Jump to content

#Chiru152: లేటెస్ట్‌ అప్‌డేట్‌! 


r2d2

Recommended Posts

#Chiru152: లేటెస్ట్‌ అప్‌డేట్‌!

హైదరాబాద్‌: చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే, చిరు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రకటన చిత్ర బృందం నుంచి రానే వచ్చింది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన ప్రీలుక్‌లో ఎర్ర కండువా పట్టుకుని, పిడికిలి బిగించి ఉన్న చేతిని చూపించారు. ఇక ఈ సినిమా పేరును ఇప్పటికే చిరంజీవి ‘ఆచార్య’ అంటూ చెప్పగా, చిత్ర బృందం మాత్రం #Chiru152గానే వ్యవహరిస్తుండటం గమనార్హం. మరి ఆగస్టు 22న విడుదల చేసే ఫస్ట్‌లుక్‌లో ‘ఆచార్య’టైటిల్‌ పెడతారా? లేదా? ఇంకేమైనా ప్రకటిస్తారా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

#Chiru152: లేటెస్ట్‌ అప్‌డేట్‌!

కొరటాల శివ సినిమాలంటే కమర్షియల్‌ హంగులతో పాటు సామాజిక సందేశంతో కూడి ఉంటాయి. చిరు ఇందులో మధ్య వయస్కుడైన నక్సలైట్‌గా కనిపిస్తారని, దేవాదాయధర్మాదాయ శాఖలో జరిగే అవినీతిపై పోరాడతారని టాక్‌. రామ్‌చరణ్‌ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అటు కొరటాల, ఇటు చిరు పలు సందర్భాల్లో చెప్పారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత చిరు సుజీత్‌ దర్శకత్వంలో ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నటించనున్నారు.

Link to comment
Share on other sites

Just now, Ram60 said:

adhi fan made pic.. original lo music director peru ledu PK-1_1.gif?1344496355

tenor.gif

 

real ga kuda Mani Sharma ayithe bane untadhi. BG and songs adharagodathaadu

Link to comment
Share on other sites

1 minute ago, Silveradotwo said:

Gentleman chudaleda? Bro

anteee.. . . Nani range ki aa versions ichindochu, Chiranjeevi range veru kada.

same SPB different heros ku thaggattu voice match ayyetattu paduthaadu ga. . . 

Link to comment
Share on other sites

4 minutes ago, Kool_SRG said:

Chudaledha ippatidhaaka ??

Ledu bro. office work and DB thappa inka news kuda chudatam ledu nowadays. damn

i was thinking DSP or SS or some Bwood guy, i heard AR Rahman name also.

Link to comment
Share on other sites

మణిశర్మ ... మళ్లీ లైన్లోకి వచ్చారే

Sun Jul 12 2020 08:00:03 GMT+0530 (IST)

Manisharma ... coming into the line again

తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప సంగీత దర్శకుల్లో మణిశర్మ ఒకరు. బావగారు బాగున్నారా చూడాలని ఉంది సమరసింహారెడ్డి ఇంద్ర నరసింహనాయుడు ఒక్కడు ఖుషి పోకిరి.. ఇలా ఆయన ఖాతాలో ఎన్నో మ్యూజికల్ బ్లాక్బస్టర్లున్నాయి. ఒకప్పుడు తెలుగులో ఏ పెద్ద సినిమా తెరకెక్కుతున్నా మణిశర్మనే సంగీత దర్శకుడిగా ఎంచుకునేవాళ్లు. ఐతే ఎలాంటి మ్యుజీషియన్కు అయినా ఏదో ఒక దశలో ప్రభ తగ్గడం సహజం. మణిశర్మ విషయంలోనూ అదే జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ ఆర్పీ పట్నాయక్ తమన్ లాంటి వాళ్ల రాకతో ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయి. అలాగని ఆయనేమీ ఔట్ డేట్ అయిపోలేదు. మణిశర్మ సంగీతంలో పదును తగ్గిపోలేదు. ఐతే చాలా కాలం తర్వాత ఆయన ‘ఆచార్య’ రూపంలో ఓ పెద్ద సినిమాను దక్కించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమిది.

 



శనివారం మణిశర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమాకు తాను సంగీతం అందిస్తున్న విషయాన్ని ధ్రువీకరిస్తూ.. అందులో పాటలు నేపథ్య సంగీతం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు చెప్పారాయన. ఈ సినిమా కోసం ఇప్పటికే మూడు పాటల రికార్డింగ్ పూర్తియనట్లు మణిశర్మ వెల్లడించారు. మిగతా పాటలకు కూడా ట్యూన్లు లిరిక్స్ కూడా సిద్ధమయ్యాయని.. రికార్డింగ్ మాత్రమే చేయాల్సి ఉందని కరోనా వల్ల ఆ పని ఆగిపోయిందని ఆయన చెప్పారు. పదేళ్ల తర్వాత చిరంజీవి సినిమాకు పని చేస్తున్నానని.. కథానుసారం కొన్ని పాటలు ఉంటూనే సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఇద్దరు హీరోల మీద ఓ పాట ఒక డ్యూయెట్ ఉంటాయని మణిశర్మ వెల్లడించారు. మెలోడీ ఎమోషనల్ సాంగ్ డ్యాన్స్ నంబర్.. ఇలా అన్ని రకాల పాటలూ ఈ సినిమాలో ఉంటాయని.. అలాగే నేపథ్య సంగీతానికి కూడా ప్రాధాన్యం ఉన్న చిత్రమిదని మణిశర్మ చెప్పారు

Link to comment
Share on other sites

Nice young girls tho romance lekunda serious subject handle cheste better.. chiru romancing young girls odd ga vundi screen meeda... may be flashback lo Young chiru laa ram charan ni aa episodes kosam vadukuntaremo 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...