Jump to content

ఔట్‌ కాకున్నా సచిన్‌కు రెండుసార్లు ఔటిచ్చా !!!


r2d2

Recommended Posts

తప్పుడు నిర్ణయాలపై దిగ్గజ అంపైర్‌ పశ్చాత్తాపంఔట్‌ కాకున్నా సచిన్‌కు రెండుసార్లు ఔటిచ్చాక్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ రెండుసార్లు ఔట్‌ కాకున్నా పొరపాటున ఔటిచ్చానని ఒకప్పటి దిగ్గజ అంపైర్‌ స్టీవ్‌బక్నర్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాజాగా ఓ రేడియో కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 2003లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన గబ్బా టెస్టులో తొలిసారి తప్పుడు నిర్ణయం ప్రకటించిన బక్నర్‌ తర్వాత ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా 2005లో పాకిస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌లో రెండోసారి అదే తప్పు చేశారు. ఈ రెండు సంఘటనలను వివరించిన ఆయన‌ ఏ అంపైర్‌ కూడా కావాలని తప్పుడు నిర్ణయాలు ఇవ్వడని స్పష్టంచేశారు. 
 

‘సచిన్‌ తెందూల్కర్‌ రెండు సందర్భాల్లో ఔటవ్వకపోయినా పొరపాటున ఔటిచ్చాను. ఏ అంపైర్‌ కూడా కావాలని అలా చేయడు. అలా తప్పుడు నిర్ణయాలు వెల్లడిస్తే అది భవిష్యత్‌లో అతడికి హాని కలుగుతుంది. అయితే, తప్పులు చేయడం మానవ సహజం. ఒకసారి ఆస్ట్రేలియాలో గబ్బా టెస్టులో తెందూల్కర్‌ను ఎల్బీగా ఔటిచ్చాను. జేసన్‌ గిలెస్పీ వేసిన ఆ బంతి వికెట్ల పైనుంచి వెళ్లింది. ఇంకోసారి భారత్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో నాటౌట్‌ని ఔటిచ్చా. ఈడెన్స్‌గార్డెన్స్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో అబ్దుల్‌ రజాక్‌ వేసిన ఓ బంతి సచిన్‌ బ్యాట్‌ దాటివెళ్లాక మలుపు తిరిగింది. కానీ ఆ బంతి బ్యాట్‌కు తగల్లేదు. ఈడెన్‌గార్డెన్స్‌లో మ్యాచ్‌ అంటే ప్రేక్షకుల సందడి చాలా అధికంగా ఉంటుంది. దీంతో అక్కడ ఏం జరిగినా వినపడదు. అలా రెండుసార్లు తప్పులు చేశా. కానీ బాధపడ్డా. మానవులు తప్పులు చేయడం సహజమే. వాటిని అంగీకరించడం జీవితంలో భాగం’ అని బక్నర్‌ తన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నాడు.

Link to comment
Share on other sites

1 hour ago, reality said:

Title chusi thread open cheyakundane anukunna Bucknor gade ani..

90s he used to be very good but in 2000s possibly age started to catch up did some blunders...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...