Jump to content

అద్దె ఇల్లు ఖాళీ.. సామాను గోడౌన్లో


snoww

Recommended Posts

07152020024117n9.jpg

 

  • కరోనా వలస జీవుల తరుణోపాయం
  • కరోనా తగ్గితే మళ్లీ తీసుకురావడం ఓ ప్రయాస
  • నెలకు గోదాం అద్దె 5 వేల నుంచి 10 వేలు
  • హైదరాబాద్‌లో ఇది నయా ట్రెండ్‌ 
  • గోదాంల బిజినె్‌సలోకి మారుతున్న ప్యాకర్స్‌
  • రాజధానిలో ఎక్కడికక్కడ వెలుస్తున్న గోడౌన్లు 
  • అద్దె ఇళ్లు ఖాళీ.. కిరాయి తగ్గించినా అడిగేవారేరి? 
  •  

 

ఇల్లు ఖాళీ చేస్తే ఎవరైనా పెట్టే బేడా సర్దుకొని పోతారు అవునా? హైదరాబాద్‌లో ఇళ్లను ఖాళీ చేస్తున్నవారు మాత్రం పెట్టే బేడా ఇక్కడే  పెట్టేసి వారే ఊర్లకు వెళుతున్నారు. వేలల్లో కిరాయి వెచ్చించి ఇంటి సామానంతా పట్నంలో ఎక్కడో ఓ చోట ఉన్న గోదాముల్లో పెడుతున్నారు. కరోనా వైరస్‌ ఉధృతి తగ్గి.. ఊరి నుంచి సామానంతా మళ్లీ తీసుకురావడమనే తలనొప్పి ఎందుకనే ఆలోచనతోనే!! 

 

హైదరాబాద్‌ సిటీ, జూలై 14 (ఆంధ్రజ్యోతి): టు లెట్‌ బోర్డు! హైదరాబాద్‌ వీధుల్లో ఇప్పుడు ఎక్కడ.. ఏ గల్లీలో చూసినా ‘ఇల్లు అద్దెకు ఇవ్వబడును’ అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి!! అద్దెలు తగ్గించినా ఇళ్లు అడిగే వారే కరువయ్యారు. కరోనా  కేసులు పెరుగుతుండటంతో ఎక్కడ తమకు వైరస్‌ సోకుతుందోననే భయంతో కుటుంబంతో కలిసి అంతా పల్లెబాట పట్టడంంతో ఈ పరిస్థితి నెలకొంది. పోటీ పరీక్షలకు కోచింగ్‌ సెంటర్లు నిర్వహించే అవకాశం కూడా ఇప్పట్లో లేకపోవడంతో వాటిని నిర్వహించే పెద్ద పెద్ద భవనాలు, విద్యార్థులు ఉండే హస్టల్‌ భవనాలు కూడా ఖాళీ అవుతున్నాయి. విద్య, వ్యాపార కేంద్రాలుగా ఉన్న అమీర్‌పేట, సంజీవరెడ్డినగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో  ఇప్పుడెక్కడ చూసినా టు లెట్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. నగర శివార్లలోనూ ఇల్లు ఖాళీ చేసి వెళుతున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. కొత్తగా హైదరాబాద్‌ నగరానికి ఉపాధి నిమిత్తం వచ్చే వారి సంఖ్య పడిపోయింది అయితే ఇళ్లు ఖాళీ చేస్తున్నవారిలో  చాలామంది తమ సామగ్రిని నగరంలో అందుబాటులో  ఉన్న గోదాముల్లో భద్రపరుస్తున్నారు. ఒకవేళ సామానంతా ఊరికి తీసుకెళితే.. వైరస్‌ అదుపులోకి వచ్చినప్పుడు మళ్లీ తీసుకురావడం ప్రయాసతో  కూడుకున్నదని భావించి ఇలా చేస్తున్నారు. ఓ మూడు  నాలుగు నెలలైనా గోదాములకు అద్దె చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. ఆ మేరకు కొందరు ప్యాకింగ్‌ రంగంలో అనుభవం ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఖాళీ చేసిన అద్దె ఇంటి  సామగ్రిని నగరంలోనే ఎన్ని నెలలైనా భద్రపరుచుకునే లా గోదామలను ప్యాకర్స్‌ సిద్ధం చేశారు.  ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు మళ్లీ తిరిగి రావాల్సి ఉండటంతో అలాంటి వారంతా తమ సామగ్రిని ఇక్కడే ఉంచి వెళుతున్నారని ప్యాకర్స్‌ సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. కరోనా ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితుల్లో ఇల్లను ఖాళీ చేసినా, సామగ్రిని ఇక్కడే పెట్టుకొని వెళ్లే వెలుసుబాటు నగరంలో అందుబాటులోకి రావడం కొత్త ట్రెండ్‌గా చెబుతున్నారు.  

