Jump to content

Beaware of this realestate agent in Hyderabad... 300cr assam...


Spartan

Recommended Posts

38 minutes ago, Hydrockers said:

0.8% takkuve but daniki kuda mosam chesi mingadu ga

Endo janalu

8% per month or 96% per year.

 

Janalu urike dabbulu vastunnayi ani egabadi biscuit ayyaru 

 

Link to comment
Share on other sites

  • Replies 39
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Hydrockers

    9

  • snoww

    8

  • Spartan

    5

  • tom bhayya

    4

4 minutes ago, AndhraneedSCS said:

8% per month or 96% per year.

 

Janalu urike dabbulu vastunnayi ani egabadi biscuit ayyaru 

 

10 lacs ki 8k anukunna kaka

Janalaki mari asha ekkuva ayyi pettaru emo

Link to comment
Share on other sites

5 minutes ago, Hydrockers said:

10 lacs ki 8k anukunna kaka

Janalaki mari asha ekkuva ayyi pettaru emo

no 1L ki 8k anta...   free money easy money eppatiki undadu

Link to comment
Share on other sites

11 hours ago, Spartan said:

yes   invest 1L and u get 8K per month ani edo scheme tesadu

oka pakkana KCR inko pakka KTR bommal petti..300cr namam petti jump

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Skip
 
×

Very nice..

Link to comment
Share on other sites

11 hours ago, Spartan said:

yes   invest 1L and u get 8K per month ani edo scheme tesadu

oka pakkana KCR inko pakka KTR bommal petti..300cr namam petti jump

bank odu year ki iche interest ni veedu month ki ista anagane egeskoni poinaru comedy gallu. 

Kani vadiki antha money etla ostay ani think cheyale 😀

Link to comment
Share on other sites

10 hours ago, snoww said:

Investing on a plot below Rs. 10,00,000/- and getting Rs. 50,000/- Returns every month is better than purchasing a 2 BHK Flat and getting 25 to 30,000 k rent....be smart and invest smart at swadhathri

@3$%

Link to comment
Share on other sites

Veedu amway policy baga follow aiyyadu.. Daily ilanti cases chala chusthunnam.. But still ilanti vatillo invest chesthunnaru

I know few ppl who still invest in local chit funds... invest chesina vallaki vundali.. రుణధార, స్వచ్ఛ ట్రేడర్స్‌, స్వధాత్రి ఫైనాన్స్‌ తదితర పేర్లతో విభాగాలను ప్రారంభించి ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు అమ్మితే కమీషన్‌ ఇస్తానంటూ ఏజెంట్లను నియమించుకున్నారు. ఆయా సంస్థల్లో రూ.లక్ష పెట్టుబడి పెట్టిస్తే పెట్టుబడిదారులకు నెలకు రూ.7800 లాభం ఇస్తామని, ఏజెంట్లకు కమీషన్‌ కూడా చెల్లిస్తామని నమ్మబలికాడు. దీంతో ఏజెంట్లు భారీగా సభ్యులను చేర్పించి పెట్టుబడులు పెట్టించారు. సభ్యులకు నెలకు రూ.5 వేలు ఇచ్చి.. తాము రూ.2800 తీసుకునేవారు

Link to comment
Share on other sites

15 minutes ago, ChinnaBhasha said:

bank odu year ki iche interest ni veedu month ki ista anagane egeskoni poinaru comedy gallu. 

Kani vadiki antha money etla ostay ani think cheyale 😀

Real estate lo invest sesthunna annadu kada. one Year lo easy gaa multiple times avuthayee kada lands rates ani public thinking. 

Link to comment
Share on other sites

స్వాదాద్రి రియల్ ఎస్టేట్ స్కాం: ముగ్గురు అరెస్ట్‌

4 Jul, 2020 16:49 IST|Sakshi
photo.jpg?itok=7rLTilXl
 

సాక్షి, హైదరాబాద్‌ : స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కుంభకోణం కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. స్వాదాద్రి రియల్‌ ఎస్టేట్‌ ఎండీ రఘుతో పాటు శ్రీనివాస్‌, మీనాక్షి అనే మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.  ప్రజ‌ల ద‌గ్గర నుండి డ‌బ్బులు వ‌సులు చేసి ఆ డ‌బ్బుల‌తో భూముల‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్ వెల్లడించారు. న‌గ‌రానికి చెందిన‌ యార్లగడ్డ రఘు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అధిక వడ్డీ ఇస్తానంటూ ప‌లువురిని న‌మ్మించి మోసం చేశారని సజ్జనార్‌ తెలిపారు. సుమారు మూడు వేల మంది మోసపోయినట్లు విచారణలో తేలిందన్నారు. ఇప్పటి వరకు 156 కోట్ల రూపాయల స్కాం జరిగిందని తెలిపారు. ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేసి మోసం చేశారని సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు. (చదవండి : మాదాపూర్‌లో భారీ మోసం)

sajjanar1.jpg

 

