afacc123 Posted June 14, 2020 Report Share Posted June 14, 2020 చరిత్ర: అమెరికాకు ఆ పేరు పెట్టిన మధ్యయుగాల నాటి మ్యాప్ ఇదే 20 జూలై 2018 దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Facebook దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Messenger దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Twitter దీనిని క్రింది వాటితో షేర్ చేయండి ఇమెయిల్ Image copyrightSCIENCE HISTORY IMAGES / ALAMY ఈశాన్య ఫ్రాన్స్ మ్యూర్త్ లోయలో ఉన్న ఒక చిన్న పట్టణం సెయింట్-డియే-దీ-వోజ్. ఇది ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్ నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో ఉంది. స్విట్జర్లాండ్‌లోని బ్రెసెల్ నగరం దీనికి 93 కిలోమీటర్లు వాయవ్యంలో ఉంటే, సెయింట్-డియే-దీ-వోజ్ నుంచి 74 కిలోమీటర్లు వాయవ్యంలో జర్మనీలోని ఫ్రీబర్గ్ నగరం కూడా ఉంది. ప్రస్తుతం ఆధునిక సాంకేతికత, శాటిలైట్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఇతర విధానాలతో సెయింట్-డియే-దీవ్-వోజ్ సరిగ్గా ఎక్కడుంది అనేది మనం గుర్తించవచ్చు. కానీ కొన్ని వందల ఏళ్ల క్రితం, చాలా మందికి తామున్న ప్రాంతం తప్ప మిగతా ప్రపంచం అంతా ఒక అంతుపట్టని రహస్యం. దీని గుట్టు పూర్తిగా వీడక ముందు యూరప్‌లోని సెయింట్-డియే-దీ-వోజ్ పట్టణంలో కొందరు కలిశారు. ప్రపంచంలో అత్యంత అసాధారణమైన ఒక మ్యాప్ తయారు చేశారు. అది అంతకు ముందున్న మ్యాప్‌లు అన్నిటికంటే పూర్తిగా భిన్నంగా ఉండేది. వాళ్లు ఆరోజు తయారు చేసిన ఆ మ్యాప్ ప్రభావం ఇప్పటికీ ఉంది. అసలు ఆ మ్యాప్ తయారు చేసిన ఈ సెయింట్-డియే-దీ-వోజ్ పట్టణంలోనే అమెరికా ఖండానికి ఆ పేరు పెట్టారు. ఈ చరిత్రాత్మక మ్యాప్‌ను 1507లో ముద్రించారు. దీని పొడవు 1.4 మీటర్లు, వెడల్పు 2.4 మీటర్లు ఉండేది. అంత విశాలమైన మ్యాప్ తయారీ వెనుక ఒకే ఒక లక్ష్యం ఉంది. మొత్తం ప్రపంచం ఎలా ఉంటుందో ప్రజలందరికీ చూపించాలి. అంతే. ఇలా అంతకు ముందు ఎవరూ, ఎప్పుడూ ఆలోచించలేదు. Image copyrightTHE PICTURE ART COLLECTION / ALAMY చిత్రం శీర్షికమొదటి సారి కొత్త ప్రపంచాన్ని చూపించిన వాల్డ్‌సీముల్లెర్ మ్యాప్ ప్రపంచంలో నాలుగో భాగం ఈ మ్యాప్ తయారు చేసే ముందు ఆసియా, ఆఫ్రికా, ఐరోపా అనే