Jump to content

రాష్ట్రమంతటా రణభేరి


DaatarBabu

Recommended Posts

  • అమరావతి కోసం హోరెత్తిన ఆందోళనలు
  • రాజధాని గ్రామాల్లో కదంతొక్కిన మహిళలు, రైతులు
  • 250వ రోజు కొనసాగిన ఆందోళనలు
  • అన్ని జిల్లాల్లోనూ విపక్షాల సంఘీభావం

08242020031041n90.png

 

ఒకటే రాష్ట్రం... ఒకటే రాజధాని.. అది అమరావతి మాత్రమే ఉండాలి.. ‘జై అమరావతి’ అంటూ రాజధాని గ్రామాల ప్రజలు కదం తొక్కారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా 29 గ్రామాల రైతులు, కూలీలు, మహిళలు చేస్తున్న ఆందోళనలు ఆదివారానికి 250వ రోజుకు చేరుకున్నాయి. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆదివారం ‘రాజధాని రణభేరి’ పేరిట వినూత్నరీతిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగానూ నిరసనలు, సంఘీభావ కార్యక్రమాలను విపక్షాలు నిర్వహించాయి. జగన్‌ వ్యవహార శైలితో అభివృద్ధిలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిపోతోందని టీడీపీ నేతలు ఆక్షేపించారు. 

దగా పడ్డాం..!

పాదయాత్రలో జగన్‌ మాటలు నమ్మి ఓట్లు వేసి దగాపడ్డామంటూ దళిత జేఏసీ నేతలు రాయపూడిలో అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగమే ఈ రాష్ట్రానికి, అమరావతికి రక్షణ అంటూ ఆయన చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. ‘ఆలకించు ఆంధ్రుడా... బజారున పడ్డ బడుగుజీవుల బతుకులు’ అంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆలానే ప్రతి గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. కృష్ణాయపాలెం, అనంతవరం, దొండపాడు, బోరుపాలెం, యర్రబాలెం, ఉండవలి,్ల పెదపరిమి తదితర గ్రామాల దీక్షా శిబిరాలలో డప్పులు, కంచాలు, గరిటెలు మోగిస్తూ... మూడు రాజధానుల ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు వివిధ

రూపాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 

 

తల్లిలాంటి భూములను ప్రభుత్వానికి ఇచ్చి నేడు రోడ్డున పడ్డామని, తమకు అండగా నిలవాలని 13 జిల్లాల ప్రజలను కోరుతూ వెలగపూడి మహిళలు ‘భిక్షాటన’ చేసి కన్నీరు పెట్టుకున్నారు. రాజధాని ప్రజల బతుకు చూడండి అంటూ మందడం మహిళలు కాడి బుజానెత్తుకొని ఎద్దుల వలే బండిలాగి నిరసన ప్రదర్శన చేశారు. రాజధాని ప్రజల బతుకు జట్కా బండి పేరుతో తుళ్లూరు రైతులు దృశ్య రూపకం ప్రదర్శించారు. ప్రజా రాజధాని అమరావతి అందరిదంటూ అన్ని కూలాలకు చెందిన వారు తమ కులవృత్తులను ప్రదర్శించి అధికార పార్టీ నేతల ఆరోపణలను తిప్పికొట్టారు. అమరావతి జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘రాజధాని రణభేరి’ కార్యక్రమాలు జరిగాయి.

విజయవాడ ఆటోనగర్‌లో ఉన్న జేఏసీ కార్యాలయంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, న్యాయదేవత విగ్రహాలకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ జగన్‌ పచ్చి మోసగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు గురించి మాట్లాడడమే మర్చిపోయాడని, ఎవరూ కోరుకోని మూడు రాజధానులు ఎందుకని ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

 

ఆగిన మరో గుండె

అమరావతి ఉద్యమం 250వ రోజున మరో రైతు ఆవేదనతో మృతిచెందారు. రాజధాని కోసం తనకున్న 4 ఎకరాలు ఇచ్చిన ఐనవోలుకు చెందిన దళిత రైతు బేతపూడి కోటేశ్వరరావు గుండెపోటుతో మరణించాడు. అమరావతి తరలిపోతుందన్న ఆవేదనతోనే  మరణించాడని కుటుంబీకులు తెలిపారు. 

Link to comment
Share on other sites

Just now, tom bhayya said:

Mana karakatta Kamal haasan roju thiruguthunnada prajallo?

Ninna edho musti vesam vesi thirigadu ...not even joking saw it in some news 

Link to comment
Share on other sites

CBN start chesindi Jaggu etla continue chestadu anukuntaru.

Question a ledu Jaggu won't back down.

Link to comment
Share on other sites

1 minute ago, Deadp0ol2 said:

CBN start chesindi Jaggu etla continue chestadu anukuntaru.

Question a ledu Jaggu won't back down.

Fair enough Vijayawada Guntur mla’s public loki vachi adhey maata cheppochu ga 

Link to comment
Share on other sites

1 minute ago, tom bhayya said:

Fair enough Vijayawada Guntur mla’s public loki vachi adhey maata cheppochu ga 

Seypalsyna panni leydu. Public knows thiz. Andhukey 151

Link to comment
Share on other sites

3 minutes ago, tom bhayya said:

Fair enough Vijayawada Guntur mla’s public loki vachi adhey maata cheppochu ga 

Democratic compulsion vuncle. 

Vizag tdp mla lu open gaa vizag capital vaddu ani seppochu gaa. idi anthey. 

My point about gallas was , he can gain lot from attending these agitations . was just curious why he is not that active. 

Link to comment
Share on other sites

2 minutes ago, tom bhayya said:

Fair enough Vijayawada Guntur mla’s public loki vachi adhey maata cheppochu ga 

Capital unnna guntur la agitations or protests supynchu. Or dagyrallo unnnaaaaa bejawada la supynchu. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...