 

సామగ్రిని తరలించే వాహనాలే ఎక్కువ

ఖాళీ చేస్తున్న కొందరు సామగ్రిని తమతో పాటే తీసుకెళుతున్నారు. దీంతో సరుకు రవాణా  చేసే వాహనాలకు గిరాకీ పెరిగింది. ముఖ్యంగా విజయవాడ హై వే, వరంగల్‌ హై వే, బెంగళూరు, సాగర్‌ హైవేల్లో ఎక్కువ వాహనాలు ఇళ్లు ఖాళీచేసి తీసుకున్న సామగ్రితోనే  కనిపిస్తున్నాయని విద్యానగర్‌కు చెందిన  ట్రాన్స్‌పోర్ట్‌ వెహికిల్స్‌  వ్యాపారం నడిపే అన్వర్‌ తెలిపారు. 

 

వాచ్‌మన్‌లూ పోతున్నరు.. 

నగరంలో పలు అపార్టుమెంట్లలో వాచ్‌మన్‌లుగా ప నిచేస్తున్న వారు  తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. ఉపాధి పరంగా పనులు దొరుకుతున్నా,  కరోనా తమకు వ్యాప్తిస్తుందేమోనన్న భయంతో కుటుంబాలతో కలిసి తరలుతున్నారు.  ఇక జోరుగా సాగే ఫుట్‌పాత్‌ వ్యాపారాలు మందగించాయి. చాట్‌ భండార్‌, టిఫిన్‌ సెంటర్లు, ఐస్‌ క్రీమ్‌ బండ్లు తదితర చిరు వ్యా పారాలు చేసుకునే వేలమందికి ఉపాధి కరువైంది. ఈ తరహా వారిలో చాలామంది స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. 

 

ఇళ్లు ఖాళీ చేసే గిరాకీలే ఎక్కువ 

ఎన్నో ఏళ్ల నుంచి డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నా. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందెప్పుడూ చూడలేదు. లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత నుంచి మాకు వస్తున్న గిరాకుల్లో ఇళ్లు ఖాళీ చేసేవే ఎక్కువగా వస్తున్నాయి. నెలలో 10 నుంచి 20వరకు ఉండటంం ఆశ్చర్యం కలిగిస్తోంది.   

- జిల్లా రమేశ్‌, డీసీఎం డ్రైవర్‌, ఇందిరాపార్కు.

 

రెండోసారి ఊరికి వచ్చా

లాక్‌డౌన్‌ సమయంలో 2 నెలల పాటు ఊళ్లో ఉండే వర్క్‌ ఫ్రమ్‌ హోం చేశా. లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత నగరానికి తిరిగొచ్చాను. నగరంలోనూ కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో మళ్లీ ఊరికి వెళ్లిపోయాను. నగరంలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో ఇతర జిల్లాల వారు, ఏపీకి చెందిన వారు, ఇతర రాష్ట్రాల వారే ఎక్కువ. వారంతా ఇప్పు డు  నగరాన్ని విడిచి తమ స్వస్థలాల నుంచే పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. 

- విజేందర్‌ రెడ్డి, ఐటీ ఉద్యోగి

Link to comment
Share on other sites

ఎంతో అనుకున్నాం. కొంచెం కష్టమైనా వడ్డీకి అప్పులు తెచ్చి మరీ ఈ తరానికి సరిపడినట్లుగా దుకాణం పెట్టాం. కానీ పెట్టి ఆరు నెలలు పూర్తికాలేదు. కరోనా వచ్చి మొత్తంగా దెబ్బకొట్టింది. నిండా మునిగిపోయాం.

- ఆరు నెలల క్రితం ఏలూరులో రెడీమేడ్‌ వస్త్ర దుకాణం పెట్టిన వెంకటేశ్‌

 

విజయవాడ కరెన్సీనగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద టు-లెట్‌ బోర్డులు

కొన్నినెలలుగా స్తంభించిపోయిన వ్యాపార లావాదేవీలు

ప్రధాన వ్యాపార కూడళ్లలో ఖాళీలు

షాపింగ్‌ మాల్స్‌కు భారీ దెబ్బ

కోచింగ్‌ సెంటర్లు, హాస్టళ్లూ మూత

చేసేపని పోయి సొంతూళ్లకు వలస

కర్నూలులోనే 1.2 లక్షల మందికిపైగా

రాజధాని స్తబ్ధతతో బెజవాడ కుదేలు

అద్దె ఇళ్లు, షాపులకు కరోనా దెబ్బ

ఎటు చూసినా  టు లెట్‌!