మూడు విశాల భూభాగాలతో ప్రపంచం ఏర్పడిందని యూరప్ ప్రజలు అనుకునేవారు. వారంతా జెరూసలెంను ఈ ప్రపంచానికి కేంద్రంగా భావించేవారు. అందుకే, ఇటలీ అన్వేషకుడు క్రిస్టొఫర్ కొలంబస్ కూడా తను అన్వేషించిన అమెరికా అనే కొత్త ప్రపంచం ఆసియాలో ఒక భాగమని అనుకున్నందుకు తన చివరి క్షణాల్లో బాధపడ్డారు. కానీ సెయింట్-డియే-దీ-వోజ్‌లో 1507లో ముద్రించిన ఈ మ్యాప్ ప్రపంచం నాలుగు భూభాగాలుగా ఉందని మొదటి సారి యూరోపియన్ ప్రజలకు పరిచయం చేసింది. మ్యాప్‌లో యూరప్‌కు ఎడమ వైపున అమెరికాను పొడవుగా ఉన్న ఒక సన్నటి పట్టీలా చిత్రించారు. దానిలోనే పైన ఉత్తర అమెరికాను చిన్నదిగా చూపించారు. ఈ కొత్త ఖండం నలువైపులా సముద్రం చుట్టి ఉన్నట్టు చూపించారు. పటం వేసిన చిత్రకారులు మ్యాప్‌లో ప్రస్తుతం బ్రెజిల్ ఉన్న చోట అమెరికా అనే పేరు రాశారు. మ్యాప్ చిత్రకారులు దీనిని ప్రస్తుతం వాల్డ్‌సీముల్లర్ మ్యాప్ పేరుతో పిలుచుకుంటారు. ఈ మ్యాప్‌ను తయారు చేసిన జర్మన్ మార్టిన్ వాల్డ్‌సీములర్ పేరుతో దానికి ఆ పేరు పెట్టారు. అయితే మార్టిన్ వాల్డ్‌సీములర్ ఒక్కరే ఈ మ్యాప్ తయారు చేయలేదు. Image copyrightMADHVI RAMANI మ్యాప్ తయారీలో తొలి అడుగు మొట్టమొదటి ప్రపంచ పటం తయారు చేసే దిశలో మొదట సెయింట్-డియే-దీ-వోజ్ చర్చి ఫాదర్ వాల్టర్ లూడ్ చొరవ చూపారు. వాల్టర్‌కు విశ్వ ఆవిర్భావ శాస్త్రం (కాస్మోగ్రఫీ)లో చాలా ఆసక్తి ఉండేది. ఆయన భూమి, విశ్వం గురించి చాలా చదువుతూ, రాస్తూ ఉండేవారు. ఆ సమయంలో కొత్త ప్రపంచం గురించి అన్వేషిస్తున్న వారు చెప్పిన వివరాలతోపాటు, అంతకు ముందు ప్రపంచం గురించి తెలిసిన జ్ఞానాన్ని అంతా కలిపి ఒక ప్రపంచ పటం గీయాలని ఆయన అనుకుంటూ ఉండేవారు. ప్రపంచ పటం చిత్రించే ప్రయత్నాల్లో భాగంగా ఆయన స్థానిక పాలకుడు రీన్ 2 నుంచి నిధులు సేకరించి సెయింట్-డియే-దీ-వోజ్‌లో ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. తర్వాత జర్మన్ మానవతావాదులు మార్టిన్ వాల్డ్‌సీములర్, మైథియాస్ రింగ్‌మెన్‌తో కలిసిన వాల్టర్ లూడ్ చిత్ర పటాలు వేసే ఎంతోమందిని ఒకే చోటుకు చేర్చాడు. Image copyrightSCIENCE HISTORY IMAGES / ALAMY చరిత్రకారుడు, రచయిత అయిన టోబీ లెస్టర్ తన పుస్తకంలో "ఈ మ్యాప్‌తో పాటూ ముద్రించిన ఒక పుస్తకంలో లూడ్ ఒక విషయం రాశారు. దాని