Jump to content

గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (జీఎఫ్‌ఎస్‌టీ)


snoww

Recommended Posts

పది సెకన్లకో కేసు

2 వారాల్లో 14% పెరుగుదల
కొవిడ్‌ యోధుల త్యాగం వెలకట్టలేనిది
వైద్యులతో చంద్రబాబు వెబినార్‌

పది సెకన్లకో కేసు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రతి పది సెకన్లకు ఒక కరోనా కేసు నమోదవుతోందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. రెండు వారాల్లో అత్యధికంగా 14% పెరిగిందని ఆందోళన వెలిబుచ్చారు. రికవరీలో అన్ని రాష్ట్రాల కంటే దిగువన ఉన్నామని వివరించారు. కరోనాపై పోరులో ముందుండి పనిచేస్తున్న వైద్యులతో శనివారం ఆయన జూమ్‌ యాప్‌ ద్వారా సుమారు మూడున్నర గంటలకు పైగా మాట్లాడారు. కొవిడ్‌ యోధుల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. కొన్ని రాష్ట్రాల్లో చనిపోయిన వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నారన్నారు. కరోనా నుంచి కోలుకున్నవారు.. దానిపై ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించాలని చంద్రబాబు సూచించారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో 90శాతం మంది పైగా కోలుకుంటున్నారని.. భయంతో ఉన్నవారికే ప్రాణాంతకమవుతోందని వివరించారు. కరోనాతో చనిపోయిన తర్వాత బంధువులూ దగ్గరకు రాకపోవడం, వైరస్‌ సోకినవారిని ఊళ్లలో ఉండనీయకపోవడం, మృతదేహాలను జేసీబీలతో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించడం లాంటి ఘటనలు మనసును కలచి వేస్తున్నాయన్నారు.

ప్రతి ఆదివారం కేంద్రానికి నివేదిక
గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (జీఎఫ్‌ఎస్‌టీ) ద్వారా ప్రతి ఆదివారం కేంద్రానికి నివేదిక పంపిస్తున్నామని చంద్రబాబు వివరించారు. అన్నీ తాము అంచనా వేసినట్లే జరుగుతున్నాయన్నారు. అవన్నీ ఎంతో ఉపయోగపడుతున్నాయని నీతిఆయోగ్‌ కూడా ప్రశంసించిందన్నారు. వైద్యుల నుంచి స్వీకరించే సలహాలనూ కేంద్రానికి పంపిస్తామన్నారు.

పది సెకన్లకో కేసు

80 రోజుల తర్వాతే వ్యాక్సిన్‌
దేశంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి 80 రోజులపైనే పడుతుందని చంద్రబాబు తెలిపారు. భారత్‌ బయోటెక్‌ సంస్థతో తాము మాట్లాడానన్నారు. తొలి పరీక్షలయ్యాయని.. రెండు, మూడో దశ పరీక్షలు పూర్తి చేయాలంటే ఇంకా 80 రోజుల వరకు పట్టే అవకాశం ఉందని వివరించారు.