 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాజధాని స్తబ్ధతతో బెజవాడ, గుంటూరులో బహుళ వ్యాపారాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. కొవిడ్‌తో ఇప్పుడు  దెబ్బ మీద మరో పెనుదెబ్బ పడింది! విశాఖపట్నం ద్వారకానగర్‌లో ఇల్లో, షాపో అద్దెకు దొరకడమంటే పెద్దపులిని కొట్టడమే! అంత రద్దీ, డిమాండ్‌ ఉండే ప్రాంతంలో కాంప్లెక్సులూ, అపార్టుమెంట్ల ముందు దిష్టిబొమ్మల్లా ‘టు-లెట్‌’ బోర్డులు వేలాడుతున్నాయి! కర్నూలు జిల్లాలోని దాదాపు 50 పైగా హాస్టళ్లలో సుమారు 40 వేలమంది చిన్న చిన్న పనులు చేసుకొనేవారు, చిరుద్యోగులు ఉంటున్నారు. ఈ హాస్టళ్లను చాలావరకు మూసివేస్తున్నారు. హాస్టల్‌ అసోసియేషన్‌ సభ్యులు ఇటీవల కలెక్టర్‌ వీరపాండియన్‌ను కలిసి తమను ఆదుకోవాలని అభ్యర్థించారు. బాడుగలు చెల్లించలేకో, చేసే పనులు పోవడం వల్లనో నంద్యాల, ఆదోని తదితర పట్టణాల్లో దాదాపు 1.2 లక్షలమంది అద్దె నివాసాలు వదిలిపెట్టారు. ఇక.. విద్యార్థులు, ఉద్యోగులు తదితర వర్గాల్లో లక్ష మందికి పైగా ఈ పట్టణాలను ఖాళీ చేశారు.

జూలై వచ్చిందంటే బడుల సందడి ఊపందుకొనే సమయం! నైరుతి వర్షాలతో నేల పదునెక్కే కాలం! అటు పిల్లల తల్లిదండ్రులూ, ఇటు సాగు ఉపకరణాలను రైతులకు విక్రయించే వ్యాపారులూ, ఫైనాన్షియర్లూ.. అందరూ ఇళ్ల కోసమూ, కాంప్లెక్స్‌ల్లో షాపుల కోసమూ గాలించే సమయమిది! అయితే, ఈసారి ఈ- చదువులు, నయా రుతువుపాటు కరోనాను కూడా కాలం వెంట పెట్టుకొని వచ్చింది. దీంతో బడులు బంద్‌! వ్యాపారాలు కుదేల్‌! రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌! హోటళ్లు మూత! హాస్టళ్లు ఖాళీ! సబ్బతి వెంకటేశ్వర్లు కర్నూలు నగరంలోని ప్రైవేట్‌ విద్యా సంస్థలో ఉపాధ్యాయుడు. కొవిడ్‌ ఆయన పనిచేసే బడిని మూయించేసింది. నాలుగు నెలలుగా జీతం లేదు. ఇంటి అద్దెకు డబ్బుల్లేవు. ఇంట్లో నిత్యావసర సరుకులు లేవు. మరోవైపు ఎప్పటికి బడిముఖం చూస్తారో తెలియని అనిశ్చితి! చివరకు ఒక నిర్ణయానికి వచ్చిన వెంకటేశ్వర్లు.. కుటుంబాన్ని తీసుకొని సొంత గ్రామం గోస్పాడు మండలం సాంబవరం గ్రామానికి వెళ్లిపోయారు. నెల్లూరు జిల్లా సోమశిలకు చెందిన జంజనం వెంకట్‌ మెడికల్‌ రంగంలో చిరు వ్యాపారి. నెల్లూరు సిటీలోని పొదలకూరురోడ్డు వద్ద అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. కరోనా దెబ్బకు ఆసుపత్రులన్నీ మూతపడటంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అద్దె ఇల్లు ఖాళీ చేసి తిరిగి సోమశిల చేరుకొన్నాడు. పరిస్థితులు తిరిగి బాగుపడకపోతాయా అనే ఆశతో ఎదురుచూస్తున్నాడు. 

ఎక్కడెక్కడి నుంచో వచ్చి.. 