ప్రకారం, అమెరికా అనే పేరును ఎంపిక చేసింది వారే". అని చెప్పారు. జర్మనీలోని ఇద్దరు నిపుణులు కూడా ఈ మ్యాప్ తయారీ ప్రాజెక్టు కోసం సెయింట్-డియే-దీ-వోజ్ చేరుకున్నారు. అంటే, డబ్బులు సంపాదించడం కంటే, ఈ పట్టణం ఉన్న ప్రాంతం కూడా వారికి చాలా ముఖ్యమైనదని అనిపించింది. "ఆ సమయంలో అట్లాంటి దాటిన అన్వేషకులు కొత్త ప్రపంచం నుంచి పోర్చుగల్, స్పెయిన్ చేరుకునేవారు. కొత్త కొత్త వివరాలు తీసుకొచ్చేవారు. అలాంటి యాత్రలకు ఇటలీలోని సంపన్నులు డబ్బు ఖర్చు చేసేవారు. రెండు దేశాల మధ్య ఉన్న జర్మనీ ప్రింటింగ్ రంగంలో అప్పుడే కొత్త కొత్త విజయాలను అందుకుంటూ ఉంది. ఆ ప్రాంతానికి చాలా మంది అన్వేషకులు వచ్చేవారు నగరంలో ప్రింటింగ్ ప్రెస్‌లు ఏర్పాటు చేసి తము సేకరించిన వివరాలతో పుస్తకాలు, మ్యాపులు రూపొందించేవారు. అలాంటి పట్టణాల్లో సెయింట్-డియే-దీ-వోజ్ కూడా ఒకటైంది. ప్రస్తుతం సెయింట్-డియే-దీ-వోజ్‌లో ఆ మధ్యయుగం నాటి ఆనవాళ్లు చాలా తక్కువ కనిపిస్తాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ పట్టణాన్ని మళ్లీ కొత్తగా నిర్మించారు. Image copyrightMADHAVI RAMANI మొదటి గ్లోబ్ తయారైంది ఇక్కడే సెయింట్-డియే-దీ-వోజ్ చర్చి బయట నేలపైన ఒక అమెరికా మ్యాప్ రూపొందించారు. దాన్ని అంత పరిశీలనగా చూడకుంటే అది మీకొక అలంకరణ చిత్రంలా కనిపిస్తుంది. చర్చికి ఉన్నఆశ్రమంలో ఒక ఆకృతి ఉంది, దానిపైన అమెరికా ఆదివాసీల ముద్రలు కనిపిస్తాయి. ప్రతి ఏటా ఈ పట్టణంలో రెండు అంతర్జాతీయ భౌగోళిక ప్రదర్శనలు జరుగుతాయి. అక్కడ అందరూ తమ ఆలోచనలు పంచుకుంటారు. బహుశా సెయింట్-డియే-దీ-వోజ్ వచ్చే చాలా మందికి ఈ మ్యాప్ తయారీ చరిత్ర గురించి తెలీదు. ఈ చారిత్రక పటం గురించి మిగిలిన కొన్ని ఆధారాలు నగరంలో ఉన్న లైబ్రరీలో చూడవచ్చనే విషయం వారికి తెలీదు. గత ఏడాది 18 వేల మంది సెయింట్-డియే-దీ-వోజ్ వచ్చారు. కానీ కేవలం 664 మంది మాత్రమే లైబ్రరీకి వెళ్లారు. ఈ లైబ్రరీలో ఆధునిక విషయాలతోపాటు, పాత కాలం నాటి గుర్తులను కూడా పదిలపరిచారు. ఎక్కడా కనిపించని కొన్ని పుస్తకాలతోపాటు వాల్డ్‌సీముల్లర్ పటంతో 1507లో ముద్రించిన పుస్తకం కూడా ఇక్కడుంది. ఆ పుస్తకం పేరు 'ఇంట్రడక్షన్ టు కాస్మోగ్రఫీ'. దీని ప్రస్తావన అంతా లాటిన్‌లో ఉంటుంది. అందులో రచయిత పుస్తకం