Jump to content

ప్రజలను నమ్మించి మోసం చేశారు: చంద్రబాబు

DaatarBabu

Recommended Posts

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేశారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై ఇవాళ ఆన్‌లైన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. అమరావతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చంద్రబాబు పిలుపునిచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగమే అమరావతి అన్న విషయాన్ని బాబు గుర్తు చేశారు. 

అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని.. రాజధాని కోసం రైతులు ముందుకొచ్చి 33 వేల ఎకరాలిచ్చారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ వేసిందని బాబు తెలిపారు. 50 శాతం కంటే ఎక్కువ ప్రజలు విజయవాడలో రాజధాని ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారని బాబు చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో 160 ప్రాజెక్టులను అన్ని జిల్లాలకు ప్రకటించామని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

హైదరాబాద్‌: అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే ఏపీ రాజధానిగా అమరావతి నిర్మాణం చేపట్టామని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి అనేది సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అని, దాన్ని కాపాడుకోవడం రాష్ట్ర ప్రజల కర్తవ్యమని తెలిపారు. ఏపీ రాజధాని విషయంపై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. అన్నీ అనుకూలంగా ఉన్నాయనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని చెప్పారు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను అమరావతికి తీసుకొచ్చామని గుర్తు చేశారు. తమ హయాంలో జిల్లాలకు 160 ప్రాజెక్టులు ప్రకటించామని చంద్రబాబు తెలిపారు.‘‘ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగాలనే హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ నిర్మించాం. హైటెక్‌ సిటీ నిర్మాణం తర్వాత హైదరాబాద్‌కు అనేక ప్రాజెక్టులు వచ్చాయి. అవన్నీ రావడం వల్లే హైదరాబాద్‌కు అధిక ఆదాయం వస్తోంది. ప్రస్తుతం దక్షిణాదిలో తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం మన ఏపీనే. రాష్ట్రంలో పెద్ద నగరం ఏది లేదు. అందుకే అమరావతి నిర్మాణం చేపట్టి.. అన్ని జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కానీ ఇవన్ని ధ్వంసం చేసి మూడుముక్కలాట ఆడుతానంటే.. ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఆలోచించాలి’’అని చంద్రబాబు అన్నారు.‘‘అభివృద్ధిలో భాగంగా నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టాం. 63 ప్రాజెక్టులు చేపట్టి.. అనేకం పూర్తి చేశాం. ప్రపంచమంతా తిరిగి రూ. 16లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. తిరుపతిలోనే రూ. 90వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అమరావతిని హరిత రాజధానిగా నిర్మించేందుకు కృషి చేశాం. విశాఖలో గంగవరం పోర్టును నేనే తీసుకొచ్చా. విశాఖ ప్రజలు నీతి, నిజాయితీ కలవారు. వేల మంది అమరావతి రైతుల పొట్ట కొట్టి రాజధానిని విశాఖ ప్రజలు కోరుకోరు’’అని చంద్రబాబు చెప్పారు.

Link to comment
Share on other sites

ఆ రోజు నన్ను చాలా మంది విమర్శించారు కానీ.. : చంద్రబాబు

అమరావతి : టీడీపీ హయాంలో హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలో నడిపానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.  టీడీపీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన తర్వాత ఏపీలో జరిగిన అభివృద్ధిపై ఇవాళ ఆన్‌లైన్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ తర్వాత నగరానికి అనేక ప్రాజెక్టులు వచ్చాయన్న విషయాన్ని బాబు గుర్తు చేశారు. అవన్నీ రావడం వల్లే హైదరాబాద్ నుంచి అధిక ఆదాయం వస్తోందన్నారు. 

Link to comment
Share on other sites

కులం చూసి నేను అభివృద్ధి చేశానా..?