అనంతపురం నగరంలోని ప్రధాన రహదారి సుభా్‌షరోడ్డులో  కిరణ్‌కుమార్‌ గత కొన్నేళ్లుగా కిడ్స్‌వేర్‌ షాపును నిర్వహిస్తున్నారు. కడప జిల్లా నుంచి వచ్చిన ఈయన వ్యాపారంలో బాగా నిలదొక్కుకున్నారు. కానీ, అంతటి వ్యాపారినీ కరోనా కంగు తినిపించింది. కొవిడ్‌ కేసులు రావడం మొదలయ్యేనాటికి దుకాణంలో రూ. 8 లక్షల సరుకు ఉంది. దీనికి తోడు ఎవరైతే సరుకు దుకాణానికి అప్పుగా ఇచ్చారో....వారి నుంచి ఒత్తిడి రావడం మొదలయింది. మరోవైపు అద్దె భారం భరించలేకపోయాడు. చేసేది లేక మే ఆఖరులో దుకాణాన్ని ఖాళీ చేసి.. సొంత జిల్లా వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ షాప్‌ ముందు ‘టులెట్‌’ బోర్డు వేలాడుతోంది. కడప నగరంలోని బాలాజీనగర్‌లో ఓ వ్యక్తి మెస్‌ నడుపుతున్నాడు. ఆయన ఎప్పుడో విజయనగరం నుంచి వచ్చేశాడు. 60 మంది దాకా ఆ మెస్‌లో ఉండేవారు. కర్నూలు జిల్లా నుంచి 15 మంది అక్కడే చుట్టుపక్కల పరిసరాల్లో దుప్పట్లు విక్రయించేవారు. కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతినడంతో వారంతా స్వగ్రామాలకు వెళ్లారు. ఇప్పుడు బ్యాంకుల్లో పనిచేసే వారు 8 మంది మాత్రమే ఉన్నారు. లాక్‌డౌన్‌ సడలించినప్పటికీ భవన నిర్మాణ పనులు ఊపందుకోలేదు. దీంతో కర్నూలు జిల్లాలోని పత్తికొండ, డోన్‌, గుత్తి, ఆదోని ప్రాంతాల నుంచి కడపకు వలస వచ్చిన పదివేల మంది భవన నిర్మాణ కార్మికులు అద్దె ఇళ్లు ఖాళీ చేసి వెనుదిరిగారు. నెల్లూరు జిల్లా మూలపేట ప్రాంతంలో పది మంది కార్పెంటర్‌ వర్కు చేసే కూలీలు ఉండేవారు. వీరంతా యూపీ నుంచి వచ్చి.. స్తోమత మేరకు అద్దె ఇళ్లలో ఉండేవారు. చోటు అనే కాంట్రాక్టర్‌ వద్ద కొన్ని నెలలుగా పని చేస్తున్నారు. కరోనా వైరస్‌ అలజడితో భయపడిపోయి.. సొంతూళ్లకు వెళ్లిపోయారు. 

 

కాలనీలకు కాలనీలే ఖాళీ

బ్యాంక్‌ ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచీ వచ్చే అభ్యర్థులతో కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎన్‌జీవోస్‌ కాలనీ నిత్యం కిటకిటలాడుతుండేది. కొవిడ్‌ రాష్ట్రంలోకి చొరబడేనాటికి ఈ సెంటరులో 20 వేల మంది శిక్షణ తీసుకొంటున్నారు. అక్కడికి సమీపంలోని ఎన్జీవో కాలనీ సహా పలు కాలనీల్లో గదులను అద్దెకు తీసుకొని కొందరు.. మెస్‌ హాస్టళ్లలో మరికొందరు ఉండేవారు. అద్దెలను దృష్టిలో ఉంచుకొని కొందరు మంచి హంగులతో భవనాలను నిర్మించుకొన్నారు కూడా! ఇప్పుడు దాదాపు విద్యార్థులంతా ఎలాగో తిప్పలు పడుతూ, తమ స్వస్థలాలకు తరలి వెళ్లారు. వారు ఖాళీ చేసిన వందలాది ఇళ్ల ముందు ఇప్పుడు టు-లెట్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీఎస్సీ శిక్షణకు కేరాఫ్‌ అడ్ర్‌సగా ఉండే అవనిగడ్డకు కోచింగ్‌ కోసం బయట ప్రాంతాలు, రాష్ట్రాల నుంచీ తరలివస్తుంటారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని సాంబశివరావు అనే  వ్యక్తి తన షాపు మీద మూడు గదులు నిర్మించి.. అద్దెలకు ఇచ్చాడు. రూ. ఆరు వేలు చొప్పున మొత్తం రూ. 18 వేలు ఆదాయం వచ్చేది. కరోనా ప్రభావంతో ఇప్పుడు అవనిగడ్డలో ఎలాంటి శిక్షణా తరగతులు నిర్వహించడం లేదు. ఈ గదుల్లో ఉన్న ముగ్గురు యువకులు మార్చి 20వ తేదీన ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మూడు గదులు ఖాళీగానే ఉన్నాయి. 

