Jump to content

మాట తప్పారు.. రాజీనామా చేస్తారా?


DaatarBabu

Recommended Posts

12 minutes ago, snoww said:

Amaravati capital sesina, seyyaka poyina resignation challenge annaru baboru. 

రాజధానిపై అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం

 

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి అంశంపై కేంద్రం ప్రభుత్వం ఇవాళ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోని అంశమని అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్రల లేదని స్పష్టం చేసింది.

రాజధాని ఏర్పాటు కేంద్రం పరిధిలోని అంశమని పి.వి.కృష్ణయ్య ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కృష్ణయ్య పిటిషన్‌పై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది.

Link to comment
Share on other sites

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై నెలకొన్న వివాదం కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఏపీ రాజధానిగా గత ప్రభుత్వం అమరావతిని నిర్ణయించగా, తాజాగా జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చి, గవర్నర్‌తో కూడా దానికి ఆమోద ముద్ర వేయించింది. ఈ వివాదంపై ఏపీ హైకోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని దాఖలైన అఫిడవిట్‌కు కేంద్ర ప్రభుత్వం గురువారం కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసింది. ఏపీ రాజధాని అంశంలో కేంద్రానికి ఎలాంటి

పాత్ర లేదంటూ ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. రాష్ట్ర రాజధానుల నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారపడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. 

 

పునఃవిభజన చట్టంలోని సెక్షన్ 6 అవర్ ప్రకారం రాజధానిని ఎంపిక చేసేందుకు శివరామకృష్ణన్ కమిటీని నియమించామని కేంద్రం చెప్పింది. 2015 ఏప్రిల్ 23న ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించిందని, అప్పుడు కూడా కేంద్రానికి ఎటువంటి పాత్ర లేదని తెలిపింది. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయానికి జూలై 31న గెజిట్నోటిఫికేషన్ ఇచ్చిందని, ఇందులో కూడా కేంద్రానికి ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేసింది. పునఃవిభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరువేరుస్తామని, స్పెషల్ కేటగిరీ కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులందిస్తున్నామని, ఇప్పటికే ఏపీకి రూ.1,400 కోట్లు ఇచ్చామని కేంద్రం తెలియజేసింది.

Link to comment
Share on other sites

అమరావతి: రాజధాని పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. రాజధాని నిధుల వ్యయానికి సంబంధించిన అంశం త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటీషన్‌‌లపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకూ 52వేల కోట్ల రూపాయల వ్యయం చేశారని సీఆర్డీఏ రికార్డును హైకోర్టు న్యాయవాది ఉన్నం మురళీధర్ చూపించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘నేటివరకు ఎంత ఖర్చు చేశారు? ఎక్కడ ఆ నిర్మాణం ఆగింది?’ తదితర వివరాలు కావాలని ఆదేశించింది. ఇది ప్రజల సొమ్ము.. రాష్ట్ర ఖజానాకు నష్టమే కదా... అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Link to comment
Share on other sites

‘బిల్డింగ్‌లు ఎన్ని పూర్తయ్యాయి..?.ఎక్కడ ఆగిపోయాయి...? ఎంత వ్యవయం చేశారు..? కాంట్రాక్టర్లకు ఎంత డబ్బులివ్వాలి..?’ వంటి వివరాలన్నీ వెంటనే సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. నిర్మించిన భవనాలను వాడుకోకపోతే, అవి పాడైపోతాయి కదా... ఆ నష్టం ఎవరు భరిస్తారని ప్రశ్నించింది. రాష్ట్ర అకౌంటెడ్ జనరల్‌కు వెంటనే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ డబ్బులు ఎక్కడ నుంచి తీసుకువచ్చారు?.. 52 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లు ఏ దశలో ఉన్నాయో కూడా వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 14వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

11 minutes ago, SinN0mbre said:

Okka ycp kukka raavatle

Eellu Rajeenama cheyyaru , aallu cheyyaleru... Edo media hadavidi tappa... Donduku Donde... Anavasaram ga madhyala Farmers Bali ayithunnaru... Compensation Kosam Gattiga prashninchevade ledu... $s@d

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...