Jump to content

సరిహద్దుల్లో సమర ధ్వని


kakatiya

Recommended Posts

సరిహద్దుల్లో సమర ధ్వని

భారీగా రంగంలోకి దిగిన భారత వాయుసేన
చైనా చేరువలోకి లోహ విహంగాల తరలింపు
ఉద్ధృతంగా గస్తీ తిరుగుతున్న పోరాట విమానాలు, హెలికాప్టర్లు
హిందూ మహాసముద్రంలో నౌకాదళం అప్రమత్తం
10 మంది భారత సైనికుల్ని విడుదల చేసిన పొరుగుదేశం
దిల్లీ

* తన అమ్ములపొదిలోని కీలకమైన సుఖోయ్‌-30 ఎంకేఐ, మిరాజ్‌-2000, జాగ్వార్‌ యుద్ధవిమానాలను భారత వాయుసేన గత మూడు రోజుల్లో శ్రీనగర్‌, అవంతిపొర, లేహ్‌ ప్రాంతాలకు పంపింది. ఆదేశాలు వచ్చిన మరుక్షణం రంగంలోకి దిగేలా వాటిని సన్నద్ధం చేసింది.


* ఇటీవలే అమెరికా నుంచి సమకూర్చుకున్న అధునాతన అపాచీ హెలికాప్టర్లనూ భారత్‌ మోహరించింది. సిక్కిం, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌కూ మరిన్ని యుద్ధ విమానాలను తరలించింది.

main-1b_48.jpg

Link to comment
Share on other sites

So enni rojulo surrender avutham china ki?

Hamayya ma family lo evaru army lo leru.

Jai javan raktham chinduchu desani kapadu pranalu fanaga pettu.memu 2 mins spend chestham silence nekosam. 

Link to comment
Share on other sites

Meanwhile

 

 

 

ఎన్‌కౌంటర్‌లో 8 మంది ఉగ్రవాదుల హతం

షోపియాన్, పాంపొరా ప్రాంతాల్లో ఘటన

Jammu-and-Kashmir-encounter.jpg Jammu and Kashmir encounter

శ్రీనగర్‌: జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల ఏరివేత కొన‌సాగుతోంది. గ‌త 24 గంట‌ల్లో ఎనిమిది మంది ఉగ్ర‌వాదుల‌ను ముట్టుబెట్టారు. పాంపొరాలోని ఓ మసీదులో నక్కిన ఉగ్రవాదులను బయటకు రప్పించడానికి భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్‌ను విజయవంతంగా వినియోగించారు. మసీదుకు నష్టం కలగకుండా అన్ని చర్యలు తీసుకుని వారిని హతమార్చారు. షోపియాన్‌లో మొత్తం ఐదుగురిని, పాంపొరాలో ముగ్గుర్ని హతమార్చినట్లు అధికారులు ప్రకటించారు.

సాధార‌ణంగా ఉగ్ర‌వాదులు దాక్కున్న ప్రాంతాన్ని చేధించేందుకు.. భ‌ద్ర‌తా ద‌ళాలు ఎక్కువ‌గా ఐఈడీల‌ను వాడుతుంటారు లేదా ఫైరింగ్‌కు పాల్ప‌డుతుంటారు. కానీ పాంపోర్ ఆప‌రేష‌న్ అత్యంత అరుదైన‌ద‌ని పోలీసులు చెబుతున్నారు. కేవ‌లం టియ‌ర్ స్మోక్ షెల్స్‌తోనే ఆప‌రేష‌న్ నిర్వ‌హించి.. ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టిన‌ట్లు తెలిపారు.  ఉగ్ర‌వాదులు ఉన్న స‌మాచారం తెలుసుకున్న పోలీసులు.. నిన్న ఉద‌యం నుంచి ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టారు.

Link to comment
Share on other sites

ప్రభుత్వం నిద్ర పోతోంది : రాహుల్‌ గాంధీ

Posted On: Friday,June 19,2020
1592581283.Rahul-Gandhi--696x392.jpg




న్యూఢిల్లీ : గాల్వన్‌ లోయలో చైనా పథకం ప్రకారమే దాడి చేసిందని, ఇది తెలిసి కేంద్రం నిద్రపోతుంటే.. మన అమర జవాన్లు అందుకు మూల్యం చెల్లించారని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాహుల్‌ గాంధీ కేంద్రంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితిపై చర్చించడానికి ప్రధాని మోడీ శుక్రవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి కొద్ది సమయం ముందు 'గాల్వన్‌ వ్యాలీలో చైనా దాడి ముందస్తు ప్రణాళికతో జరిగింది. ఇది తెలిసి కేంద్రం నిద్రపోయింది. ఈ హెచ్చరికలను ఖండించింది. ఫలితంగా మన అమర జవాన్లు మూల్యం చెల్లించారు' అని ట్వీట్‌ చేశారు. దీంతో పాటు 'చైనా ముందస్తుగా ప్లాన్‌ చేసిందని, భారత దళాలు తగిన సమాధానం ఇస్తాయని' రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్‌ చేసిన ట్వీట్‌ను, నివేదికను జత చేశారు. ఇప్పటి వరకూ జరిగింది చాలు.. అక్కడ ప్రస్తుతం ఏం జరుగుతోందో తెలియాలంటూ డిమాండ్‌ చేశారు.

