r2d2 Posted June 4, 2020 Report Share Posted June 4, 2020 లండన్: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ తరఫున 15 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు గవి (గ్లోబల్ అలయెన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్)- 2020 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వ్యాక్సిన్ అభివృద్ధికి అన్ని దేశాలు ఆర్థిక సాయం అందించేందుకు ప్రతిజ్ఞ చేయాలని ఈ సందర్భంగా బోరిస్ జాన్సన్ సదస్సులో పాల్గొన్న దేశాధినేతలను కోరారు. ‘‘గవికి భారత్ కేవలం ఆర్థికపరమైన సాయాన్ని మాత్రమే అందించడంలేదు. భారత్‌లో వ్యాక్సిన్‌కు ఉన్న భారీ డిమాండ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ధరలు తగ్గుతాయి. ప్రస్తుతం సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో భారత్ ప్రపంచానికి తన సంఘీభావాన్ని తెలుపుతోంది. తక్కువ ధరకు నాణ్యమైన మందులు, వ్యాక్సిన్ తయారీలో మా ప్రతిభను ఇప్పటికే నిరూపించుకున్నాం. మా దేశీయ అనుభవాల ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకున్నాం. అలానే మా శాస్త్రవేత్తలు, పరిశోధక బృందాలు మానవతా గుణంతో సేవలందిస్తారు’’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ సదస్సులో 35 మంది వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మిషన్ ఇంధ్ర దనుష్ ద్వారా భారత్‌లో పసిబిడ్డలకు, గర్భిణి స్త్రీలకు వ్యాక్సిన్‌లు అందించి వారిలో రోగ నిరోధకశక్తిని పెంచుతున్న విషయాన్ని సదస్సులో ప్రస్తావించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.