Jump to content

Ninna test chesina cases lo inko 2672 cases ni approve cheyyalsi undhata


Paidithalli

Recommended Posts

150 people tho birthday party anta. Iche vaadiki leka poyina, vache vallaki ina vundali buddi. Asymptomatic vallu matladina kooda spread avuthundi ani entha mothukunna public not caring. 

పుట్టిన రోజు వేడుకపై కరోనా పండుగ

హాజరైన ప్రజాప్రతినిధి..

జ్యువెలర్స్‌ సంఘం ప్రతినిధులు

వైరస్‌ సోకడంతో మరణించిన

ఆహ్వానితుడు, మరో వ్యాపారి

పుట్టిన రోజు వేడుకపై కరోనా పండుగ

ఈనాడు, హైదరాబాద్‌: తన జన్మదిన వేడుకకు బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించిన ఓ బంగారు, వజ్రాభరణాల వ్యాపారి కుటుంబంలో విషాదం అలుముకుంది. పుట్టిన రోజు పండుగ జరుపుకొన్న ఆ వ్యాపారి కొద్దిరోజులకు కొవిడ్‌-19 లక్షణాలతో చనిపోగా.. మరో వ్యాపారి కూడా మృతి చెందాడు. వేడుకకు హాజరైన వారిలో 20 మందికి కరోనా సోకింది. ఓ ప్రజాప్రతినిధికి సైతం పాజిటివ్‌ అని తేలింది. వ్యాపారి కరోనాతో చనిపోయినట్టు ఆయన కుటుంబసభ్యులు ప్రభుత్వ అధికారులకు తెలిపినా.. పుట్టినరోజు వేడుక విషయాన్ని గోప్యంగా ఉంచారు. తాజాగా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి పాజిటివ్‌ వచ్చినా పోలీసులు, జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖ అధికారులు వివరాలను తెలుసుకోలేదు.

 

హిమాయత్‌నగర్‌లో నివాసముంటున్న ఈ బంగారు, వజ్రాభరణాల వ్యాపారి గతనెల మూడోవారంలో తన పుట్టినరోజు వేడుకను ఇంట్లోనే జరుపుకొన్నారు. ఓ ప్రజాప్రతినిధి, నగరంలోని జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మొత్తం 150 మంది పాల్గొన్నారు. సామూహికంగా విందు భోజనం చేశారు. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం... విందుకు వినియోగించిన పాత్రలు, ఆహార పదార్థాలతో సహా అన్నీ శుభ్రం చేశాం. సమావేశపు గది ముందుగానే శానిటైజ్‌ చేశాం.. కరోనా మనందరికి రాదులే అంటూ ఆతిథ్యమిచ్చిన వ్యాపారి వారందరితో అన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ గుర్తుగా బహుమతులను ఇచ్చారు.

తేరుకునేలోపు మృత్యువాత..

జన్మదిన కార్యక్రమం పూర్తైన మూడురోజులకు వజ్రాభరణాల వ్యాపారికి దగ్గు, ఆయాసం వచ్చింది. వైద్యులకు చూపించుకునేందుకు మాసాబ్‌ట్యాంక్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి వచ్చాడు. వైద్యులు పరిశీలించి మందులివ్వడంతోపాటు ఎందుకైనా మంచిది.. కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోండి అని సూచించారు. ఇది సాధారణ దగ్గు, ఆయాసమే కదా అనుకుని ఆయన పట్టించుకోలేదు. ఇక విందుకు హాజరైన జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ కీలక ప్రతినిధికి నాలుగు రోజులయ్యాక తీవ్ర జ్వరం వచ్చింది. మాత్రలు వేసుకుందాం తగ్గుతుందిలే అనుకుని వదిలేశారు.. వారం క్రితం జ్వరం తిరగబెట్టడంతో ఆయన కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌12లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. కొవిడ్‌-19 నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌ వచ్చింది. చికిత్స పొందుతూ మూడురోజుల క్రితం చనిపోయాడు. మరోవైపు పుట్టినరోజు జరుపుకొన్న వ్యాపారికి దగ్గు, ఆయాసంతో పాటు జ్వరం రావడంతో ఐదురోజుల క్రితం సికింద్రాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మూడురోజుల క్రితం మృతి చెందాడు. జీహెచ్‌ంఎసీ, పోలీస్‌, వైద్యాధికారులు ఆ వేడుకల్లో పాల్గొన్నవారి వివరాలు సేకరిస్తే.. కొందరినైనా వైరస్‌ బారినుంచి కాపాడే అవకాశాలున్నాయి.

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

china kits use chestunara endi ?

aflath mein gaflath ante ide...

China kits konadam ndhuku master malla doubt padatam why 

Link to comment
Share on other sites

evado enduku...maa family lo ne recent ga oka marriage settle ayindi...

Groom's family well settled, and selected for UPSC...Girl's dad is richie rich...megha engineering la government ki advisor...

august mid lo wedding...valla farm house la 1000 mandiki plan..kurnool degara val native, akada 2 days party..

iga emi chepali vaya vellaki ? ie planning antha last 10 days lo finalise chesinaru..

itlanti budhi leni panulu chesukunta, testing chesi emi labham ?

Link to comment
Share on other sites

4 minutes ago, Android_Halwa said:

evado enduku...maa family lo ne recent ga oka marriage settle ayindi...

Groom's family well settled, and selected for UPSC...Girl's dad is richie rich...megha engineering la government ki advisor...

august mid lo wedding...cyber convention la 1000 mandiki plan..kurnool degara val native, akada 2 days party..JRC la reception..

iga emi chepali vaya vellaki ? ie planning antha last 10 days lo finalise chesinaru..

itlanti budhi leni panulu chesukunta, testing chesi emi labham ?

Inform to police. They will talk sense into them. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...