రాసిన ఉద్దేశం ఏంటో చెప్పారు. గ్లోబుపై, ఉపరితలంపై మ్యాప్ తయారు చేసిన వ్యక్తులను అందరికీ పరిచయం చేయాలనేది తమ ఆశయం అన్నారు. ఇక్కడ ఉపరితలం అంటే వాల్డ్‌సీముల్లర్ మ్యాప్ అనే అర్థం వస్తుంది. ఈ మ్యాప్‌ను విడివిడిగా ఉన్న 12 పేజీల ముక్కలుగా ముద్రించారు. వాటిని ఒకటిగా కలిపారు. తర్వాత ఈ మ్యాప్‌లన్నింటినీ ఒక పెద్ద బంతిపై అతికించి ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబ్ తయారు చేశారు. ఈ గ్లోబ్ ద్వారా ప్రపంచం గుండ్రంగా ఉందని, చదునుగా లేదనే విషయం ఐరోపా ప్రజలకు మధ్యయుగంలోనే తెలుసనే విషయం నిరూపితమైంది. Image copyrightSCIENCE HISTORY IMAGES / ALAMY అమెరికాకు ఆ పేరెలా వచ్చింది? అమెరికాకు అసలు ఆ పేరు ఎలా వచ్చింది అనే మరో విషయం కూడా ఈ పుస్తకం ద్వారా మనకు తెలుస్తుంది. అమెరికా ఖండానికి ఆ పేరు ఇటలీ అన్వేషకుడు అమెరిగో వెస్పూచీ పేరుతో వచ్చింది. కానీ యూరోపా, ఆఫ్రికా, ఆసియా లాంటి మిగతా ఖండాల పేర్లన్నీ లాటిన్ భాషలోని స్త్రీవాచకంగా ఉండేవి.. అందుకే కొత్తగా కనుగొన్న ప్రపంచం పేరు కూడా అలాగే ఉండాలని అనుకున్నట్టు పుస్తకం రచయిత చెప్పారు. అలా.. అన్వేషకుడి పేరును బట్టి అతడు కనుగొన్న ఆ ఖండానికి అమెరికా అనే పేరు పెట్టారు. ఈ అమెరికా పేరుపై శతాబ్దాల పాటు వివాదం నడిచింది. 16వ శతాబ్దంలో బర్తోలోమె-డె-లా-కసాస్ అనే ఒక స్పెయిన్ సన్యాసి "ఇది కొలంబస్‌ను తీవ్రంగా అవమానించడమే" అన్నాడు. ఎందుకంటే అమెరిగో వెస్పూచీ కంటే ముందే ఆయన అమెరికాను చేరాడని చెప్పాడు. "ఫ్లోరెన్స్ వాసులు కుట్రచేసి కొలంబస్ కీర్తిని దొంగిలించారు" అని 1809లో అమెరికా రచయిత వాషింగ్టన్ ఇర్వింగ్ రాశారు. కానీ నిజం ఏంటంటే.. కొలంబస్ నాలుగు సార్లు అమెరికా యాత్రకు వెళ్లాడు. మొదటి సారి అతడు 1492లో కరేబియన్ దీవుల వరకూ వెళ్లాడు. 1498లో తన మూడో యాత్రలో మాత్రమే కొలంబస్ అమెరికా ఖండం ప్రధాన భూభాగంపై అడుగు పెట్టగలిగాడు. ఇటు 1504లో అమెరిగో వెస్పూచీ, ఫ్రాన్స్‌లోని లారెన్ ప్రాంతానికి రాజైన రీన్‌కు రాసిన లేఖను కూడా ఈ పుస్తకంలో అంటే 'ఇంట్రడక్షన్ టు కాస్మోగ్రఫీ'లో ముద్రించారు. ఇందులో అమెరిగో 1497 నుంచి 1504 వరకూ నాలుగు సార్లు అమెరికా యాత్ర చేసినట్టు ప్రస్తావించాడు. Image copyrightMADHAVI RAMANI అంటే కొలంబస్ కంటే