వెబినార్‌లో వైద్యనిపుణులు వెలువరించిన అభిప్రాయాలివీ
* కరోనా పరీక్షల తర్వాత రిపోర్టు వచ్చేదాకా ఇంట్లోనే ఉండాలని విశాఖపట్నానికి చెందిన డాక్టర్‌ గోపీచంద్‌ సూచించారు. పరీక్షలో నెగెటివ్‌ వచ్చినా.. మరో మూడు రోజులు వేచి చూడాలన్నారు. జ్వరం, దగ్గు ఇతర లక్షణాలున్నప్పుడు 5, 7 రోజులు మందులు వాడి తర్వాత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
* జ్వరం, ఒళ్లునొప్పులు వచ్చినా ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పారాసిటమాల్‌తో తగ్గించుకోవాలని చూస్తున్నారు.. ఇది చాలా ప్రమాదమని డాక్టర్‌ రమేశ్‌ (విజయవాడ) పేర్కొన్నారు. వైద్యులతో పరిశీలింపజేసి అత్యవసరమైన వారికి తక్షణ పరీక్షలు చేయాలన్నారు.
* కరోనాతో చనిపోయిన వారికి ఆరు మీటర్ల దూరం ఉంటే సరిపోతుందని డాక్టర్‌ హరిశ్చంద్రప్రసాద్‌ చెప్పారు. శ్మశానాలు ఊరికి దూరంగానే ఉంటాయి కాబట్టి అంత్యక్రియలపై అనుమానాలొద్దన్నారు. ఆసుపత్రి మార్చురీలో 4 డిగ్రీల చల్లదనంలో 24 గంటలు ఉంచాకే అంత్యక్రియలు చేయాలన్నారు.
* కరోనా వచ్చి కోలుకున్న చాలామందిలో యాంటీబాడీస్‌ ఆరువారాల్లోపు తగ్గిపోతున్నాయని డాక్టర్‌ వి.శ్రీకాంత్‌ (అహ్మదాబాద్‌) చెప్పారు. వీరికి కరోనా మరోసారి వచ్చే ప్రమాదం ఉంటుందని అభిప్రాయపడ్డారు. డిజిటల్‌ థర్మామీటర్‌ను కణతపై 5 సెకన్లు చూపిస్తేనే సరైన ఫలితం వస్తుందన్నారు. 8 గంటల్లోపే వచ్చే ఆర్టీపీసీఆర్‌ పరీక్షా ఫలితానికి ఏపీలో 8 రోజులు ఎందుకు తీసుకుంటున్నారో పరిశీలించాలని సూచించారు.
* ఆసుపత్రిలో పనిచేసే పారామెడికల్‌ సిబ్బందిని కొన్ని గ్రామాల్లోకి రానివ్వడం లేదని డాక్టర్‌ గన్ని భాస్కరరావు చెప్పారు. సామాజిక, పార్టీల కార్యకర్తలు ముందుకొచ్చి ప్రజలకు కొవిడ్‌ వైద్యం, సేవలపై అవగాహన కల్పించాలన్నారు.
* మూడు రోజుల వరకు జ్వరం తగ్గకుండా, దగ్గు ఉంటే సీటీ స్కాన్‌ చేయించుకోవాలని విశాఖపట్నానికి చెందిన రేడియాలజిస్ట్‌ డాక్టర్‌ సురేశ్‌ చెప్పారు.
* రెమ్‌డెసివిర్‌ లాంటి మందుల్ని వెంటిలేటర్‌ సమయంలో వాడుతున్నారని.. అలా కాకుండా ముందే ప్రారంభించాలని సీనియర్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ రాఘవేంద్రరావు సూచించారు.
* మరణించే వారిలో 2- 5 శాతం మంది భయంతోనే చనిపోతున్నారని  డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అరచేతులు, అరికాళ్లలో చెమటలు పట్టడం, పెదాలు తడారడం, గుండెదడ, తరచూ మూత్రానికి వెళ్లడం వంటి లక్షణాలుంటే తక్షణం కౌన్సెలింగ్‌ చేయాలన్నారు.
* వర్షాలతో సీజనల్‌ వ్యాధులు వచ్చాయి. ఏది కరోనా, ఏది కాదనేది తెలుసుకోవాలని సీనియర్‌ పల్మనాలజిస్టు డాక్టర్‌ గూడూరు శ్రీనివాస్‌ చెప్పారు. జ్వరం, అలసట, ఆయాసం, కండరాల నొప్పులు, చలి, విరేచనాలు, వాసన, రుచి తెలియకపోవడం తదితర లక్షణాలున్నప్పుడు కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలన్నారు.
* బహిరంగ ప్రదేశాల్లో వైరస్‌ 24 గంటల వరకు బతికుండే అవకాశం ఉందని కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్‌ రవి (రాజమహేంద్రవరం) చెప్పారు. అందువల్ల చేతులు తరచూ కడుక్కోవడం, బయటికెళ్లినప్పుడు వాల్వ్‌ లేని ఎన్‌95 మాస్క్‌ వాడకం తప్పనిసరి అన్నారు.

