Jump to content

Crime Story - 5th class Orphan girl harrassed and mysterious death in Hyderabad


ariel

Recommended Posts

హైదరాబాద్ కంటోన్మెంట్ న్యూస్ టుడే: సాయం ముసుగులో ఓ మేకవన్నె పులి అభం శుభం తెలియని చిన్నారిని చిదిమేసింది. నిర్వాహకుల సహకారంతో ఓ దాత చేసిన దాష్టీకానికి బాలిక కడతేరిపోయింది. ఆయన వచ్చినప్పుడు తనను గదిలోకి ఎందుకు పంపుతున్నారో తెలియని వయసు. మత్తు పానీయం ఇచ్చి కర్కశంగా ప్రవర్తిస్తున్నా... ఏమీ చేయలేని నిస్సహాయత. వెరసి ఓ పసిమొగ్గ జీవితం 14 ఏళ్లకే ముగిసిపోయింది. అమ్మ... నాన్న లేరు కదా... అందుకే నాపై దాడి చేశారు. వాళ్లను జైల్లో పెట్టేందుకు న్యాయవాదిని అవుతా. ఇలాంటి వారి భరతం పడతా... అన్న ఆ చిన్నారి బాస గాలిలో కలిసిపోయింది. అనాథ శరణాలయంలో లైంగిక దాడికి గురైన బాలిక నిలోఫర్ ఆసుపత్రిలో బుధవారం మృతి చెందింది.
ఏం జరిగింది?
అమీన్ పూర్ లోని ఓ ప్రైవేటు అనాథ శరణాలయంలో అయిదో తరగతి చదువుతున్న బాలిక వేసవి సెలవులు, లాక్ డౌన్ కారణంగా న్యూ బోయిన్ పల్లిలో ఉండే తన చిన్నమ్మ ఇంటికి వెళ్లింది. అనారోగ్యంగా ఉండటంతో బాలికను వైద్యులకు చూపించారు. ఆమె లైంగిక దాడికి గురైందని తెలుసుకుని ఫిర్యాదు చేయడంతో బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆశ్రమానికి విరాళాలు అందజేసే వేణుగోపాల్ రెడ్డి అత్యాచారం చేశాడని, ఇందుకు నిర్వాహకులు సహకరించారని బాలిక తెలిపింది. కేసును అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయగా, వేణుగోపాల్ రెడ్డితో పాటు శరణాలయ నిర్వాహకులు విజయ, జయదీప్ లను అరెస్టు చేశారు. శరణాలయంలోని అయిదో అంతస్తుకు దాత వచ్చినప్పుడు నిర్వాహకులు బాలికను ఆ గదిలోకి పంపించేవారని, పానీయం తాగడంతో స్పృహ ఉండేది కాదని ఎఫ్ ఐఆర్ లో నమోదైంది. మెలకువ వచ్చాక చూస్తే శరీరంపై దుస్తులు ఉండేవి కావని, ఎవరికీ చెప్పవద్దంటూ వార్డెన్ బెదిరించేదని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు భరోసా కేంద్రంలో బాలల సంరక్షణ కమిటీ (సీడబ్ల్యూసీ) సమక్షంలో పోలీసులు బాలిక వాంగ్మూలం నమోదు చేశారు.

అడుగడుగునా నిర్లక్ష్యం
పోక్సో చట్టం కింద కేసు నమోదైన 24 గంటల్లోపు నిందితులను అరెస్టు చేయాల్సి ఉంది. జులై 31న ఎఫ్ ఐఆర్ నమోదైతే, విచారణ ముగిసే వరకు అరెస్టు చేయలేదు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి, మానసిక నిపుణులతో వైద్యం అందించడంలోనూ జాప్యం జరిగింది. సంరక్షణాలయంలో చేర్పించే సమయానికే బాలిక పరిస్థితి విషమించడంతో నిలోఫర్ కు పంపించారు. వెంటిలేటర్ పై చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.విచారణ సమయంలో బాగానే ఉన్న బాలిక తరువాత తీవ్రమైన అనారోగ్యానికి గురికావడంపై బాలల సంరక్షణ కమిటీ (సీడబ్ల్యూసీ) సందేహాలు వ్యక్తం చేసింది. ఆమె మృతిలో డ్రగ్స్ ప్రభావం ఏమైనా ఉందా అని నిలోఫర్ ఆసుపత్రి వర్గాలను నివేదిక కోరింది. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు న్యూ బోయిన్ పల్లిలో ఆందోళన చేశారు.

Link to comment
Share on other sites

1 hour ago, AnotherTeluguBidda said:

Heart wrenching..... what happened to that Kadapa school case on which pk was fighting?

Pk fight chesada ante followup chesada a tarvata?

valla parents vachinapudu announce chesadu courtesy act la which is good kani akadito end card

 

 

Link to comment
Share on other sites

2 hours ago, ariel said:

Pk fight chesada ante followup chesada a tarvata?

valla parents vachinapudu announce chesadu courtesy act la which is good kani akadito end card

 

 

Teleedu cheado ledo.....India lo inthe....  no justice to weak and poor. 

Link to comment
Share on other sites

Too much darunam idhi.. child abuse and orphans ante antha chinna choopu... vaadini aa owners ni vuri teeyyali appudu kaani vere vallaki aa thought kooda raadu 

  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, LadiesTailor said:

Too much darunam idhi.. child abuse and orphans ante antha chinna choopu... vaadini aa owners ni vuri teeyyali appudu kaani vere vallaki aa thought kooda raadu 

Helpless one's are easy prey for vultures

chala jaruguthay ilantivi India lo. only a few come to notice anthe

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...