Jump to content

***** Andhra High Court Daily Updates ******

snoww

Recommended Posts

05282020020153n16.jpg

  • స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు
  • గతంలో నో అన్నా మళ్లీ అక్కడికే
  • నేడు విచారణ జరిగే అవకాశం
  • హైకోర్టు గడువు నేటితో సరి
  •  

అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘వద్దు’ అని హైకోర్టు రెండుసార్లు చెప్పినా సరే... గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు పూయడంపై వెనక్కి తగ్గరాదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ అంశంపై మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టింది. గ్రామ సచివాలయాలకు రాజకీయ పార్టీలకు చెందిన రంగులను పులమొద్దని గతంలో ఒకసారి హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. అయితే... దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా సర్కారుకు చుక్కెదురైంది. హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ... ఏదైనా అక్కడే తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై హైకోర్టు ఈనెల 22న స్పష్టమైన తీర్పు చెప్పింది. నీలం, తెలుపు, ఆకుపచ్చకు తోడుగా ఎర్రమట్టి రంగును చేర్చుతూ జారీ చేసిన జీవో నంబర్‌ 623ను రద్దుచేసింది. 28వ తేదీ (గురువారం)లోపు తమ ఆదేశాలను అమలు చేయాలని తేల్చి చెప్పింది. లేనిపక్షంలో... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌లు ‘కోర్టు ధిక్కరణ’కింద తమ ముందు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి కర్తవ్యంపై మూడు రోజుల కిందట సీఎస్‌ సమీక్షించారు. చివరికి... హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది గురువారం జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చే అవకాశముంది.

Link to comment
Share on other sites

6 hours ago, snoww said:

ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు నారా చంద్ర‌బాబునాయుడు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డంపై దాఖ‌లైన ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు బుధ‌వారం విచార‌ణ జ‌రిపింది. విచార‌ణ‌లో భాగంగా పిటిష‌న‌ర్‌ను హైకోర్టు నేరుగా ఓ ప్ర‌శ్న అడిగింది. బాబు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డంపై సంబంధిత అధికారుల‌కు ఫిర్యాదు చేశారా?  లేదా? అని ప్ర‌శ్నించింది.

అయితే గ‌తంలో ఇలాంటి కేసును నేరుగా హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింద‌ని పిటిష‌న‌ర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిష‌న‌ర్ స‌మాధానంపై హైకోర్టు స్పందిస్తూ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేల కేసుతో పాటు చంద్ర‌బాబు కేసును కూడా గురువారం విచారి స్తామ‌ని హైకోర్టు తెలిపింది. వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, విడ‌ద‌ల ర‌జిని, బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి, వెంక‌టేశ్‌గౌడ్‌, కిలివేటి సంజీవయ్య‌లు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. వారిపై సీబీఐ విచార‌ణ‌కు ఎందుకు ఆదేశించ‌కూడ‌దో చెప్పాల‌ని కూడా హైకోర్టు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే.

రెండు నెలల తర్వాత సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు లాక్‌డౌన్‌ నిబంధనలను తుంగలో తొక్కారు. బాబు వస్తున్నారని తెలిసిన తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో రోడ్లమీదకు వ‌చ్చారు.  మాస్క్‌లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా బాబుకు స్వాగతం పలకడానికి పోటీ ప‌డ్డారు.  ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కింద చంద్ర‌బాబుపై కేసు న‌మోదు చేసేలా ఆదేశించాల‌ని పిటిష‌న‌ర్ వంగా వెంక‌ట్రామిరెడ్డి, న్యాయ‌వాది పోన‌క జ‌నార్ద‌న్‌రెడ్డి న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యిం చిన విష‌యం తెలిసిందే.

Can baboru apply for stay order in this case ?