 హైదరాబాద్‌లో నేను వేసిన విత్తనమే హైటెక్‌ సిటీ. ఆ రోజు నన్ను చాలా మంది విమర్శించారు. కానీ హైటెక్‌ సిటీ తర్వాత హైదరాబాద్‌లో అనేక ప్రాజెక్టులు వచ్చాయి. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఆ రోజు హైదరాబాద్‌లో నా బంధువులు లేరు.. నా కులం లేదు. ఇప్పడు హైదరాబాద్‌ తెలంగాణకు ఆయువు పట్టుగా మారింది. దక్షిణ రాష్ట్రాల్లో తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం ఏపీయే. ప్రపంచమంతా తిరిగి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. కులం చూసి నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానా..?. ప్రభుత్వానికి ఆదాయం కల్పించే ప్రాజెక్టు అమరావతి. అమరావతిని ధ్వంసం చేస్తే ఆదాయం ఎలా వస్తుంది..?. విశాఖలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. విశాఖలో గంగవరం పోర్టును నేనే తీసుకొచ్చా. విశాఖను ఆర్థిక రాజధానిగా, టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాం. మా హయాంలో రాయలసీమకు నీళ్లు వచ్చేలా అన్ని ప్రాజెక్టులు చేపట్టాం. అన్నీ అనుకూలంగా ఉన్నాయనే అమరావతిని రాజధానికి ఎంపిక చేశాం. అమరావతికి ప్రఖ్యాత యూనివర్శిటీలు వచ్చేలా చేశాం. టీడీపీ హయాంలో 160 ప్రాజెక్టులను అన్ని జిల్లాలకు ప్రకటించాం. అమరావతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగమే అమరావతి. గుజరాత్‌లో 20 లక్షల జనాభాతో ఆధునిక నగరాన్ని నిర్మిస్తున్నారు  అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Link to comment
Share on other sites

Sri city's total investment's so far from 2008 are less than 4 billon dollars ,  if you count all the industries setup from 2010 to 2020 in whole of chittoor and nellore districts  they will not add up to 6-7 billion USD . (Less than 50000 crores)

Naaku migatha districts paina knowledge ledhu but his figures about tirupathi antha pachi abadam . I don't think any districts outside vizag , nellore and chittoor attracted many companies in his term . Anantapur lo kia matram an exception 

How can a man of his stature lie so casually ?

Link to comment
Share on other sites

5 minutes ago, Ryzen_renoir said:

vadu investments antunnadu.. nuvvu existing projects ni count chestunnavu ... he is counting projects that are not even grounded 

Link to comment
Share on other sites

7 minutes ago, AndhraneedSCS said:

vadu investments antunnadu.. nuvvu existing projects ni count chestunnavu ... he is counting projects that are not even grounded 

An investment is something that is already made right ? Then he should correct it proposals , even around vijaywada there were lot of proposals but only significant investment was HCL 750 crores project. Do you have any detailed list of actual investments made around vijaywada during last term ?

Link to comment
Share on other sites

ప్రపంచమంతా తిరిగి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం

only MOU le kada chesukundi

PPT la kosam tappinchi em use ?

inko 4 days iathe nenu techina investments valle 20lac crs package ichadu modi antadu emo

Link to comment
Share on other sites

28 minutes ago, Ryzen_renoir said:

Sri city's total investment's so far from 2008 are less than 4 billon dollars ,  if you count all the industries setup from 2010 to 2020 in whole of chittoor and nellore districts  they will not add up to 6-7 billion USD . (Less than 50000 crores)

Naaku migatha districts paina knowledge ledhu but his figures about tirupathi antha pachi abadam . I don't think any districts outside vizag , nellore and chittoor attracted many companies in his term . Anantapur lo kia matram an exception 

How can a man of his stature lie so casually ?

Hero Honda, Isuzu list lo vunnaya lepesara

Jaggad okkati kooda teledhu

Link to comment
Share on other sites

1 minute ago, futureofandhra said:

Hero Honda, Isuzu list lo vunnaya lepesara

Jaggad okkati kooda teledhu

Jaggad Theste Vinta Kani dobbedathe kothemundi ...

Link to comment
Share on other sites

6 minutes ago, futureofandhra said:

Hero Honda, Isuzu list lo vunnaya lepesara

Jaggad okkati kooda teledhu

Sricity website ki poyi check the info , total investment's to date from 2008 is less than 4 Bil $ . That includes Isuzu, hero, Apollo tires

Isuzu motor was started under KKR ,  ippudu Jagan gadu KIA nene kattanu annatu undhi meeru Isuzu antey . 

Link to comment
Share on other sites

36 minutes ago, futureofandhra said:

Hero Honda, Isuzu list lo vunnaya lepesara

Jaggad okkati kooda teledhu

@futureofandhra Anna Gee lollantha  voddu Kani... Ee press meets ki, deadlines ki bayapade rakalu kaavu aada... Atlane aa Hyderabad gurinchi ekkuva matladithe KCR comedy sestadu malla... Koddiga TDP Cadre ki seppi konchem attantivi Kakunda Solid plan tho rammanu ... 

Link to comment
Share on other sites

రాష్ట్రంలో పెద్ద నగరం ఏది లేదు. 

Why does majority AP people and baboru keep saying they don't have any big cities in AP.

Vizag is top 10 city in India by GDP. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...