న‌గ‌రానికి చెందిన‌ యార్లగడ్డ రఘు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అధిక వడ్డీ ఇస్తానంటూ ప‌లువురిని న‌మ్మించాడు. ఆ త‌ర్వాత వారి ద‌గ్గ‌ర‌ నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అత‌ని మాటలు న‌మ్మిన అనేక‌మంది పెద్ద మొత్తంలో ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఇదంతా మోస‌మ‌ని గ్ర‌హించిన ఓ బాధితుడు మాదాపూర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయడంతో కుంభకోణం బయటపడింది. ఈ స్కామ్‌లో ఏజెంట్ల పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

3 స్కీములతో 156 కోట్లు స్వాహా

 

  • 1,456 మందిని ముంచిన మోసగాడు 
  • స్వధాత్రి ఇన్‌ ఫ్రా పేరుతో దందాలు
  • ఆటకట్టించిన సైబరాబాద్‌ పోలీసులు

 

హైదరాబాద్‌ సిటీ, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 1,456 మందిని మోసం చేసి, రూ.156 కోట్లు కొల్లగొట్టాడు ఓ కేటుగాడు. సైబరాబాద్‌ పోలీసులు అతడి ఆటకట్టించి అరెస్టు చేశారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. విజయవాడకు చెందిన యార్లగడ్డ రఘుబాబు అతి తక్కువ సమయంలో రూ.వందల కోట్లు సంపాదించాలని పథకం వేశాడు. హైదరాబాద్‌కు మకాం మార్చి మూడు స్కీములను రూపొందించాడు. వాటి కోసం మూడు కార్యాలయాలు తెరిచాడు. 30 మంది ఏజెంట్లు, 20 మంది టెలీ కాలర్స్‌ను నియమించి దందా మొదలుపెట్టాడు. స్వధాత్రి ఇన్‌ఫ్రా పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించి.. రూ.లక్ష, అంతకు మించి పెట్టుబడి పెట్టిన వారికి నెలకు 9శాతం వడ్డీ చెల్లిస్తామంటూ నమ్మించాడు. దీనిపై తన ఏజెంట్లు, టెలీకాలర్లతో ప్రచారం చేయించాడు. అలా 950 మంది నుంచి రూ. 87 కోట్లు కొల్లగొట్టాడు. బై బ్యాక్‌ స్కీమ్‌ పేరుతో మరో మోసానికి తెరతీశాడు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్స్‌ వద్ద తక్కువ ధరకు ఎక్కువ మొత్తంలో ప్లాట్స్‌ను స్వధాత్రి ఇన్‌ఫ్రా ప్రాజెక్టు కంపెనీ పేరుతో కొనుగోలు చేయడం లేదా సేల్‌ అగ్రిమెంట్‌ చేసుకునేవాడు. వాటిని అమ్మకానికి పెట్టేవాడు. 

 

వాయిదాల్లో డబ్బు చెల్లించే సదుపాయం ఉందని, ఆ నగదుకు ప్రతి నెల 4-10 శాతం వడ్డీ ఇస్తానని నమ్మించేవాడు. పూర్తి డబ్బులు చెల్లించిన తర్వాత ఎవరు కొనుగోలు చేసిన ప్లాటు వారికే ఇచ్చేస్తానని నమ్మబలికేవాడు. అలా 300 మంది నుంచి రూ.42కోట్లు కొల్లగొట్టాడు. స్వధాత్రి ఫ్లాట్స్‌ బంపర్‌ ఆఫర్‌ పేరుతో మూడో స్కీమ్‌కు తెరతీశాడు యార్లగడ్డ రెసిడెన్షియల్‌ ఫ్లాట్స్‌ బిల్డర్స్‌తో ముందుగా కొన్ని ఫ్లాట్స్‌ కొనుగోలు చేస్తున్నట్లు ఒప్పందం చేసుకునేవాడు. 40 శాతం డబ్బులు చెల్లించేవాడు. తర్వాత వాటిని ఇతరులకు అమ్మేసేవాడు. జీఎస్టీ లేకుండానే ఫ్రీ రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని ఆఫర్‌ ఇచ్చేవాడు. ఫ్లాట్‌ కోసం 70 శాతం డబ్బులు చెల్లించిన వారికి ఫ్లాట్‌ చేతికందేవరకు ఇంటి అద్దె కింద నెలకు రూ. 10వేలు చెల్లిస్తానని బంపర్‌ ఆఫర్‌లో పేర్కొన్నాడు. ఇలా 200 మంది నుంచి రూ.27 కోట్లు కొల్లగొట్టాడు. ముచ్చటగా మూడు స్కీములు పెట్టి 1,456 మందిని ముంచేసి మొత్తం రూ.156 కోట్లు కొల్లగొట్టాడు. ప్రతి నెల అందాల్సిన డబ్బులు రాకపోవడంతో బాధితులు మాదాపూర్‌ పోలీసులను ఆశ్రయించారు. దాంతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సీపీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు మాదాపూర్‌, ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌(ఈవోడబ్ల్యూ) పోలీసులు రంగంలోకి దిగారు. రఘుబాబుకు సహకరించి, వెన్నంటి ప్రోత్సహించింది శ్రీనివాసబాబుగా గుర్తించారు. వారిద్దరినీ అరెస్టు చేశారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...