Jump to content

‘ప్రపంచకప్‌ను భారత్‌కు అమ్మేశాం’: విచారణకు ఆదేశం ..


r2d2

Recommended Posts

‘ప్రపంచకప్‌ను అమ్మేశాం’: విచారణకు ఆదేశం

కొలంబో: 2011 ప్రపంచకప్‌ను భారత్‌కు అమ్మేశామన్న మహిందానంద అలుత్తామాగె చేసిన ఆరోపణలపై శ్రీలంక క్రీడల శాఖ స్పందించింది. ఫిక్సింగ్‌పై విచారణ మొదలుపెట్టింది. ప్రస్తుత క్రీడామంత్రి దుల్లాస్‌ అలహప్పరుమ దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తు ప్రగతిపై ప్రతి రెండు వారాలకొకసారి నివేదిక అందించాలని ఆదేశించారు. ఆయన మేరకు సంబంధిత శాఖా కార్యదర్శి కేఏడీఎస్‌ రువాన్‌చంద్ర క్రీడాశాఖ దర్యాప్తు విభాగానికి ఫిర్యాదు చేశారు.మహిందానంద అలుత్గామాగె గతంలో క్రీడామంత్రిగా పనిచేశారు. ఆయన పదవీకాలంలోనే ప్రపంచకప్‌ జరిగింది. ‘‘2011 ప్రపంచకప్‌ను మేం అమ్మేశామని ఈ రోజు చెప్తున్నా. క్రీడా మంత్రిగా ఉన్నప్పుడు ఇదే చెప్పా. ఒక దేశానికి సంబంధించిన మంత్రిగా నేను ఈ విషయం ప్రకటించాలనుకోవట్లేదు. ఆ మ్యాచ్‌లో ఫిక్సింగ్‌ జరిగిందని మీకు చెప్పడం నా బాధ్యతగా భావిస్తున్నా’’ అని ప్రస్తుతం విద్యుత్‌ శాఖ మంత్రిగా ఉన్న మహిందానంద పేర్కొన్నాడు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఆ దేశ దిగ్గజ ఆటగాళ్లు జయవర్ధనె, సంగక్కర.. తగిన ఆధారాలు చూపాలని మంత్రిని డిమాండ్‌ చేశారు. ‘‘అతను ఆ ఆధారాలను ఐసీసీకి సమర్పించాలి. అప్పుడు దానిపై విచారణ జరుగుతుంది’’ అని సంగక్కర ట్వీట్‌ చేశాడు. ‘‘ఎన్నికలు రాబోతున్నాయా? సర్కస్‌ మళ్లీ మొదలైనట్లుంది. వాళ్ల పేర్లు, ఆధారాలు ఎక్కడ?’’ అని జయవర్ధనె ప్రశ్నించాడు. అయితే ఈ ఫిక్సింగ్‌లో ఆటగాళ్ల ప్రాతినిథ్యం లేదని మహిందానంద చెప్పడం విశేషం.

 
Link to comment
Share on other sites

1 minute ago, sattipandu said:

ok then lets buy the next world cup

kharchu entha ayaina paravaledhu ....

manishi ko 10rs vesukunna 

manade cup

Link to comment
Share on other sites

అయితే ఈ ఫిక్సింగ్‌లో ఆటగాళ్ల ప్రాతినిథ్యం లేదని మహిందానంద చెప్పడం విశేషం.

malinga barber ki ichara betting dabbulu :D

 

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...