Jump to content

Bro sensational answer for banning chinese goods


AFDBRAJA

Recommended Posts

Chinese goods ban chesthe nastam manake.

చేతిలో చైనా ఫోన్ పట్టుకొని.. చైనాకి చెందిన రూటర్ ద్వారా వచ్చిన ఇంటర్నెట్ కనెక్షన్‌తో Facebook ఓపెన్ చేసి,"చైనా ఉత్పత్తులను బ్యాన్ చేయాలి" అని నినదించి.. అప్పుడే వచ్చిన టిక్ టాక్ నోటిఫికేషన్ చూసి వీడియోలు ఆస్వాదిస్తున్న తరం మనది. మనకేం కావాలో మనకే స్పష్టత లేని ఒట్టి నినాదాల తరం. పాలకులు చైనా ఉత్తత్పులు బ్యాన్ చేస్తే.. అంతర్జాతీయ మార్కెట్లో, చైనాకి ఎగుమతి అవుతున్న మన ఉత్పత్తులూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొని.. మన ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది అని తెలీని అమాయకత్వం.

 ఆవేశం ఉండటంలో తప్పులేదు.. కాస్త ఆలోచన కూడా ఉండాలి. అర్జంటుగా చేతిలో ఉన్న చైనా ఉత్పత్తిని చెత్తకుప్పలో పారేసి నినాదాలు పలికే నిజాయితీ కలిగిన వారు మనకు కావాలి. ఒట్టి నినాదాలతో ఒనకూరేదేముంది?

చైనా ఉత్పత్తులను వాడకూడదు అనుకుంటే.. అక్కడ నుండి దిగుమతి అయిన ముడిపదార్థాలతో తయారైన పారాసిటమాల్ టాబ్లెట్స్, ఇతర మెడికల్ ఎక్విప్‌మెంట్ కూడా వాడకూడదు. అంతర్జాతీయ వాణిజ్యం, ఒప్పందాలూ మనం అనుకునే సాధారణ నినాదాల్లా ఉండవు.

మీకు ఇంటర్నెట్, టెలికం సేవలు అందించే Airtel, Act Fibernet వంటి వాటిలో 95 శాతం నెట్‌వర్క్ ఎక్విప్‌మెంట్ చైనా ఉత్పత్తులు ఉంటాయి. వాటిని ఇండియాలో తయారు చేసుకునే మౌలిక సదుపాయాలు ఇక్కడ లేవు. ఇప్పటికిప్పుడు నెట్ ఆపేసి.. ఇండియాలో అవన్నీ తయారు చేసుకున్నప్పుడు నెట్ వాడడం మొదలుపెడదామా? లాజిక్ లేని నినాదాలు! ముందు పాలకులను మౌలిక సదుపాయాలు సృష్టించమని నిలదీయండి.. 
రాజకీయాలు మానేసి!!

2)
ప్రపంచవ్యాప్తంగా 18-35 సంవత్సరాల వయసు యువతరం ఉన్న దేశాల్లో ఇండియా మొదటి స్థానాల్లో ఉంటుంది. సద్వినియోగం చేసుకుంటే ఇదే యువత దేశ భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. "చైనా ఉత్పత్తులు నిషేధించండి" అనే నినాదాలు ఎంత పేలవమైనవో ఇంతకుముందు రాశాను.

చైనాలో కుటీర పరిశ్రమలు ఎక్కువ. ప్రతీ ఇంట్లోనూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు తమ కంట్రిబ్యూషన్ అందిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన దేశంలో మాత్రం ఒక వ్యక్తి మీద కుటుంబం మొత్తం ఆధారపడుతుంది. దానికి తోడు టిక్‌టాక్ వీడియోలు చూసుకుంటూ, PUBG గేమ్స్ ఆడుకుంటూ, గంటలతరబడి వాట్సప్ లో చాట్ చేసుకుంటూ, యూట్యూబ్‌లో ఫలానా హీరోయిన్ ఎవరితో డేట్ చేస్తోంది వంటి వీడియోలు చూసుకుంటూ.. విలువైన సమయాన్ని యువతరం మొదలుకొని బాధ్యత కలిగిన పెద్దవాళ్ళ వరకు వృధా చేస్తుంటారు.

 కొత్త విషయాలు నేర్చుకోవాలన్న పట్టుదల, స్పృహ, జిజ్ఞాస ఉండదు. కులాలు, మతాల, రాజకీయ పార్టీల కోసం బూతులు తిట్టుకుంటూ, కొట్టుకుంటారు. ఇలాంటి ఆలోచన విధానం కలిగిన మన వాళ్లు దేశానికి ఏం మేలు చెయ్యగలరు? అర్థం పర్థం లేని స్లొగన్స్ ఇవ్వటం తప్పించి!!

- Nallamothu Sridhar

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...