Jump to content

9 Dead In Fire At Hotel Used As Covid Care Facility In Vijayawada


Anta Assamey

Recommended Posts

నిర్లక్ష్యమే నిప్పై

‘కొవిడ్‌ కేర్‌ హోటల్‌’లో ఘోర అగ్ని ప్రమాదం
10 మంది మృతి
 దట్టమైన పొగతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి
నిద్రలోనే ప్రాణాలు విడిచిన పలువురు
 షార్ట్‌ సర్క్యూటే ప్రమాదానికి కారణం..
ఆసుపత్రి ఏ1, హోటల్‌ ఏ2గా కేసు నమోదు

నిర్లక్ష్యమే నిప్పై

ప్రమాద సమయం
తెల్లవారు జామున 4.45
హోటల్‌లో ఉన్న బాధితులు

31 మంది
హోటల్‌, ఆసుపత్రి సిబ్బంది

13 మంది

వారంతా కరోనా చికిత్సల కోసం అక్కడకు వచ్చారు.. వ్యాధి నయమై ఇళ్లకు వెళ్లిపోతామనుకున్నారు. అంతలోనే నిర్లక్ష్యపు మంటలు వారిని కమ్ముకున్నాయి. గాఢ నిద్ర నుంచి కళ్లు తెరిచేలోపే అప్పటికే అలసిన ఊపిరితిత్తుల నిండా పొగ కమ్ముకుంది. ఆదుకునే ఆపన్నులు వచ్చేలోపే వాళ్ల బతుకులు తెల్లారిపోయాయి. కొవిడ్‌ సంరక్షణ కేంద్రంగా మారినవిజయవాడ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామునే చెలరేగిన మంటలు.. పది నిండుప్రాణాలను బలిగొన్నాయి. ఆ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి.

ఈనాడు - అమరావతి, ఈనాడు డిజిటల్‌ - విజయవాడ

విజయవాడలో ప్రైవేటు కొవిడ్‌ చికిత్సా కేంద్రంగా మార్చిన స్వర్ణప్యాలెస్‌ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది మరణించారు. దట్టమైన పొగ పీల్చడంతో, అస్వస్థతకు గురైన మరో 21 మందిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి మెరుగుపడటంతో ఇళ్లకు పంపగా, 15 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని రమేష్‌ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. వారిలో 9 మంది దట్టమైన పొగ పీల్చడం వల్ల ఊపిరాడక చనిపోగా, ఒక మహిళ శరీరం పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే ఏడుగురు మరణించగా, ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రమాద సమయంలో 31 మంది బాధితులు, వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, హోటల్‌ సిబ్బంది 13 మంది ఉన్నారు.
వారంతా సురక్షితంగా బయటపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మృతుల కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఇస్తామని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. విజయవాడ ఏలూరు రోడ్డులో ఉన్న స్వర్ణప్యాలెస్‌ హోటల్‌ను రమేష్‌ ఆసుపత్రి లీజుకు తీసుకుని, కొవిడ్‌ చికిత్సా కేంద్రంగా మార్చింది. జులై 18 నుంచి అక్కడ రోగులు చికిత్స పొందుతున్నారు. హోటల్‌ యాజమాన్యం, లీజుకు తీసుకున్న రమేష్‌ ఆసుపత్రి యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లే అగ్నిప్రమాదం సంభవించిందని విజయవాడ సెంట్రల్‌ తహసీల్దార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిర్లక్ష్యమే నిప్పై