Link to comment
Share on other sites

చైనా వస్తువుల బ్యాన్‌ తొందరపాటు చర్య: కేసీఆర్‌

 
share on facebook
 

kcr.jpgహైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభంలో గాల్వన్ లోయ ఘటనలో మరణించిన సైనికులకు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తన అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దన్నారు. అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని సీఎం అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానమంత్రికి సూచించారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజకీయం (రాజ్ నీతి) కాదని, యుద్ధనీతి (రణ్ నీతి) కావాలని చెప్పారు. భారతదేశంలో పరిపాలన సుస్థిరంగా ఉండడంతో పాటు, గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడం ఓర్వలేకనే చైనా కయ్యానికి కాలుదువ్వుతున్నదని సీఎం అభిప్రాయపడ్డారు. గాల్వన్ లోయలో వీర మరణం పొందిన సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అందించే సాయాన్ని కూడా సీఎం ప్రకటించారు.

చైనా, పాకిస్తాన్ దేశాలకు తమ దేశాల్లో అంతర్గత సమస్యలున్నప్పుడు సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం సృష్టించడం అలవాటు. ఇప్పుడు చైనాలో కూడా అంతర్గత సమస్యలున్నాయి. దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్, జపాన్ తదితర దేశాలతో కూడా చైనా ఘర్షణలకు దిగుతున్నది. చైనా వైఖరి ప్రపంచవ్యాప్తంగా బాగా అపఖ్యాతి(బద్నాం) పాలయిందని ముఖ్యమంత్రి అన్నారు. భారతదేశంతో చైనా మొదటి నుంచి ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నది. గాల్వన్ లోయ లాంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. 1957లో సరిహద్దు వివాదం లేవనెత్తింది. 1962లో ఏకంగా భారత్ – చైనా మధ్య పూర్తిస్థాయి యుద్ధమే జరిగింది. 1967లో కూడా సరిహద్దులో ఘర్షణ జరిగింది. అప్పుడు 200 మంది మృతి చెందారు. ఇప్పుడు గాల్వన్ వద్ద మళ్లీ ఘర్షణలు జరిగాయి. అందులోనూ మన సైనికులు 20 మంది మరణించారు. వేల కిలోమీటర్ల సరిహద్దు కలిగిన దేశంతో ఎక్కడో ఓ చోట  ఏదో ఓ గొడవ జరుగుతూనే ఉంది. చైనాతో భారతదేశానికి ఎప్పటికైనా ప్రమాదం పొంచి వుంది. కాబట్టి మనం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉందని సీఎం కేసీఆర్ సూచించారు.

చైనా ఇటీవల కాలంలో భారతదేశంతో ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తున్నది. దానికి ప్రత్యేక కారణాలున్నాయి. కాశ్మీర్ విషయంలో కొత్త చట్టాలు తెచ్చాం. అక్కడి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం. పివోకె గురించి గట్టిగా మాట్లాడుతున్నాం. ఆక్సాయ్ చిన్ మనదే అని..అది చైనా ఆక్రమించిందని పార్లమెంటులోనే మన కేంద్ర మంత్రి ప్రకటించారు. గాల్వన్ లోయ దేశ రక్షణ విషయంలో స్ట్రాటజిక్ పాయింట్. అక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. ఇది చైనాకు నచ్చడం లేదు. అందుకే ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తున్నదని సీఎం చెప్పారు. మనది శాంతికాముక దేశం. అదే సమయంలో సహనానికి హద్దు ఉంటుంది. ఎవరైనా మన మీదకి వస్తే తీవ్రంగా ప్రతిఘటించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశ రక్షణ, ప్రయోజనాల విషయంలో రాజీ పడవద్దు. ఈ పరిస్థితుల్లో రాజకీయం అవసరం లేదు. రణనీతి కావాలి. దేశమంతా ఒక్కతాటిపై నిలబడాల్సిన సమయం ఇది. గతంలో కూడా ఇతర దేశాలతో ఘర్షణలు, యుద్ధాలు జరిగినప్పుడు ఇలాగే నిలబడిన సందర్భాలున్నాయి. చైనా, పాక్, బంగ్లాదేశ్ తో యుద్దాలు చేసిన అనుభవం మనకున్నది. 1970 ప్రాంతంలో బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో ఇందిరాగాంధీని వాజ్ పేయి దుర్గామాత అని కొనియాడారు. అలాంటి స్ఫూర్తి ఇప్పుడు కావాలి. దేశమంతా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి అండగా నిలవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు ఈ సమయంలో దేశ ప్రధానికి అండగా ఉంటారని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.

ఆత్మ నిర్భర్ భారత్ (స్వయం సమృద్ధ భారతదేశం) కావాలని మనం కోరుకుంటున్నాం. కానీ చైనా మాత్రం అన్య నిర్భర్ భారత్ (ఇతరులపై ఆధారపడే భారతదేశం) కావాలని ఆకాంక్షిస్తున్నదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మన దేశం ఎదగడం చైనాకు ఇష్టం లేదు. ఆర్థికంగా ప్రబల శక్తిగా భారత్ మారుతున్నది. అమెరికా 21 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక శక్తి అయితే, చైనా 14 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉంది. 5 ట్రిలియన్ డాలర్ల సంపద కలిగిన జపాన్ తో పాటుగా భారత్ 

Link to comment
Share on other sites

IAF to urgently procure 21 MiG 29s, 12 Su 30s

 


The IAF is seeking to urgently procure 21 additional MiG 29 fighter jets from Russia to add to its three squadrons of the type already in service. These fighters, which include two trainers, are expected to be procured at a reasonable price as they have already been partially manufactured in Russia for a previous order that got cancelled.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...