Jump to content

అందరూ పాస్.. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు


Kool_SRG

Recommended Posts

విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. 5,34,903 మంది పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేసింది.

 

అందరూ పాస్.. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు

 

పదో తరగతి పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దుచేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని సీఎం  నిర్ణయించారు. దేశంలో, రాష్ట్రంలో ప్రబలివున్న సందర్భంలో పదవ తరగతి పరీక్షలపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు పాల్గొన్నారు.

రాష్ట్రంలో 5,34,903 మంది పదవ తరగతి విద్యార్థులున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లుండగా, అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని సిఎం నిర్వహించారు. ఈ సమావేశంలో పదవ తరగతి పరీక్షల విషయంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. తెలంగాణలో ఏమి చేయాలనే విషయంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తెలంగాణలో అనుసరించాల్సిన పద్దతిని ఖరారు చేశారు.

 


గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరగణలోకి తీసుకుని పదవ తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
డిగ్రీ, పిజి తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వాటిపై కొన్ని రోజులుగా విచారణ జరుగుతోంది. ప్రభుత్వం పరీక్షలపై దృష్టిపెడుతోందని, రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని పిటిషనర్ వాదించారు. పంజాబ్‌ తరహాలో పరీక్షలు లేకుండానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని పిటిషనర్ వాదించారు. పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇస్తే ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే, ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ మినహా మిగతా జిల్లాల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. దీనిపై ఏజీ అభ్యంతరం తెలిపారు. వేర్వేరుగా పరీక్షలు పెడితే ప్రశ్నాపత్రం తయారుచేయడం కష్టమవుతుందని భావించిన ప్రభుత్వం.. రాష్ట్రమంతటా పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. మరి ఏం చేయాలన్న దానిపై ఇవాళ అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Link to comment
Share on other sites

టెన్త్‌ విద్యార్థులు అంతా పాస్‌.. మరి ఫలితాలు ఎప్పుడంటే..!

 

టెన్త్‌ విద్యార్థులు అంతా పాస్‌.. మరి ఫలితాలు ఎప్పుడంటే..!

టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తారా? నిర్వహించరా? అనే ఉత్కంఠకు తెరదింపిం తెలంగాణ ప్రభుత్వం... ఈ ఏడాదికి టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది... ప్రభుత్వ నిర్ణయంతో టెన్త్ విద్యార్థులంతా ప్రమోట్ అవుతారు.. అయితే, విద్యార్థులు మాత్రం తమకు వచ్చే గ్రేడ్ కోసం ఎదురుచూడాల్సిందే... రాష్ట్రంలో మొత్తం 5,34,903 మంది టెన్త్ విద్యార్థులున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లుండగా, అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి ఫైనల్ నిర్ణయం ఇవాళ తీసుకుంది సర్కార్. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరగణలోకి తీసుకుని పదవ తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇక, గ్రేడింగ్ ఫలితాలు.. 15 రోజుల్లో విడుదల చేయనున్నారు. ఇంటర్నల్ మార్క్స్ సంబంధించిన డేటా ఇప్పటికే ఎస్‌ఎస్‌సీ బోర్డు దగ్గర ఉంది.. విద్యార్థులకు ఎఫ్‌ఏలతో వచ్చిన మార్కుల ఆధారంగా 20 శాతం ఇంటర్నల్ మార్క్స్ వేస్తారు.. వీటిని విద్యార్థులకు ఫైనల్ పరీక్షల్లో వచ్చిన మార్క్స్ కి కలుపుతారు.. ఇప్పుడు ఫైనల్ పరీక్షల జరగడం లేదు కాబట్టి... ఆ మార్కులనే మల్టిప్లై చేస్తారు... దాన్ని ఆధారంగా మార్క్స్ కేటాయించి.. గ్రేడింగ్ విధానంలోను మార్పులు చేయనున్నారు.. దీని కోసం గ్రేడింగ్ సిస్టం రేపు ఫైనల్ చేయనున్నారు.. దీంతో.. గ్రేడింగ్ రేంజ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. 

Link to comment
Share on other sites

కేసీఆర్ సంచలన నిర్ణయం.. పరీక్షలు లేకుండానే 5.35 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పాస్!

cr-tn-287456af35ce.jpg

  • పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన టీఎస్ ప్రభుత్వం
  • ఇంటర్నల్స్, అసెస్ మెంట్ ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్
  • త్వరలోనే డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై నిర్ణయం

కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలను పూర్తిగా రద్దు చేసేశారు. పరీక్షలతో సంబంధం లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేశారు. ఇంటర్నల్స్, అసెస్ మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులను పాస్ చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో మొత్తం 5,34,903 మంది విద్యార్థులు తదుపరి క్లాసులకు వెళ్లనున్నారు. ఇంటర్నల్స్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడులను నిర్ణయించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పదో తరగతి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పెద్ద టెన్షన్ తొలగిపోయింది. మరోవైపు, డీగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.

పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు టీఎస్ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, పరీక్షల సందర్భంగా విద్యార్థులకు కరోనా సోకితే బాధ్యులెవరని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో, పరీక్షలను నిర్వహించడం కంటే... విద్యార్థులను ప్రమోట్ చేయడం ఉత్తమమని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది.

Link to comment
Share on other sites

6 minutes ago, Kool_SRG said:

Ippudu mana jagananna konni rojullo makki ki makki dinchuthaada ditto...

Jagan Anna 10 the pass 

Link to comment
Share on other sites

4 minutes ago, r2d2 said:

internal assessment antey.. teachers & principals ki full pandage kada..👍

I think the assessment that was ‘already’ done.

Link to comment
Share on other sites

17 minutes ago, reality said:

Pawala must be thinking... vadu 10th chadive rojullo Corona vachi unte ... pukkad la pass ayyetonni chass ani....

Deenlo kuda pk ni taluchukuntunnav chudu.. sainiks kante nuvveee ekkuva kottesukonela unnav pk ante

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...