క్షణాల్లో కమ్మేసిన అగ్నికీలలు
స్వర్ణప్యాలెస్‌ హోటల్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌, మరో ఐదు అంతస్తులున్నాయి. మొదటి అంతస్తులో రిసెప్షన్‌ కేంద్రం, కంప్యూటర్‌ సర్వర్‌ రూం, వంటగది, రెస్టారెంట్‌, నాలుగో అంతస్తులో బార్‌, ఐదో అంతస్తులో బాంకెట్‌ హాల్‌ ఉన్నాయి. తొలి మూడు అంతస్తుల్లోనే ఎక్కువ గదులుండగా కొవిడ్‌ రోగులు ఈ గదుల్లోనే ఉన్నారు. హోటల్‌ సిబ్బందిలో ఒకరి కథనం ప్రకారం.. తెల్లవారుజామున 4.45 గంటల సమయంలో కంప్యూటర్‌ సర్వర్‌ రూంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. నిమిషాల్లోనే మంటలు, దట్టమైన పొగ ఆవరించాయి. చూస్తుండగానే నాలుగో అంతస్తు వరకు మంటలు ఎగబాకాయి. సిబ్బందిలో కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. మరికొందరు గదుల్లో నిద్రపోతున్న రోగుల్ని రక్షించేందుకు పరుగెత్తారు. పొగ కమ్ముకుని, కళ్లు కనిపించకపోవడంతో వారంతా బయటకు వచ్చేశారు. వారిలో ఒకరు అక్కడకు సమీపంలోని అగ్నిమాపక కేంద్రానికి 5.09 గంటలకు సమాచారం అందించారు. 5.13 గంటలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని, రక్షణ చర్యలు చేపట్టారు. కాసేపటికే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పోలీసులూ చేరుకున్నారు. హోటల్‌ లోపలకు వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ద్వారం ఒక్కటే ఉండటం సహాయ చర్యలకు ప్రతిబంధకంగా మారింది. అగ్నికీలలు ఎగసిపడుతున్నా.. ఒకటి, రెండో అంతస్తుల కిటికీల వరకు నిచ్చెనలు వేసి, రోగులను కిందకు తీసుకొచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్సులలో వారిని రమేష్‌ ఆసుపత్రికి తరలించారు.

నిర్లక్ష్యమే నిప్పై

నిద్రలోనే పోయిన ప్రాణాలు
మంటలు క్షణాల్లోనే వ్యాపించడం, అప్పటికి అందరూ గాఢనిద్రలో ఉండటంతో.. రోగుల్లో చాలామంది ఏం జరిగిందో తెలిసేలోగానే దట్టమైన పొగ పీల్చి ఊపిరాడక నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ప్రమాదాన్ని గుర్తించిన కొందరు.. కిందకు దిగివచ్చే దారిలేక, బాల్కనీలోకి చేరుకుని తమను రక్షించాలంటూ కేకలు పెట్టారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లోని వంటశాల పక్కనుంచి పైకి మరో చిన్న మెట్ల మార్గం ఉన్నా, ఆ విషయం ఎవరికీ తెలియదు. ఒకవేళ తెలిసినా.. అప్పటికే మంటలు, పొగ వ్యాపించడంతో అటునుంచీ కిందకు వచ్చే వీల్లేకపోయింది. మూడో అంతస్తులో ఉన్నవారు కిటికీల అద్దాలు పగలగొట్టి, తమను కాపాడాలని హాహాకారాలు చేశారు. ముగ్గురు రోగులు, హోటల్‌లో పనిచేసే ఒక వ్యక్తి మొదటి అంతస్తు కిటికీ నుంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.
కొవిడ్‌ రోగులున్నారని తెలిసినా..
ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించడం, వారు నిమిషాల్లోనే అక్కడకు చేరుకోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. వారు అంత వేగంగా స్పందించి రక్షణచర్యలు చేపట్టకపోతే, మొత్తం 31మంది ప్రాణాలు ప్రమాదంలో పడేవి. ఐదు ఫైరింజన్లు, 40మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు వచ్చేవరకూ వారికి అక్కడ కొవిడ్‌ రోగులున్న విషయం తెలియదు. తెలిసినా తర్వాతా వారు ధైర్యంగా సహాయ చర్యల్లో పాల్గొన్నారని జిల్లా అగ్నిమాపక అధికారి అభినందించారు.
   సంఘటన స్థలానికి మంత్రులు
ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌, మంత్రులు మేకతోటి సుచరిత, పేర్ని వెంకట్రామయ్య, వెలంపల్లి శ్రీనివాస్‌, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, విజయవాడ పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు సంఘటన స్థలాల్ని సందర్శించారు.ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు వైద్యసేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటనపై లోతుగా విచారణ జరపాలని, పూర్వాపరాలను నివేదించాలని అధికారులకు స్పష్టం చేశారు.
మృతుల్లో ఇద్దరికే పాజిటివ్‌
మృతి చెందిన 10 మందిలో కృష్ణాజిల్లాకు చెందిన వాళ్లు ఏడుగురు, గుంటూరుకు చెందిన ఓ మహిళ, ఒంగోలుకు చెందిన తల్లీకొడుకులున్నారు. మృతదేహాలన్నింటికీ విజయవాడలోని ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరికే పాజిటివ్‌గా తేలింది. వారిద్దరి మృతదేహాలకు కొవిడ్‌ నిబంధనల ప్రకారం కృష్ణలంక శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు. మిగిలిన 8 మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేసి బంధువులకు అప్పగించారు.