 

ఐస్‌ పార్లర్‌కు జలుబు..

విజయనగరం పట్టణంలోని తోటపాలెం.. పేరుకు తగినట్టే చదువులకు తోట. ఈ పరిసరాల్లో ఓ వ్యాపారి ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకుని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌, ఆ తరువాత అందులోనే ఐస్‌ పార్లర్‌ తెరిచాడు. విద్యార్థులు వచ్చి పోయే మార్గంలోనే ఆయన దుకాణం వ్యాపారం పెద్దఎత్తున సాగేది. దీనివల్ల అద్దె భారీగా చెల్లించాల్సి వచ్చినా ఇబ్బంది పడేవాడు కాదు. కరోనా ప్రభావంతో మార్చి నుంచి విద్యా సంస్థలన్నీ మూత పడ్డాయి. విద్యార్థుల రాకపోకలు నిలిచిపోయాయి. అద్దె చెల్లించేందుకు కూడా ఇబ్బంది రావడంతో ఇటీవలే దుకాణం ఖాళీ చేశాడు. అనంతపురం సిటీలోని రాజురోడ్డులో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వహిస్తున్న రాజు, లాక్‌డౌన్‌తో రవాణా మందగించడంతో నెల రోజుల క్రితమే దుకాణాన్ని ఖాళీ చేశాడు. 

 

‘కాల్‌’ కట్‌ అయింది..

నూర్‌ అహ్మద్‌కు విజయవాడ రామలింగేశ్వరనగర్‌లో రెండంతస్తుల భవనం ఉంది. కింది అంతస్తులో ఆయన కుటుంబం ఉంటే, రెండో అంతస్తును ప్రైవేటు ఉద్యోగులైన బ్యాచిలర్స్‌కు అద్దెకు ఇచ్చారు. దీని ద్వారా ఆయనకు నెలకు రూ.10 వేలు అద్దె వచ్చేది. ఇందులో మొత్తం ఐదుగురు బ్యాచిలర్స్‌ ఉండేవారు. వాళ్లంతా కాల్‌ సెంటర్‌లో పనిచేసేవారు. రాత్రంతా పనిచేసి ఉదయం ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకునేవారు. లాక్‌డౌన్‌ ప్రభావంతో ఈ ఐదుగురి ఉద్యోగాలను కాల్‌సెంటర్‌ ఒకేసారి తీసేసింది. మార్చి వరకు అద్దెను చెల్లించిన వారికి.. ఆ తర్వాత కష్టంగా మారింది. ఎక్కడా ఎలాంటి కొలువులు దొరకలేదు. ఇక అద్దెను చెల్లించడం తమవల్ల కాదని తెలిసి మే నెలాఖరులో సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. పరిస్థితిని యజమానికి వివరించి, అద్దె చెల్లించలేమని బతిమాలుకున్నారు. చేసేది లేక నూర్‌ అహ్మద్‌ మూడు నెలల అద్దెను వదులుకున్నారు.

 

ఎంత తేడా...!

రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు వలస వచ్చిన వారికి ఇల్లు దొరకడం కష్టంగా ఉండేది. ఎన్నో వీధులు కాళ్లరిగేలా తిరిగితేగానీ ఇల్లు అద్దెకు దొరికేది కాదు. ఇప్పుడు ఒకే వీధిలో రెండు, మూడు టు-లెట్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కళకళలాడిన వాణిజ్య సముదాయాలు ఇప్పుడు కళావిహీనంగా మారిపోయాయి. విజయవాడ నగరంలో ఏలూరు రోడ్డు, మహాత్మాగాంధీ రోడ్డు, వన్‌టౌన్‌ ప్రాంతాలు వాణిజ్య సముదాయాలకు నిలయాలు. ఇక్కడ నిత్యం కోట్లలో వ్యాపారాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ప్రఽధాన రహదారులు అయిన ఎంజీ రోడ్డు, ఏలూరు రోడ్డులో వందలాదిగా వాణిజ్య సముదాయాలు బహుళ అంతస్తుల్లో ఉన్నాయి. ఒక్కో దాంట్లో రెండు, మూడు టూ లెట్‌ బోర్డులు వేలాడుతున్నాయి. 