ఒక సంవత్సరం ముందే అతడు అమెరికా ఖండం ప్రధాన భూభాగంపైకి చేరాడు. అయితే చరిత్రకారులు మాత్రం ఈ లేఖ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తారు. కానీ ఈ లేఖను నమ్మిన వాల్డ్‌సీముల్లర్, మైథియాస్ రింగ్‌మెన్ కొత్త ఖండానికి అమెరిగో పేరే పెట్టారు. అయితే ఈ మ్యాప్ గురించి చాలా వివాదాలు ఉన్నాయి. మ్యాప్‌లో కొత్త ఖండం చుట్టూ సముద్రం ఉన్నట్టు చూపించారు. ఈ మ్యాప్ తయారుచేసిన వారికి ఖండం చుట్టూ సముద్రం ఉన్నట్టు ఎలా తెలిసిందనే ప్రశ్నలు తలెత్తాయి. రికార్డుల ప్రకారం పసిఫిక్ మహాసముద్రాన్ని మొట్ట మొదట చూసిన ఐరోపా పౌరుడు స్పెయిన్‌కు చెందిన వాస్కో నూనెజ్ డే బాల్బోవా. 1507లో మ్యాప్ ముద్రించిన ఆరేళ్ల తర్వాత 1513లో అతడు పనామాలోని ఒక పర్వత శిఖరం పైనుంచి పసిఫిక్ మహా సముద్రాన్ని చూశానని చెప్పాడు. కేవలం అంచనాల ఆధారంగా అమెరికా చుట్టూ సముద్రం ఉన్నట్టు చూపించారా, లేక ఖండానికి అవతలి వైపు వెళ్లి చూశామని చెప్పిన ఫోర్చుగీసు వారి వివరాల ప్రకారం అలా చిత్రించారా అనే విషయం ఈ మ్యాప్ చిత్రకారులు రహస్యంగా ఉంచారు. పోర్చుగీస్, స్పెయిన్ మధ్య 1494లో ఒక ఒప్పందం జరిగడమే దీనికి కారణం. ఈ ఒప్పందం ప్రకారం మొత్తం ప్రపంచాన్ని ఈ రెండు దేశాలూ పంచుకున్నాయి. 'టార్డెసిల్లాస్' అనే ఆ ఒప్పందం ప్రకారం ప్రస్తుత బ్రెజిల్ పశ్చిమాన ఉన్న మొత్తం ప్రాంతం స్పెయిన్ వాటాలోకి వస్తుంది. అందుకే దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ పోర్చుగల్ భాష మాట్లాడే ఒకే ఒక దేశంగా నిలిచింది. Image copyrightMADHAVI RAMANI కాపీలు ఎలా మాయమయ్యాయి ఈ మ్యాప్ తయారీలో మరో రహస్యం ఉంది. 1507లో ఈ మ్యాప్‌ను వెయ్యి కాపీలు ముద్రించారు. కానీ అవన్నీ వేగంగా మాయమైపోయాయి. పుస్తకాన్ని లైబర్రీలో ఉంచి భద్రంగా కాపాడిన వారు, మ్యాపులను మాత్రం చాలా విద్యా సంస్థల్లో ప్రదర్శించారు. దాంతో అవి ఎక్కువ కాలం పాటు అందుబాటులో లేకుండాపోయాయి. ఈ మ్యాపుల కోసం చాలా మంది శతాబ్దాల పాటు వెతికారు. వాల్డ్‌సీములర్ పటాలకు కొత్త రూపం ఇవ్వాలని ప్రయత్నించారు. చివరికి జర్మనీకి చెందిన ఒక చరిత్ర ప్రొఫెసర్ ఫాదర్ జోసెఫ్ ఫిషర్ ఈ మ్యాప్‌కు సంబంధించిన ఒక కాపీని జర్మనీలోని వాల్ఫ్‌గెగ్ కాసల్ నుంచి వెతికి పట్టారు. ఈ మ్యాప్‌ను కొంతమంది అమెరికా బర్త్ సర్టిఫికెట్‌గా అభివర్ణిస్తారు. 