Jump to content

ఫోన్ ట్యాపింగ్‌ ఆధారాలపై చంద్రబాబు ఏమన్నారంటే


DaatarBabu

Recommended Posts

అమరావతి : ‘ఫోన్ ట్యాపింగ్’ ఆరోపణలు ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా మీట్ నిర్వహించి.. ఫోన్‌లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని.. ఆధారాలుంటే చూపించాలని క్లారిటీ ఇచ్చిన విషయం విదితమే. మంగళవారం నాడు టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. అనంతరం అధినేత మీడియా మీట్ నిర్వహించారు.

ఇదేం విడ్డూరం

ఫోన్ ట్యాపింగ్‌లపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాస్తే డీజీపీ స్పందించడం విడ్డూరమని బాబు పేర్కొన్నారు. కోర్టులో నిలబడి చట్టం చదవాల్సిన పరిస్థితులు డీజీపీ ఎందుకు తెచ్చుకున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు సాక్షాధారాలు ఇవ్వాలని డీజీపీ లేఖ రాయడం కన్నా విడ్డూరం మరొకటి లేదన్నారు. పోన్ ట్యాపింగ్ వైసీపీకి ముందు నుంచి ఉన్న అలవాటేనని బాబు చెప్పుకొచ్చారు. గతంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్లు ట్యాప్ చేసిన చరిత్ర వైసీపీది అని బాబు ఎద్దేవా చేశారు. 

సర్కార్‌పై ప్రశ్నల వర్షం..

గతంలో రాసిన లేఖలపై డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి..? అని చంద్రబాబు డిమాండ్ చేశారు. అంతేకాదు.. చివరికి ఇప్పుడు డాక్టర్లు ఫోన్లను కూడా ట్యాప్ చేసే దుస్థితికి వచ్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులు చేసే ఫోన్లను కూడా జవాబివ్వాలంటే వైద్యులు భయపడే స్థితికి వైసీపీ తెచ్చిందన్నారు. వీళ్ల వేధింపులు తట్టుకోలేక వైద్యం చేయడానికి కూడా డాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆయన ఆరోపించారు. ఉన్మాదంతో వ్యవస్థలను ధ్వంసం చేస్తోందన్నారు. టీడీపీపై తప్పుడు ప్రచారంతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని.. అదే తప్పుడు ప్రచారాన్ని 15 నెలలుగా కొనసాగిస్తోందన్నారు.

గోదావరి వరదల ఉధృతికి ఆవ భూములు మునిగాయన్న విషయాన్ని ప్రభుత్వానికి బాబు గుర్తు చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ముంపు భూముల్లో ఇస్తారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరం రూ.5 లక్షల భూమిని రూ.50 లక్షలకు కొన్నారని.. వైసీపీ నేతల స్కామ్‍లు బయటపడినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రభుత్వంపై చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక తప్పు నుంచి ప్రజలు తేరుకోకముందే ఇంకో తప్పు చేస్తోందని.. సెంటు పట్టా కాదు ఇది వైసీపీ స్కామ్ పట్టా అని బాబు కన్నెర్రజేశారు.

Link to comment
Share on other sites

8 minutes ago, r2d2 said:

giphy.gif

 

anteee, maa phones meme tap cheyale, vere vallu, govt tap cheyadam endhi, mallaa vaallu tap/touch chesaru ani ma phones memu finger print marks cleaning and sanitize chesukovadam endhi antava 

IcySaneFlee-size_restricted.gif

  • Haha 1
Link to comment
Share on other sites

ఫోన్‌ట్యాపింగ్‌ చేసే అవసరం ప్రభుత్వానికి లేదు’ 

ఏపీ హోం మంత్రి సుచరిత

‘ఫోన్‌ట్యాపింగ్‌ చేసే అవసరం ప్రభుత్వానికి లేదు’

Link to comment
Share on other sites

9 minutes ago, r2d2 said:
ఫోన్‌ట్యాపింగ్‌ చేసే అవసరం ప్రభుత్వానికి లేదు’ 

ఏపీ హోం మంత్రి సుచరిత

‘ఫోన్‌ట్యాపింగ్‌ చేసే అవసరం ప్రభుత్వానికి లేదు’

Party ki undhi no

Link to comment
Share on other sites

4 minutes ago, Silveradotwo said:

What do u say dbians nijamga judges phones tap ayeyi antara?

CB n cheptunte namma buddi avuthundi Kani Ab n athi chustunte nammabuddi kavatle @3$%

ImperturbablePortlyAlbacoretuna-max-1mb.

  • Haha 1
Link to comment
Share on other sites

Quote

ఫోన్ ట్యాపింగ్‌లపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాస్తే డీజీపీ స్పందించడం విడ్డూరమని బాబు పేర్కొన్నారు

DGP and police are hacking phones ani accuse sesthe , vallu respond avvaka, valla amma mogullu respond avuthara ani kodali anna asking. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...