 

సిటీ ఆఫీసు ఖాళీ చేసేశాం...

‘‘మా కంపెనీ ప్రధాన కార్యాలయం రుషికొండ ఐటీ పార్కులో ఉంది. మహిళా ఉద్యోగులకు అనువుగా ఉంటుందని సిరిపురం జంక్షన్‌లో 1,900 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ కార్యాలయాన్ని దశాబ్దకాలంగా  నడుపుతున్నాం. కరోనా నేపథ్యంలో దాదాపు 80శాతం మంది ఇంటి దగ్గర నుంచే పనిచేస్తున్నారు. కానీ కార్యాలయానికి నెలకు రూ.88 వేల అద్దె, విద్యుత్‌ బిల్లుకు మరో రూ.25 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇప్పట్లో పరిస్థితులు మెరుగుపడే అవకాశం లేకపోవడంతో కార్యాలయాన్ని ఖాళీ చేసేశాం. దీని వల్ల నెలకు రూ.1.13 లక్షల ఖర్చు తగ్గింది’’

- ఓ.నరేశ్‌కుమార్‌, సీఈవో, సింబయోసిస్‌ టెక్నాలజీస్‌, విశాఖ సిటీ..

 

పైకి చెప్పలేం.. ఇంటికి వెళ్లలేం..

వెంకటేశ్‌ యువకుడు. అనేక కలలు, ప్రయోగాత్మక ఆలోచనలతో ఉత్సాహంగా వస్త్ర వ్యాపారంలోకి వచ్చాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆరు నెలల క్రితం రెడీమేడ్‌ దుస్తుల దుకాణం తెరిచాడు. ఆ తరువాత రెండు నెలలకే కరోనా దెబ్బ గట్టిగా పడింది. ‘‘ఎంతో అనుకున్నాం. కొంచెం కష్టమైనా వడ్డీకి అప్పులు తెచ్చి మరీ ఈ తరానికి సరిపడినట్లుగా దుకాణం పెట్టాం. కానీ పెట్టి ఆరు నెలలు పూర్తికాలేదు. కరోనా వచ్చి మొత్తంగా దెబ్బకొట్టింది. నిండా మునిగిపోయాం. ఇంటిల్లిపాదిని ఆదుకుందామనుకుంటే ఇప్పుడు ఈ దెబ్బతో నేనే అప్పులపాలయ్యాను. పైకి చెప్పుకోలేక. సొంతింటికి వెళ్లలేక ఊళ్లోనే కాలక్షేపం చేస్తున్నా’’నని వెంకటేశ్‌ వాపోయాడు. ఏలూరులో దాదాపు 130కుపైగా వివిధరకాల దుకాణాలు మూతపడ్డాయి.

తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, పాలకొల్లుల్లోనూ చాలా షాపుల ముందు ‘టూ-లెట్‌’ బోర్డులు ఎక్కిరిస్తున్నాయి. ఇక..విజయవాడ వన్‌టౌన్‌లోని కృష్ణవేణి కాంప్లెక్స్‌ వస్త్ర వ్యాపారానికి కేంద్ర బిందువు. వస్త్రవ్యాపారులంతా ఒక సంఘంగా ఏర్పడి దీన్ని నిర్మించుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇక్కడ రెండంతస్తులో మొత్తం 370 దుకాణాలు ఉన్నాయి. ఇందులో కింది అంతస్తులో ఉన్న షాపునకు నెలకు రూ.15 - 18వేల వరకు అద్దె ఉంటుంది. పైఅంతస్తులో ఉన్న షాపులకు రూ.10 - 12వేలు అద్దె ఉంటుంది. లాక్‌డౌన్‌కు ముందు ఈ కాంప్లెక్స్‌ కళకళలాడింది. ఇప్పుడు ఇందులో మొత్తం 17 షాపుల ముందు టు-లెట్‌ బోర్డులు వేలాడుతున్నాయి. 

  •  
Link to comment
Share on other sites

Same situation all over india(even around world), especially places with floating population . Maa tirupathi baaga impact ayyindhi  even more than Guntur , vijaywada , Hyderabad .

Six months lo recovery start avuthadhi , rural economy koncham already back to normal . Successful monsoon will help a lot ,  full ga tractors and bikes ki demand undhi . 

Link to comment
Share on other sites

 
 కంపెనీలకు ‘కరోనా’ కష్టాలు.. అంతస్తు దిగాల్సిందే

తడిసి మోపెడవుతున్న అద్దె ఖర్చులు ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రం హోం’ ఇచ్చి... 