Link to comment
Share on other sites

ఇంగ్లిష్‌ మీడియంను తీసుకురావడమంటే.. తెలుగును అడ్డుకోవడమేనని.. అగౌరవపరచడమేనంటూ కొత్త కొత్త థియరీలు తీసుకొస్తున్నారని సీఎం ఆక్షేపించారు. ‘కోర్టులకు వెళ్లి ప్రతిపక్షాలు అడ్డంకులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాయి. అయినా సరే కచ్చితంగా ఇంగ్లిష్‌ మీడియం అమలు చేయాలని, పేదవాడి జీవితంలో మార్పు తీసుకురావాలన్న ఉక్కు సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం. రాష్ట్రంలో 96 శాతం మంది తల్లిదండ్రుల అభిప్రాయాలను ఎస్‌సీఈఆర్‌టీకి పంపాం. వాళ్ల సిఫారసులు కూడా వచ్చాయి. మండలానికో తెలుగు మీడియం స్కూల్‌ పెట్టి.. మిగతావన్నీ ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చాలని ఎస్‌సీఈఆర్‌టీ వివరించింది. ఆ నివేదికను తీసుకుని సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం. ఇప్పటికే కేసు ఫైల్‌చేశాం’ అని తెలిపారు. 

Link to comment
Share on other sites

1 hour ago, manadonga said:

Repu supreme court to jaggadi ki motti kayalau ready 

Areyyy pedda samasye vachinde. Mari emi cheddam. Cbn ni a ki cm cheddama??

Link to comment
Share on other sites

వైసీపీ రంగులపై విచారణ రేపటికి వాయిదా

05282020120353n33.jpg

అమరావతి: ప్రభుత్వ కార్యాలయాలకు రంగులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. అనంతరం న్యాయస్థానం శుక్రవారం నాటికి వాయిదా వేసింది. హైకోర్టుకు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ హాజరయ్యారు. తొలిసారిగా ఏపీ సీఎస్ కూడా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి వైసీపీ పార్టీకి చెందిన రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేశారంటూ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థాయం విచారణ చేపట్టింది. రంగులను తొలగించాలని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. 

అయితే కోర్టు తీర్పుకు భిన్నంగా 620 జీవో తీసుకువచ్చి గతంలో రంగులతో పాటు మట్టి రంగును కలిపి వేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు దానిపై కూడా విచారణ చేపట్టింది. కోర్టు ధిక్కారణ కింద ఆ రంగులు వేస్తున్నారని న్యాయస్థానం భావించింది. దీంతో విరణ ఇచ్చేందుకు సీఎస్ ఇవాళ కోర్టుకు వచ్చారు. కాగా ఇదే అంశపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో.. హైకోర్టు సర్కార్ వాదనలను వింటూ తదుపరి విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

11 hours ago, Android_Halwa said:

Danne strategy antaru....CBN ki telusu that okati sepithe inkokati chestaru ani, anduke telivi ga wheel spinned...Chandrababu vesina sketch ki buttalo padda BJP/Governor.

Nee kamedy ki nuvvu thappa inkevvaru navvaru brother

Link to comment
Share on other sites

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై లాక్ డౌన్ ఉల్లంఘన కేసు వచ్చిన తర్వాత వైఎసిపి ఎమ్మెల్యేలు కూడా సేఫ్ అయినట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు హైకోర్టు సరైన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. మీడియాలో వచ్చిన వార్తలు గమనిస్తే, హైకోర్టు వారు ముందుగా సంబందిత అదికారులకు పిర్యాదు చేయకుండా నేరుగా పిల్ వేయడాన్ని ఆక్షేపించిందని మీడియా కదనం తెలిపింది. కరోనా వైరస్‌ కట్డడికి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి విపత్తు నివారణ చట్టం 2005 ప్రకారం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కోర్టు తెలిపింది. అలాగే తొలుత సంబంధిత శాఖకు ఫిర్యాదు చేయకుండా నేరుగా హైకోర్టుకు రావడాన్ని ధర్మాసనం తప్పుపట్టిందని వార్తలు సూచిస్తున్నాయి.
నేరుగా పిల్ వేయటం మూలంగా వాస్తవ విషయాలపై విచారణ చేయలేమని పిటిషన్‌ విచారణ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారని ఆ వార్త తెలిపింది. నిబంధనల ఉల్లంఘనలపై చట్టం ప్రకారం సంబంధిత శాఖలో ఫిర్యాదు చేసేందుకు హైకోర్టు అనుమతించింది. ఫిర్యాదులు అందగానే చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. వైసిపి ఎమ్మెల్యేలపై ఇలా పిల్ వేసినప్పుడే హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ సమస్య పోయిందని అనుకోవాలి.

Link to comment
Share on other sites

14 hours ago, Hydrockers said:

thelisindhe gaa.. inthaku mundhu Cb! inquiry vestham, muttakayalu, weekly 3 hearings...

