Jump to content

టౌన్‌షిప్‌లు ఖాళీ!


snoww

Recommended Posts

టౌన్‌షిప్‌లు ఖాళీ!

సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన ఐటీ ఉద్యోగులు

బోసిపోతున్న అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, ఘట్‌కేసర్‌●

టౌన్‌షిప్‌లు ఖాళీ!

బోసిపోయి కనిపిస్తున్న సంస్కృతి టౌన్‌షిప్‌

నగర శివారులోని పోచారం మున్సిపాలిటీలోని సంస్కృతి టౌన్‌షిప్‌. నిన్న మొన్నటి వరకు ఉదయం లేచినప్పట్నుంచి రాత్రి వరకు కార్యాలయాలకు వెళ్లి వచ్చే ఐటీ ఉద్యోగులతో కళకళలాడేది. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చి ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పనికి అనుమతించాయి. తిరిగి పరిస్థితులు ఎప్పటికీ చక్కబడతాయో తెలియని పరిస్థితి. కొందరు ఐటీ ఉద్యోగులు ఇక్కడ ఇళ్లు తీసుకుని ఉండేవారు. బ్యాచిలర్స్‌ అయితే నలుగురైదుగురు కలిసి ఉండేవారు. ఇప్పుడు వారందరూ ఇళ్లు ఖాళీచేసి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. 1200 కుటుంబాలు నివాసం ఉండగా.. ఇప్పుడు 550 కుటుంబాలే ఉంటున్నట్లు టౌన్‌షిప్‌ సంక్షేమ సంఘం నిర్వాహకులు చెబుతున్నారు. యజమానులే ఉంటుండగా.. అద్దెకు ఉన్న వారందరూ దాదాపు ఖాళీ చేసిన పరిస్థితి. దీనికితోడు నిర్వహణ ఛార్జీల రూపేణా నెలకు రూ.కోటి వసూలయ్యేది. ఇప్పుడు బకాయిలు పేరుకుపోయాయి.

భాగ్యనగరం ఐటీకి ఆలవాలం.. ఐటీ కంపెనీల రాకతో ఎక్కడికక్కడ సమీప ప్రాంతాల రూపురేఖలే మారిపోతున్న పరిస్థితి. అపార్టుమెంట్లు, టౌన్‌షిప్‌ల రాకతో నివాస, వాణిజ్య కార్యకలాపాలు పెరిగి హైటెక్‌సిటీలోనే కాకుండా శివారుల్లోని నానక్‌రాంగూడ, పోచారం, ఘట్‌కేసర్‌, ఉప్పల్‌, ఆదిభట్ల ప్రాంతాల్లో కొత్త కళ సంతరించుకుంది. ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నం. కరోనా మహమ్మారి కారణంగా నగరంలో ఐటీ కంపెనీలు మూతపడటంతో టౌన్‌షిప్‌లు, అపార్టుమెంట్లు సందడి లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. తర్వాత అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైనా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తుండటంతో కంపెనీలు తెరుచుకోలేదు. వర్చ్యువల్‌ సమావేశాలు నిర్వహించుకుని విధులు నిర్వర్తిస్తున్నారు.

నిర్వహణ ఛార్జీల భారం.. ఐటీ ఉద్యోగులు ఖాళీ చేయడంతో అపార్టుమెంట్ల నిర్వహణ సంక్షేమ సంఘాలకు తలకు మించిన భారంగా మారింది. అద్దెకున్న వారి నుంచి నిర్వహణ ఛార్జీలు తీసుకునేవారు. ఇప్పుడు వారందరూ ఖాళీ చేయడంతో నిర్వహణ రుసుములు వసూలు కావడం లేదని సంక్షేమ సంఘాల నాయకులు చెబుతున్నారు. కొందరు ఉద్యోగులు మాత్రం తిరిగి వస్తామన్న నమ్మకంతో ఇళ్లు ఖాళీ చేయలేదు. వారు ప్రతినెలా అద్దె చెల్లిస్తుండటంతో ఇబ్బందుల్లేవు. శివారుల్లో ఖాళీ అయినచోట నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోంది. ‘నిర్వహణ ఛార్జీలు వసూలు కాక తాము చెల్లించాల్సిన బకాయి రూ.కోటిన్నర వరకు ఉంద’ని సంస్కృతి టౌన్‌షిప్‌ సంక్షేమ సంఘ అధ్యక్షుడు మెట్టు బాల్‌రెడ్డి తెలిపారు.

కొండాపూర్‌లోని మరో అపార్టుమెంట్‌. 21 ఫ్లాట్లు ఉండగా.. ఇప్పుడు 11 ఫ్లాట్లు ఖాళీ అయిన పరిస్థితి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటీ ఉద్యోగులు ఇక్కడ అద్దెకు ఉండేవారు. భార్యాభర్తలిద్దరూ ఐటీ ఉద్యోగుల కావడం, బ్యాచిలర్స్‌గా ఉన్న ఉద్యోగులు ఇళ్లు పూర్తిగా ఖాళీ చేశారు. తమ కంపెనీ ఈ డిసెంబరు వరకు ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతి ఇచ్చిందని, తర్వాత పరిస్థితినిబట్టి ఇళ్లు తీసుకోవాలా.. వద్ధా. ఆలోచిస్తామని చెప్పి ఫ్లాట్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.