టెలిమెడిసిన్‌.. మెరుగైన ప్రత్యామ్నాయం
కరోనా నివారణకు టెలిహెల్త్‌ విధానాన్ని మెరుగ్గా వినియోగించుకోవాలని అమెరికాలోని న్యూజెర్సీ నుంచి మాట్లాడిన డాక్టర్‌ గోపి కోరారు. గ్రామాలు, వార్డుల్లోని సామాజిక భవనాల్ని కొవిడ్‌ క్వారంటైన్‌ కేంద్రాలుగా మార్చి.. ఆక్సిజన్‌ సౌకర్యం, నర్సును అందుబాటులో ఉంచాలని డాక్టర్‌ గురుప్రసాద్‌ సూచించారు. ఇంట్లో ఉన్న వ్యక్తికి ఆన్‌లైన్‌లో వైద్యసలహాలు, పర్యవేక్షణ అందించాలని డాక్టర్‌ వేణు సూచించారు. ‘నర్సుల్లో ఎక్కువమంది మహిళలే. వారంపాటు విధులు నిర్వహించాక మరో  వారం క్వారంటైన్‌లో ఉంటున్నారు. కుటుంబాలకు దూరమవుతున్నారు’ అని మమత ఆవేదన
వ్యక్తం చేశారు.


కరోనాతో ఉపాధి కోల్పోతే రూ.5 వేలు ఇవ్వాలి
వర్చువల్‌ నిరసనల్లో తెదేపా డిమాండ్‌

ఈనాడు, అమరావతి: కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని.. పెంచిన కరెంటు బిల్లులు, పెట్రోలు ధరలు తగ్గించాలని తెదేపా డిమాండ్‌ చేసింది. (కరోనా సమస్యల పరిష్కారానికి వైకాపా ప్రభుత్వంపై సమరభేరి’ పేరుతో తెదేపా శనివారం నాలుగో రోజూ రాష్ట్రవ్యాప్తంగా వర్చువల్‌ నిరసనలు నిర్వహించింది. 133 నియోజకవర్గాల్లో నిర్వహించిన ఆందోళనల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో అధికారులకు, మండలాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. కరోనా విధుల్లో మృతి చెందిన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తదితరులకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని.. పాత్రికేయులను కూడా కరోనా పోరాట యోధుల (ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌) జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. కరోనాతో మృతి చెందినవారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు.


5 నుంచి 14 రోజులే కీలకం

త నెల 29న జ్వరం వస్తే పరీక్ష చేయించుకున్నా. నెగెటివ్‌ వచ్చింది. 48 గంటలైనా జ్వరం తగ్గలేదు. మళ్లీ పరీక్ష చేయిస్తే పాజిటివ్‌ అని తేలింది. ఎక్కువగా జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలు వచ్చాయి. 48 గంటలపాటు 101 కంటే జ్వరం ఉంటే.. చికిత్స తీసుకోవాలి. 5 నుంచి 14 రోజులు విషమ పరిస్థితులు. ఈ సమయంలో చికిత్స అందిస్తే బయటపడతారు. 8 నుంచి 12 రోజుల మధ్య గుర్తించినవారే ఎక్కువగా చనిపోతున్నారు.

- డా.చక్రవర్తి, నెల్లూరు, కొవిడ్‌ నుంచి కోలుకున్న వ్యక్తి
 
Link to comment
Share on other sites

29 minutes ago, kothavani said:

Andaru RGV , PK movie chustu unte oka manishi matram epdu country future gurinchi alochistaru , lucky to have a leader like this

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...