. ippudu Baboru mida similar case raagane—— local police lo complain chesara, direct Fud court ravadam endhi ani reverse game from  food court owners.. ippudu next hearing oka 2-3 months ki istharemo chudali

Link to comment
Share on other sites

19 minutes ago, kidney said:

thelisindhe gaa.. inthaku mundhu Cb! inquiry vestham, muttakayalu, weekly 3 hearings...

. ippudu Baboru mida similar vase raagane—— local police lo complain chesara, direct Fud court ravadam endhi ani reverse game from  food court owners.. ippudu next hearing oka 2-3 months ki istharemo chudali

Asalu next hearing ki vastadi antava

Vachina case kotteataru ga 

  • Upvote 1
Link to comment
Share on other sites

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన డా.సుధాకర్

05282020184131n59.jpg

అమరావతి: ఏపీ హైకోర్టును డాక్టర్ సుధాకర్ ఆశ్రయించారు. విశాఖ మానసిక ఆస్పత్రిలో వైద్యం సరిగా అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను వెంటనే వేరే ఆస్పత్రికి తరలించాలని సుధాకర్‌ అభ్యర్థించారు. కోర్టు పర్యవేక్షణలో వైద్యం జరపాలని సుధాకర్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తనకు సరైన వైద్యం అందించడంలేదని, ట్యాబ్లెట్ల వివరాలను ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. వైద్యులు ఇస్తున్న ట్యాబ్లెట్ల వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పిచ్చోడిగా తనను నిరూపించేందుకు అనుగుణమైన మందులు వైద్యులు ఇస్తున్నారని, మెరుగైన వైద్య సేవల కోసం హయ్యర్‌ సెంటర్‌కు తనను పంపించాలంటూ డాక్టర్‌ సుధాకర్‌ బుధవారం మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. మానసిక ఆస్పత్రిలో తనకు సంబంధం లేని మందులు ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా స్కిజోఫీనియా వంటి సమస్యలతో బాధపడే రోగులకు ఇచ్చే మందులు ఇస్తున్నారని వాపోయారు. వైద్యులు ఇస్తున్న మందులతో రియాక్షన్స్‌ వస్తున్నాయని, ఆ మందులతో పెదాలు పొడిబారాయని తెలిపారు. మందుల ప్రభావంతో యూరిన్‌ ఆగిందని, కళ్లు మసకబారాయని, తల తిరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసరంగా తనను వేరే ఆస్పత్రికి రిఫర్‌ చేయాలని లేఖలో సుధాకర్ కోరారు. 

Link to comment
Share on other sites

5 hours ago, Hydrockers said:

Asalu next hearing ki vastadi antava

Vachina case kotteataru ga 

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలపై హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ ముగిసింది. దాదాపు మూడుగంటల పాటు వాదనలు విన్న న్యాయస్థానం చివరకు తీర్పును వెలువరించింది. కరోనా వైరస్‌ కట్డడికి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి విపత్తు నివారణ చట్టం 2005 ప్రకారం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే తొలుత సంబంధిత శాఖకు ఫిర్యాదు చేయకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. (లాక్‌డౌన్‌ నిబంధనలు చంద్రబాబు బేఖాతర్‌)

నేరుగా పిల్ వేయటం మూలంగా వాస్తవ విషయాలపై విచారణ చేయలేమని పిటిషన్‌ విచారణ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అలాగే నిబంధనల ఉల్లంఘనలపై  చట్టం ప్రకారం సంబంధిత శాఖలో ఫిర్యాదు చేసేందుకు అనుమతినిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఫిర్యాదులు అందగానే చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కాగా, లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. (చంద్రబాబుపై హైకోర్టులో పిల్‌..)

Link to comment
Share on other sites

19 minutes ago, snoww said:

Great judgement. Thank you high court. 

Link to comment
Share on other sites

Some high courts are running parallel govts: Solicitor General 

Solicitor general Tushar Mehta, representing the central government, was critical of various high courts passing orders 

The issue is some high courts are running parallel governments," Mehta said.

Various high courts including Gujarat, Madras, Karnataka and Andhra Pradesh had passed directions to state and central governments

  "All these letters which have been addressed to the court to persuade Supreme Court to take suo motu cognizance of issues have been written by people who are earning in crores," Mehta said to SC

Mana AP fud court umpires ki akshantalu(muttakayalu)  padthunnayi kadha one-by-one for being biased to one political party  from SC and Central @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...