కోర్టుల కార్యకలాపాలు సాగేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన నాలుగు పేజీల లేఖ రాశారు. అందులో ముఖ్యాంశాలు ఇవీ.. 

కిక్కిరిసిన హాలులో ప్రమాణ స్వీకారాలు.. 
‘ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కోవిడ్‌ పరిస్థితులను ఎదుర్కోవడంలో హైకోర్టు సీజే అసమర్థంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో న్యాయమూర్తులు, సిబ్బంది ప్రమాదకర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మే 8న హైకోర్టులో మూసిఉన్న చిన్న ఎయిర్‌ కండీషన్డ్‌ హాలులో ముగ్గురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. హాలంతా న్యాయమూర్తులు, క్లర్కులు, న్యాయవాదులు, న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, వీఐపీలతో కిక్కిరిసింది. మాస్క్‌లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఏర్పాట్ల నిమిత్తం ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ తెల్లవారుజాము 3గంటల వరకు పనిచేశారు.   

రాజశేఖర్‌పై సీజే చెప్పలేనంత ఒత్తిడి మోపారు 
ఇటీవల చనిపోయిన బి.రాజశేఖర్‌ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు అనారోగ్యం పాలైనా బదిలీల పేరుతో కోర్టుకు పిలిపించారు.  ఆయన గుండె జబ్బు బాధితుడు. జస్టిస్‌ జేకే మహేశ్వరి తనపై చెప్పలేనంత భయంకరమైన ఒత్తిడిని మోపుతున్నారంటూ రాజశేఖర్‌ తన సన్నిహితులకు, కుటుంబానికి చెబుతూ వచ్చారు. రాజశేఖర్‌ 24.6.2020 మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైకోర్టులో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు.  రాజశేఖర్‌ను రోజూ కలుస్తూ వచ్చిన సీజే ఈ రోజుకీ కోవిడ్‌ పరీక్ష చేయించుకోలేదు. 

రిజర్వేషన్లను దూరం చేసేలా డ్రాఫ్ట్‌ రూల్స్‌...
జిల్లా జడ్జిల స్థాయిలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ న్యాయాధికారుల రిజర్వేషన్లను దూరం చేసే విధంగా డ్రాఫ్ట్‌ రూల్స్‌ సిద్ధం చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తిరిగి అవే పోస్టుల్లో నియమించారు. కాబట్టి అంతర్గత విచారణకు ఆదేశించాలి. 

నివాస భవనం కేటాయించినా.. 
జస్టిస్‌ జేకే మహేశ్వరికి విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో మూడు సూట్‌లను కేటాయించారు. ప్రధాన న్యాయమూర్తి నివాసం కోసం ఓ అధికారిక భవనాన్ని కూడా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.2.5 కోట్లు ఖర్చు చేసింది. ఫిబ్రవరిలో సీజే అందులోకి వెళ్లినా ప్రభుత్వ అతిథి గృహంలోని మూడు సూట్‌లను ఇప్పటివరకు ఖాళీ చేయలేదు. ఇది రాష్ట్రానికి వచ్చే వీఐపీలకు ఇబ్బందికరంగా మారింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని పూర్తిస్థాయి అంతర్గత విచారణకు ఆదేశించాలని అభ్యర్థిస్తున్నా’ 

Link to comment
Share on other sites

అమరావతి: ఓ వైపు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ఆ పార్టీ ఎంపీలు అనర్హత పిటిషన్‌ను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించేందుకు వెళుతుండగా.. ఆయన ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రఘురామ కృష్ణరాజు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలను అడ్డుకోవాలని ఆయన హైకోర్టును కోరారు. తనకు వేరే పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసులు ఇచ్చారని పిటిషన్‌‌లో పేర్కొన్నారు.

తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యానని.. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసు ఇచ్చారని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తాను ఎక్కడా పాల్పడలేదన్నారు. కానీ వైసీపీ ఆ ఎంపీలు అదే కారణం చూపిస్తూ అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్తున్నారని పేర్కొన్నారు. అత్యవసర పిటిషన్లను మాత్రమే విచారిస్తున్న హైకోర్టు.. ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను సోమవారం విచారించే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

07032020030603n78.png

  • పాలసీల్లో కోర్టుల జోక్యం దారుణం
  • ఇక ప్రజలెందుకు? ఎన్నికలెందుకు?
  • సీఎంలెందుకు.. స్పీకర్లు ఎందుకు?
  • మూడు వ్యవస్థలకూ హద్దులు ఉన్నాయి
  • స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలుకోర్టుల నుంచే పరిపాలన 
  • సాగిస్తారా?

కాణిపాకం/తిరుమల, జూలై 2: ‘కోర్టులు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటుంటే.. ప్రభుత్వమెందుకు.. ప్రజలెందుకు.. ఎన్నికలెందుకు..’ అని శాసనసభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. కుటుంబ సమేతంగా గురువారం ఉదయం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని, కాణిపాకం కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆయా చోట్ల మీడియాతో మాట్లాడారు. ‘ఈ విధంగా చేయి.. నువ్విక్కడకు వెళ్లు.. ఇది స్టాప్‌ చేయి.. అని చెబుతుంటూ ఇక ప్రజలెందుకు? ఎన్నికలెందుకు? ఓట్లెందుకు... ఎమ్మెల్యేలెందుకు? పార్లమెంటు సిస్టం ఎందుకు? శాసనసభ ఎందుకు? శాసనసభ నాయకుడిని ఎన్నుకునేది ఎందుకు? ముఖ్యమంత్రులు ఎందుకు? స్పీకర్లు ఎందుకు? ఇవన్నీ దేనికి? మీరే (హైకోర్టు) అక్కడి నుంచి రూల్‌ చేస్తారా? న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాలను నడిపిస్తారా? భారత రాజ్యాంగం మనకు స్పష్టమైన వ్యవస్థలనిచ్చింది.

శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల పరిధులను నిర్ణయించారు..ఒకరి పరిధులను మరొకరు అతిక్రమించకుండా.. ఎవరి బాధ్యతలు వారు నిర్వహించాలి. అధికారాలు, హక్కులతో పాటు హద్దులనూ నిర్ణయించింది. మరి కోర్టుల నుంచే ఆదేశాలు వస్తే.. ప్రభుత్వ పాలసీల్లో కోర్టులే జోక్యం చేసుకుంటే.. ప్రజాస్వామ్యంలో ఎన్నికలెందుకు? ప్రజలు ఎన్నుకోవడం దేనికి? ప్రభుత్వాన్ని న్యాయస్థానాలే నడిపిస్తాయా..? కోర్టుల నుంచే పరిపాలన సాగిస్తారా..? ఇది ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబడడమే. బాధతోనే కోర్టు తీర్పులను అంగీకరిస్తున్నాం. మేధావులు దీనిపై చర్చించాలి.

50 ఏళ్లుగా చూడని వింత పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. మా నిర్ణయాలు తప్పయితే గెలిపించిన ప్రజలే మళ్లీ ఓడిస్తారు. ద్రవ్య బిల్లును ఆపి ఉద్యోగుల జీతాలు అడ్డుకోవడం రాజకీయాల్లో వికృత చేష్టలకు పరాకాష్ఠ’ అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కుంభకోణాలు జరిగి ఉంటే నిరూపించాలని స్పీకర్‌ ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు. 

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

అమరావతి: ఓ వైపు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ఆ పార్టీ ఎంపీలు అనర్హత పిటిషన్‌ను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించేందుకు వెళుతుండగా.. ఆయన ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రఘురామ కృష్ణరాజు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలను అడ్డుకోవాలని ఆయన హైకోర్టును కోరారు. తనకు వేరే పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసులు ఇచ్చారని పిటిషన్‌‌లో పేర్కొన్నారు.

తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యానని.. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసు ఇచ్చారని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తాను ఎక్కడా పాల్పడలేదన్నారు. కానీ వైసీపీ ఆ ఎంపీలు అదే కారణం చూపిస్తూ అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్తున్నారని పేర్కొన్నారు. అత్యవసర పిటిషన్లను మాత్రమే విచారిస్తున్న హైకోర్టు.. ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను సోమవారం విచారించే అవకాశం ఉంది.

Next step.. Mana few phulka chefs in fud court - CB! enquiry vestharu anukunta SelfassuredFloweryChuckwalla-size_restri

Link to comment
Share on other sites

సీజేపై ఆరోపణలు తగవు

07032020032923n63.png

  • ఇప్పటికే హైకోర్టుపై వ్యూహాత్మక దాడి
  • తాజాగా సీజేపైనే గురిపెట్టినట్లు సందేహం
  • పొరుగు రాష్ట్రం వ్యక్తి లేఖతో ‘పావులు’
  •  

అమరావతి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థపై వైసీపీ మైండ్‌గేమ్‌ మరింత ముందుకు వెళ్లిందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. ఈసారి ఏకంగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తినే లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంటున్నాయి. కులంతోపాటు పలు అంశాలను ఆధారంగా చేసుకుని వైసీపీ మొదటి నుంచీ వ్యూహాత్మక దాడి చేస్తోందని... ఇప్పుడు అదే తరహా వ్యూహం కోర్టులపైనా అమలు చేస్తోందనే అభిప్రాయం వెల్లడవుతోంది. న్యాయ సమీక్షకు నిలబడవని తెలిసీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక, చట్ట విరుద్ధమైన పలు నిర్ణయాలను హైకోర్టు కొట్టివేసింది. దీంతో న్యాయ వ్యవస్థకు తప్పుడు ఉద్దేశాలు అంటగడుతూ, జడ్జిలకు కులాలను ఆపాదిస్తూ వైసీపీ అనుకులూరు సోషల్‌ మీడియాలో రకరకాలుగా దుర్భాషలాడారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులూ హైకోర్టును నిందించారు.

అయితే... ఈ వ్యవహారం ‘బూమెరాంగ్‌’ అయ్యింది. ఈ వ్యాఖ్యలను హైకోర్టు తీవ్రంగా పరిగణించి, అందరికీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు... వైసీపీ తన వ్యూహాన్ని మార్చి చీఫ్‌ జస్టిస్‌ లక్ష్యంగా పావులు కదిపినట్లు కనిపిస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు... ఈ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకమంటూ తెలంగాణకే చెందిన రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ ఈశ్వరయ్య గౌడ్‌ ఏపీ అంతా తిరిగి ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనకు కీలకమైన పదవి అప్పగించారు. ఇప్పుడు కూడా... తెలంగాణకే చెందిన మరో బీసీ వ్యక్తిని రంగంలోకి దించి న్యాయవ్యవస్థపై దాడికి శ్రీకారం చుట్టారని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒక దురదృష్టకరసంఘటనకు సీజే  కారణమని, ఆయన తీరుపై విచారణ జరపాలని కోరుతూ రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకు, కేంద్రానికి ఆ బీసీ నేత రాసిన లేఖను జగన్‌ సొంత పత్రిక ప్రముఖంగా ప్రచురించడం వైసీపీ వ్యూహంలో భాగమే అని చెబుతున్నాయి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...