Jump to content

Bangaru telangana

Hydrockers

Recommended Posts

కరోనా లక్షణాలతో ఓ యువకుడు ప్రాణాలు విడిచాడు. అయితే, తనకు ఊపిరి ఆడటం లేదని, వెంటిలేటర్ పెట్టమని బతిమలాడినా సిబ్బంది పట్టించుకోలేదని అతను చనిపోయేముందు కుటుంబ సభ్యులకు చెప్పినట్టు తెలిసింది. నగరంలోని జవహర్‌ నగర్‌కు చెందిన యువకుడు కరోనా లక్షణాలతో చెస్ట్‌ ఆస్పత్రిలో చేరాడు. ఊపిరి ఆడటం లేదని, ప్రాణం పోయేలా ఉందని కుటుంబ సభ్యులకు వీడియో కాల్‌ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. పెట్టిన వెంటిలేటర్‌ను తొలగించారని ఆరోపించాడు. చివరి క్షణంలో అందరికీ వీడ్కోలు చెప్తూ దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి వీడియో రికార్డింగ్‌ బయటకు రావడంతో డాక్టర్ల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, యువకుడి అంత్యక్రియల్లో 30 మంది బంధువులు పాల్గొన్నట్టు సమాచారం. అంత్యక్రియల అనంతరం అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో స్థానికులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు

Link to comment
Share on other sites

ఉన్నట్లుండి మళ్లీ లాక్ డౌన్ అంటూ వార్తలు వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్నాయి.హైదరాబాద్ లో పరిస్థితిని అదుపులోకి తేవాలంటే మళ్లీ లాక్ డౌన్ ఒక్కటే మార్గమని అధికారులు ముఖ్యమంత్రి కేసిఆర్ కు సూచించారంటూ వార్తలు వినవస్తున్నాయి. లాక్ డౌన్ తీసేసిన తరువాత హైదరాబాద్ లో కరోనా పరిస్థితి అదుపుతప్పింది. నిత్యం వందలాది కేసులు నమోదు అవుతున్నాయి.

ఇవి కాక ప్రయివేటు క్లినిక్స్ లో నమోదు కాని పాజిటివ్ పరిక్షలు ఎన్నో జరుగుతున్నాయని వార్తలు వున్నాయి. ఎక్కడా ఏ ఆసుపత్రి ఖాళీ లేదు. జనం విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. కరోనా భయం వాట్సాప్ ల్లో తప్ప మరెక్కడా కనిపించడం లేదు. 

ఇలాంటి నేపథ్యంలో మరో సారి రెండు వారాల పాటు లాక్ డౌన్ విధిస్తే తప్ప ఫలితం లేదని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ స్కూళ్లు, థియేటర్లు, ఐటి సంస్థలు మూతపడే వున్నాయి. కేవలం రెగ్యులర్ దుకాణాలు మాత్రమే తెరచి వున్నాయి. అత్యవసరమైన దుకాణాలకు మాత్రమే అనుమతి ఇచ్చి, మిగిలినవి బంద్ చేయించాలని, ఏరియాల వారీ కదలికలు రిస్ట్రిక్ట్ చేయాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

5 minutes ago, Hydrockers said:

కరోనా లక్షణాలతో ఓ యువకుడు ప్రాణాలు విడిచాడు. అయితే, తనకు ఊపిరి ఆడటం లేదని, వెంటిలేటర్ పెట్టమని బతిమలాడినా సిబ్బంది పట్టించుకోలేదని అతను చనిపోయేముందు కుటుంబ సభ్యులకు చెప్పినట్టు తెలిసింది. నగరంలోని జవహర్‌ నగర్‌కు చెందిన యువకుడు కరోనా లక్షణాలతో చెస్ట్‌ ఆస్పత్రిలో చేరాడు. ఊపిరి ఆడటం లేదని, ప్రాణం పోయేలా ఉందని కుటుంబ సభ్యులకు వీడియో కాల్‌ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. పెట్టిన వెంటిలేటర్‌ను తొలగించారని ఆరోపించాడు. చివరి క్షణంలో అందరికీ వీడ్కోలు చెప్తూ దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి వీడియో రికార్డింగ్‌ బయటకు రావడంతో డాక్టర్ల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, యువకుడి అంత్యక్రియల్లో 30 మంది బంధువులు పాల్గొన్నట్టు సమాచారం. అంత్యక్రియల అనంతరం అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో స్థానికులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు

Ridiculous

Link to comment
Share on other sites

1 minute ago, caesar said:

Ridiculous

Thittaniki words kuda levu

Antha worst 

Chinna dora vachi ventilators pedite prizes istara ani antadu emo

Link to comment
Share on other sites

తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో 180 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు అకాడమీ డైరెక్టర్ వికె సింగ్ చెప్పారు. అయితే వీరిలో ఎక్కువ మందికి కరోనా లక్షణాలు లేవని, అయినా పాజిటివ్ వచ్చిందని ఆయన అన్నారు.కరోనా వచ్చినవారిలో వంద మంది శిక్షణ ఎస్.ఐ.లు ఉండగా, ఎనభై మంది సిబ్బంది ఉన్నారు.వైరస్ వచ్చినవారందరికి అకాడమీలోనే ఐసోలేషన్ ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.అకాడమీలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. 1100 మంది ఎస్ఐ లు, 600 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పొందుతున్నారు.200 మంది సిబ్బంది ఉన్నారు.

కాగా హైదరాబాద్ పశ్చిమ మండలం లోని మెడికల్ షాపుల వారు రాత్రి ఏడుగంటల కల్లా షాపులు మూసివేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపద్యంలో అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

Link to comment
Share on other sites

Aa bokkalae prathi dhaniki thodalu kotrukonae USA kae ucha poyinchindhi corona..TS is pilla pitri compared to USA..so chill..!

Anyways it's just a jwaram.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...