పొదుపు మంత్రం పాటిస్తున్న సంస్థలు

నాలుగు ఫ్లోర్‌ల నుంచి రెండు ఫ్లోర్‌లకు... 

ఆఫీసు స్థలాన్ని కుదించుకుంటున్న వైనం తక్కువ అద్దెలున్న భవనాల్లోకి మారుతున్న కంపెనీలు 

సైబర్‌ టవర్స్‌ సమీపంలో ఉన్న ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి విదేశాల్లో ప్రధాన కార్యాలయం ఉంది. ముంబై, బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లోనూ సేవలందించేందుకు శాఖలున్నాయి. అయితే మాదాపూర్‌లో ఉన్న శాఖలో మొత్తం నాలుగు అంతస్తులలో దాదాపు 200 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌లో భాగంగా మార్చి మూడో వారం నుంచి దాదాపుగా అందరూ ఇంటి నుంచే పని చేస్తున్నారు. కేవలం ఆఫీస్‌ సర్వర్‌, ఐటీ హార్డ్‌వేర్‌, కంపెనీ సాఫ్ట్‌వేర్‌ ట్రబుల్‌ షూటింగ్‌ సిబ్బంది మాత్రమే కార్యాలయంలో ఉంటున్నారు. దీంతో నాలుగు నెలలుగా మూడు ఫ్లోర్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఉద్యోగులు కూడా సేవలకు అంతరాయం కలగనీయకుండా ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తుండటంతో ఆ కంపెనీ పై రెండు ఫ్లోర్లు ఖాళీ చేయాలని నిర్ణయించుకొని భవన యజమానికి సమాచారం అందించింది. 

-సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

గచ్చిబౌలిలోని ఓ అపార్టుమెంట్‌లో రెండు ఫ్లాట్‌ల స్థలాన్ని అద్దెకు తీసుకొని 40 మందితో ఓ స్టార్టప్‌ పనిచేస్తున్నది. లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఆ రెండు ఫ్లాట్‌లలో ఏ ఒక్కరూ పనిచేయడం లేదు. అందరూ ఇంటి నుంచే పనిచేస్తున్నారు. దీంతో ఆ స్టార్టప్‌ నిర్వాహకులు ఆ రెండు ఫ్లాట్లను ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆన్‌లైన్‌ వేదికలనే కార్యాలయంగా మార్చుకున్నారు. అప్పులేని వాడే అధిక సంపన్నుడని సామెత. ఇప్పుడు ఈ హితవునే అనుసరిస్తున్నాయి చిన్న చిన్న ఐటీ కంపెనీలు. ఓ వైరస్‌లా వచ్చి అన్ని వ్యవస్థలనూ ఛిన్నాభిన్నం చేస్తున్న కరోనాను ఎదుర్కోలేక చిన్నస్థాయి సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు కొత్త పొదుపు సూత్రాలను అవలంబిస్తున్నాయి. అటు తమ సేవలు, వ్యాపారానికి భంగం వాటిల్లకుండా ఇటు ఉద్యోగుల భద్రతకు నష్టం కలగకుండా అధిక ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. నాలుగు ఫ్లోర్లు అద్దెకు తీసుకున్న వాళ్లు రెండు ఫ్లోర్లలో మాత్రమే ఉద్యోగ సేవలను సరిపెట్టాలని యోచిస్తున్నాయి.

నిర్వహణకే 30 శాతం ఖర్చు

నగరంలో దాదాపు 1500 నుంచి 2 వేల వరకు చిన్నా పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి. దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సాధారణంగా ఐటీ కంపెనీలు ప్రతి నెలా సుమారు 30 శాతం నిధులు కార్యాలయ నిర్వహణ కోసం కేటాయిస్తాయి. ప్రస్తుత కరోనా ఆపత్కాలంలో ఖర్చులు తగ్గించుకునేందుకు హైటెక్‌సిటీ, మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, నానక్‌రాం గూడ తదితర ప్రాంతాల్లో కంపెనీలు తక్కువ అద్దెకు ఉన్న భవనాల్లోకి వెళ్లిపోతున్నాయి. తక్కువ విస్తీర్ణం గల గదుల్లోకి మారుతున్నాయి. కార్యాలయ స్థలాన్ని పొందే ప్రక్రియలో ఉన్నవారు లీజు ఒప్పందాలను రద్దు చేస్తుండగా.. ఇప్పటికే కార్యాలయ స్థలం ఉన్నవారు ఆఫీసు స్థలాన్ని విస్తరించడం అనవసరమని భావిస్తున్నారు. వర్క్‌ ఫ్రం హోం నేపథ్యంలో యాజమాన్యాలు నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. 