Link to comment
Share on other sites

హైదరాబాద్‌లో ఇళ్లకు తగ్గిన గిరాకీ

‘కరోనా’ ప్రభావం

ముంబయి, అహ్మదాబాద్‌, దిల్లీలోనూ అదే పరిస్థితి : ‘ప్రాప్‌ టైగర్‌’ 

హైదరాబాద్‌లో ఇళ్లకు తగ్గిన గిరాకీ

దిల్లీ:  కరోనా వైరస్‌ వ్యాధి (కొవిడ్‌-19) ప్రజారోగ్యం, ప్రజల ఉపాధి అవకాశాల మీదే కాకుండా ఇళ్ల అమ్మకాలను సైతం కుంగదీస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయినట్లు స్థిరాస్తి బ్రోకరేజీ సంస్థ ‘ప్రాప్‌ టైగర్‌’ విశ్లేషించింది. ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో ప్రధాన నగరాల్లో నివాస గృహాల అమ్మకాలు క్రితం ఏడాది ఇదేకాలంతో పోల్చితే 79 శాతం క్షీణించి 18,038 ఇళ్లకు పరిమితమైనట్లు ఈ సంస్థ పేర్కొంది. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులు దీనికి కారణమని వివరించింది.

అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, ఎన్‌సీఆర్‌ దిల్లీ, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌, ముంబయి, పుణె నగరాల్లో నివాస గృహాల అమ్మకాల తీరుతెన్నులను పరిశీలించినట్లు వివరించింది.
* హైదరాబాద్‌లో గతేడాది జూన్‌ త్రైమాసికంలో 8,122 ఇళ్ల అమ్మకాలు జరగ్గా, ఈసారి 86 శాతం తగ్గి 1,099కు పరిమితమయ్యాయి. ముంబయిలో 85 శాతం, అహ్మదాబాద్‌లో 83 శాతం, ఎన్‌సీఆర్‌ దిల్లీలో 81 శాతం క్షీణత కనిపిస్తున్నట్లు పేర్కొంది. బెంగళూరులో ఇళ్ల అమ్మకాల్లో క్షీణత 73 శాతం మాత్రమే.
* ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ మధ్య ఆరు నెలల కాలంలో హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 62 శాతం తగ్గి 6,653 యూనిట్లకు పరిమితం అయ్యాయి.

ఇళ్లకు గిరాకీ తగ్గటానికి ఆర్థిక అనిశ్చితి, నిరుద్యోగం తావిస్తున్నట్లు ప్రాప్‌ టైగర్‌ పరిశోధనా విభాగం అధిపతి అంకిత సూద్‌ పేర్కొన్నారు. మకాన్‌, హౌసింగ్‌.కామ్‌ వెబ్‌సైట్లకు కూడా ఆమె పనిచేస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఇళ్ల అమ్మకాలు కోలుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

Link to comment
Share on other sites

1 minute ago, Ryzen_renoir said:

Individual houses ki full demand undhi  but one year varaku inthey not just in Hyderabad all over the world

Yes. People are preferring individual homes for now because of fear of corona. 

this trend Might increase demand for Villas. 

Link to comment
Share on other sites

Just now, snoww said:

Yes. People are preferring individual homes for now because of fear of corona. 

this trend Might increase demand for Villas. 

how many people can afford villas? 

Link to comment
Share on other sites

5 minutes ago, tom bhayya said:

how many people can afford villas? 

Currently lot of rich people living in apartments. They might prefer shifting. 

Not just that, because of Corona lot of people were treated like untouchables by their neighbors in apartments. That might motivate some who can afford to move to villas, or individual homes . 

Link to comment
Share on other sites

5 minutes ago, tom bhayya said:

how many people can afford villas? 

You don't need to buy. City center lo apartment rent tho city ki dooram lo villa vachesthadi same rent tho. 

Work from home isthey inka distance tho pani em vundi. 

One of my friend already did it. 

Link to comment
Share on other sites

14 minutes ago, snoww said:

Currently lot of rich people living in apartments. They might prefer shifting. 

Not just that, because of Corona lot of people were treated like untouchables by their neighbors in apartments. That might motivate some who can afford to move to villas, or individual homes . 

 

12 minutes ago, snoww said:

You don't need to buy. City center lo apartment rent tho city ki dooram lo villa vachesthadi same rent tho. 

Work from home isthey inka distance tho pani em vundi. 

One of my friend already did it. 

lol wfh vasthey valla native place ki pothaadu kaani outskirts ki poyi villas rent theesukuni endhuku untaaru? villa price ki vaadu kattey rent ki match avvadhu 

  • Haha 2
Link to comment
Share on other sites

1 minute ago, Jambhalheart said:

aa madhyana ban ayina halwa & his friends hyderabad lo to-let boards levu, maa area lo pichaa pichaa ga demand vundhi, house rents kosam janaalu kotteskuntunnaru , shirts chimpesukuntunnaru ani build up echaaru kadha..

 

@Hydrockers papam ekkuva rate petti rent theesukovalsi vachindhi anta competition lo  

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...