Jump to content

మహిళను ట్రాక్టర్‌తో తొక్కించిన వైసీపీ నేత..


ParmQ

Recommended Posts

మహిళను ట్రాక్టర్‌తో తొక్కించిన వైసీపీ నేత

గుంటూరు: జిల్లాలో ఓ వైసీపీ నేత రెచ్చిపోయాడు. నకరికల్లు మండలం శివాపురంలో గిరిజన మహిళలను వైసీపీ నేత దారుణంగా హతమార్చారు. వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి.. రమావంత్ మంత్రూభాయి(55)ను ట్రాక్టర్‌తో తొక్కించాడు. దీంతో బాధితురాలు ఘటనా స్థలంలోనే చనిపోయింది. బోనముక్కల శ్రీనివాసరెడ్డి వద్ద బాధిత మహిళ 3.80 లక్షల అప్పు చేసింది. పొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చలేదనే నెపంతో ఇవాళ పొలంలో పని చేసుకుంటున్న సమయంలో మంత్రూభాయిని శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు.

117109338_3003685643063599_3872295403645

 

115933006_3003685669730263_4442560978476117238375_3003685779730252_6562963056630

 

  • Sad 2
Link to comment
Share on other sites

8 minutes ago, simha2727 said:

was he arrested? 

Current status - ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Link to comment
Share on other sites

3 minutes ago, ParmQ said:

Current status - ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

nenu cheyaledu ma driver chesadu ani cheppi evaro oka gottam gani arrest cheyistaru...enni chudaledu...

Link to comment
Share on other sites

పోలీసుల అదుపులో నిందితుడు శ్రీనివాసరెడ్డి

4gnt1a.jpg

నకరికల్లు: అప్పు చెల్లించలేదని గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేసిన దుర్మార్గుడిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.    హృదయ విదారకమైన ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా శివాపురం తండాలో సోమవారం చోటు చేసుకుంది. కేసు నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని మృతురాలి బంధువులు మంగళవారం ఉదయం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన పోలీసులు నిందితుడు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు.

నకరికల్లు శివారు శివాపురం తండాకు చెందిన రమావత్‌ మంత్రు నాయక్‌, మంత్రు భాయి (55) దంపతులు అటవీ భూములను సాగు చేసుకుంటూ వాటిపై హక్కులు సాధించారు రెండున్నర ఎకరాల్లో పంటలు పండిస్తూ జీవిస్తున్నారు. సాగుతో పాటు కుటుంబ అవసరాల కోసం ఇదే మండలంలోని నర్సింగపాడుకు చెందిన బోనముక్కల శ్రీనివాసరెడ్డి వద్ద పొలం తాకట్టు పెట్టి రెండేళ్ల కిందట రూ.3.80 లక్షల అప్పు తీసుకున్నారు. వడ్డీతో సహా తన అప్పు చెల్లించాలని శ్రీనివాసరెడ్డి కొంతకాలంగా పట్టుబడుతున్నాడు. ఈ క్రమంలో వారి మధ్య వివాదం కొనసాగుతోంది. బకాయి తీర్చకుంటే తనఖా పెట్టిన భూమిని స్వాధీనం చేసుకుంటానని అతడు బెదిరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పొలానికి వెళ్లేందుకు మంత్రు నాయక్‌, మంత్రు భాయిలు సిద్ధమవుతున్నారనే సమాచారం తెలుసుకుని ట్రాక్టర్‌తో శ్రీనివాసరెడ్డి గ్రామానికి వచ్చాడు. అప్పు చెల్లించకుండా పొలంలో కాలు పెడితే ఊరుకోబోనని దుర్భాషలాడాడు. పొలం సాగు చేసుకుని చిన్నగా అప్పు చెల్లిస్తామని దంపతులు వేడుకున్నారు. వాగ్వాదం పెరిగిన క్రమంలో కోపోద్రిక్తుడైన శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్‌తో మంత్రు భాయిను తొక్కించుకుంటూ వెళ్లాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది. వెంటనే ట్రాక్టర్‌తో సహా శ్రీనివాసరెడ్డి పరారయ్యాడు

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...