‘ఇంటి నుంచి పని’ పొడిగింపు..!

ఐటీ కారిడార్‌లో ఇది వరకు కార్యాలయ స్థలాలు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయేవి. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అన్ని కంపెనీల్లో దాదాపు 90 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. మూడున్నర నెలలుగా ఉన్న ఈ సదుపాయాన్ని గూగుల్‌, డెలాయిట్‌ వంటి కంపెనీలు డిసెంబర్‌ వరకు పొడిగించాయి. మరికొన్ని కంపెనీలు మూడో వంతు ఉద్యోగులతో పనిచేస్తున్నాయి.

చిన్న కంపెనీలపై ఎక్కువ ప్రభావం 

చిన్న కంపెనీలపైనే కరోనా ప్రభావం ఎక్కువ పడుతున్నది. గదుల నిర్వహణ భరించలేక తక్కువ అద్దెలున్న ప్రాంతాల్లోకి కంపెనీలు మారుతున్నాయి. దేశవ్యాప్తంగా ఐటీ రంగంపై ఇదే ప్రభావం ఉంది. ముఖ్యంగా స్టార్టప్‌లకు కొంచెం కష్టకాలమనే చెప్పాలి. కొన్ని స్టార్టప్‌లు ఇప్పటికే మూతపడ్డాయి. కొత్త కంపెనీలు తమ కార్యకలాపాల విస్తరణ తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాయి. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ ఐటీ రంగం మెరుగ్గా ఉంది. 

-ఎం. సత్యనారాయణ, టీఎఫ్‌ఎంసీ అధ్యక్షుడు

ప్రత్యామ్నాయ మార్గాలు తప్పవు

మా ఆఫీసు విస్తీర్ణం 15 వేల చదరపు అడుగులు. 200 మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో 70 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. 30 శాతం మంది ఆఫీసుకు వస్తున్నారు. కిరాయిలు తగ్గించాలని భవన యజమానులను కోరాం. అది సాధ్యం కాని పక్షంలో తక్కువ విస్తీర్ణంలో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తాం. ఇంటి వద్ద నుంచి పనిచేయడం ఉద్యోగులకు అలవాటైంది. కొంతమంది సొంతూళ్ల నుంచి జాబ్‌ చేస్తున్నారు. 

-పుస్కూరు శ్రీకాంత్‌ రావు, వైస్‌ ప్రెసిడెంట్‌, టెక్నిక్స్‌ కంపెనీ

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Self storag business ki ide correct time...

ie concept alavatu cheyisthe, ever growing business..!!! 

Ware houses businesses too as India keeps growing ecommerce. 

I see bad time times ahead for commercial real estate at premium locations

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

Ware houses businesses too as India keeps growing ecommerce. 

I see bad time times ahead for commercial real estate at premium locations

Especially for retail. 

Link to comment
Share on other sites

24 minutes ago, tom bhayya said:

only in kukatpally and LB Nagar ani @Android_Halwa cheppamannadu rest areas lo asalu no to let boards media over antha 

Ledhu uppal , mehdipatnam , dsnr, ameerpet, begamper itla city mottham to let boards eh ... chala mandhi khali chesi Urlaki pothunnaru

Link to comment
Share on other sites

Just now, snoww said:

Ware houses businesses too as India keeps growing ecommerce. 

I see bad time times ahead for commercial real estate.  

That’s true..

Actually ie warehouse business edi aithe vundo, it’s growing multi fold...I don’t know how it is else where but srisailam road la videocon go down vuntunde...ipudu adi warehouse concert chesinaru...Kothur la sick industries vunde, vaatini commercial warehouse ga, there are couple of climate controlled warehouses too operating...I know of a poultry shed which was quickly converted into a warehouse and is now a FMCG godown...Corona punyama ani vesti demand chala perigipoindi

 

Link to comment
Share on other sites

26 minutes ago, tom bhayya said:

only in kukatpally and LB Nagar ani @Android_Halwa cheppamannadu rest areas lo asalu no to let boards media over antha 

Andhrollu eda vunte ada motham Foley’s board’s ae...

2014 la poni andhrollu antha Corona dhebba ki paraar...

Link to comment
Share on other sites

34 minutes ago, Android_Halwa said:

Andhrollu eda vunte ada motham Foley’s board’s ae...

2014 la poni andhrollu antha Corona dhebba ki paraar...

Androllu thappa TG districts vallu evaru hyd lo job kosam move avvaledhu antaavu every one from city 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...