నిర్లక్ష్యమే నిప్పై


ఒకటే ద్వారం... పనిచేయని స్మోక్‌ డిటెక్టర్లు

మొదటి అంతస్తులోని కంప్యూటర్‌ సర్వర్‌ రూంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్లే అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తహసీల్దారు తన నివేదికలో అదే చెప్పారు. స్వర్ణప్యాలెస్‌లో విద్యుత్‌ సంబంధిత లోపాలున్నాయని, షార్ట్‌సర్క్యూట్‌ సంభవించే ఆస్కారం ఉందని హోటల్‌, రమేష్‌ ఆసుపత్రి యాజమాన్యాలకు ముందే తెలిసినా, ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందన్న ఉద్దేశంతో సరిదిద్దకుండానే కొవిడ్‌ చికిత్సా కేంద్రం ప్రారంభించారని తహసీల్దారు నివేదికలో పేర్కొన్నారు. హోటల్‌లో తగిన భద్రతా చర్యలు లేకపోవడమే ఇంత పెద్ద ప్రమాదానికి, ప్రాణనష్టానికి దారి తీసిందని భావిస్తున్నారు. తహసీల్దారు ఫిర్యాదు ఆధారంగా గవర్నర్‌పేట  పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రి యాజమాన్యాన్ని ఏ1గా, స్వర్ణప్యాలెస్‌ యాజమాన్యాన్ని ఏ2గా పేర్కొన్నారు. ఐపీసీ 304 (పార్ట్‌-2), 308 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హోటల్‌లో పొగను గుర్తించే పరికరాలు (స్మోక్‌ డిటెక్టర్లు) కూడా లేవని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. పాత హోటల్‌ కావడంతో చెక్కను ఎక్కువగా వినియోగించారని, రెస్టారెంట్‌లోనూ కుర్చీలు, బల్లలు ఉండటంతో మంటలు త్వరగా అంటుకున్నాయని భావిస్తున్నారు. దాన్ని కొవిడ్‌ చికిత్సా కేంద్రంగా మార్చాక, గ్రౌండ్‌ఫ్లోర్‌లో పెద్ద మొత్తంలో శానిటైజర్లు వంటి మండే గుణమున్న పదార్థాల్ని నిల్వచేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. అలంకరణ కోసం క్లాడింగ్‌ చేసిన తేలికపాటి మెటీరియల్‌ అంటుకోవడం వల్ల మంటలు ఎగిసిపడ్డాయి. హోటల్‌కి ఒకే ద్వారం ఉండటం అతిపెద్ద భద్రతా లోపమని అధికారులు చెబుతున్నారు. రెండో పక్క ఉండే ద్వారాన్ని మూసేశారని చెబుతున్నారు.

Link to comment
Share on other sites

ఫైర్ సేఫ్టీ మరియు ఇతర భద్రత ప్రమాణాలు పరిశీలించకుండా ఒక హోటల్ ని కోవిడ్ కేర్ సెంటర్ గా ఉపయోగించడానికి అనుమతి మంజూరు చేసి, పదకొండు మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న జగన్ సర్కార్

Link to comment
Share on other sites

విజయవాడ నగరంలోని స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటనలో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్‌ ఆస్పత్రి జీఎం సుదర్శన్‌, చీఫ్‌ ఆపరేటర్‌ రాజా గోపాల్‌రావుతో పాటు నైట్‌ షిఫ్ట్‌ మేనేజర్‌ వెంకటేష్‌ను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వర్ణ ప్యాలెస్‌తో రమేష్‌ ఆస్పత్రి ఒప్పంద పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

  • Upvote 2
Link to comment
Share on other sites

9 hours ago, ParmQ said:

ఫైర్ సేఫ్టీ మరియు ఇతర భద్రత ప్రమాణాలు పరిశీలించకుండా ఒక హోటల్ ని కోవిడ్ కేర్ సెంటర్ గా ఉపయోగించడానికి అనుమతి మంజూరు చేసి, పదకొండు మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న జగన్ సర్కార్

Indulo government thappu em vundi andi. Gujarat lo avvaleda, Africa lo avvaleda. 

Lol pulkas

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...