2003లో అమెరికా పార్లమెంటు లైబ్రరీ ఈ మ్యాప్‌ను ఒక కోటి డాలర్లు అంటే సుమారు 70 కోట్ల రూపాయల భారీ మొత్తం ఇచ్చి కొనుగోలు చేసింది. "ఈ మ్యాప్ తయారు చేయడంలో చాలా మంది పాత్ర ఉంది. ఎంతోమంది నిపుణలు కలిసి ఈ మ్యాప్ తయారు చేశారు. దానిని మధ్యయుగంలో తయారు చేయడంతో దానికి ఇంత ప్రాధాన్యం లభించింది" అని టోబీ లెస్టర్ చెప్పారు. Image copyrightTHE PICTURE ART COLLECTION / ALAMY మ్యాప్ ద్వారా సందేశం మ్యాప్ పైభాగంలో గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త టాల్మీ చిత్రం ఉంది. దీని ద్వారా అంతకు ముందు వారు చూసిన దృష్టితో ప్రపంచాన్ని చూశామని చిత్రకారులు చెప్పారు. దానిపై మరో వైపు అమెరిగో వెస్పూచీ చిత్రం కూడా ఉంది. అది ప్రపంచాన్ని కొత్త వివరాలతో, కొత్త దృష్టితో చూశామనే మరో విషయాన్ని కూడా చెబుతుంది. పురాతన ఆలోచనలకు చోటు కల్పించడం వల్లే వాల్డ్‌సీముల్లర్ ఈ మ్యాప్‌లో టాల్మీ కాలంలో వేసిన ఐరోపాను చిత్రించాడు. 1507లో తప్పని నిరూపితమైన దీనిని వెయ్యేళ్ల ముందే వేశారు. మొదట చిత్రించిన మ్యాపుల్లో పైన దేవుడి బొమ్మ ఉండేది. కానీ కొత్త పటంలో ఇద్దరు మనుషులను చూపించారు. అంటే మానవులు కొత్త ప్రపంచాన్ని అన్వేషించగలిగినప్పుడు ఆ ప్రపంచంపై వాళ్లు ఆధిపత్యం కూడా చూపించగలరని వారు తమ చిత్రాలతో ఒక సందేశం ఇచ్చారు. ఐన్‌స్టీన్ ‘థియరీ ఆఫ్ హ్యాపీనెస్’ అన్ని పటాలూ రాజకీయంగా ఉంటాయని వాల్డ్‌సీములర్ మ్యాప్ కూడా చూపిస్తోంది. మ్యాపుల్లో పైన ఉత్తర దిశను, మధ్యలో యూరప్‌ను చూపించిన చిత్రకారులందరూ దానిని ప్రపంచానికి కేంద్రంగా చెప్పారు. అంతకు ముందు మ్యాపుల్లో తూర్పు దిశను పైన ఉంచేవారు. ఒక ఖండానికి యూరప్ పౌరుడి పేరు పెట్టిన చిత్రకారులు ఈ మ్యాప్ ద్వారా యూరోపియన్ దేశాల ఆశయం ఏంటో వెల్లడించారు. రెండో ప్రపంచాన్నికూడా జయించి, అక్కడి నాగరికత, సంస్కృతి, వనరులు, స్థానికులపై పైచేయి సాధిస్తామని, పురాతన నాగరికతను తొలగిస్తామని తమ పటం ద్వారా చెప్పారు. "1492లో ఉనికిలోకి వచ్చిన ఆ కొత్త ప్రపంచానికి ఈ మ్యాప్ బర్త్ సర్టిఫికెట్, అంతకు ముందు ఉన్న ప్రపంచానికి డెత్ సర్టిఫికెట్" అని టోబీ లెస్టర్ తన పుస్తకంలో చెప్పారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.