Jump to content

AP high Court mottikayala list


ntr2ntr

Recommended Posts

ఇప్పటివరకూ కోర్టుల నుంచి పడ్డ చీవాట్లు......

👉 చీవాటు (94) ON - 27--08-2020 అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలోని అవ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సిబిఐ కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. .

👉 చీవాటు (93) ON - 27--08-2020 రాజధాని రైతుల కౌలు రెండురోజుల్లో చెల్లించాలి అని ఆదేశించిన హైకోర్టు. .

👉 చీవాటు (92) ON - 27--08-2020 టీడీపీ మాజీ ఎమెల్యే పోతుల రామారావు గ్రానైట్ సంస్థకు ఇచ్చిన పన్ను నోటీసులు రద్దు చేసిన హైకోర్టు - లీజు రద్దు నోటీసులు కూడా డిస్మిస్ - సదరన్ రాక్ అండ్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు గతంలో పన్ను, లీజు రద్దు నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం - ఈ నోటీసులను హైకోర్టులో సవాల్ చేసిన పోతుల రామారావు - ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు చట్టబద్దంగా లేవన్న హైకోర్టు .

👉 చీవాటు (91) ON - 27--08-2020 గెస్ట్ హౌస్ శంఖుస్థాపన తో హైకోర్టు ధిక్కారం చేశారని వేసిన పిటిషన్ లో చీఫ్ సెక్రటరీ కి నోటీసులు ఇచ్చిన కోర్ట్. .

👉 చీవాటు (90) ON - 27--08-2020 మూడు రాజధానులు మరియు CRDA చట్ట రద్దు కేసులో సెప్టెంబర్ 21 నుంచి రోజువారీ విచారణ కొనసాగించడానికి న్యాయవాదులతో చర్చించిన హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయడానికి 10 వరకూ ప్రభుత్వానికి గడువు. అభ్యంతరం దాఖలు చెయ్యడానికి 17 వరకూ పిటిషనర్లకు సమయం. రాజధాని మార్పుపై స్టేటస్ కో సెప్టెంబర్ 21 వరకూ కొనసాగింపు. .

👉 చీవాటు (89) ON - 26--08-2020 మూడు రాజధానులు మరియు CRDA రద్దు చట్టాల పై హైకోర్టు విధించిన స్టే రద్దు చేయడానికి ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను కొట్టేసిన సుప్రీమ్ కోర్ట్. .

👉 చీవాటు (88) ON - 25--08-2020 Dr రమేష్ మరియు రమేష్ హాస్పిటల్ చైర్మన్ పై తదుపరిచర్యలకు స్టే ఇచ్చిన హైకోర్టు. కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మరియు DMHO ని కూడా ఎందుకు బాధ్యులు చేయకూడదు అని ప్రశ్నించిన హైకోర్టు. .

👉 చీవాటు (87) ON - 17--08-2020 రాజధాని లో ఇళ్లస్థలాలపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై సుప్రీమ్ లో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేత . హైకోర్టు ఉత్తర్వులలో ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని హైకోర్టు లోనే తేల్చుకోవాలని ప్రభుత్వానికి సూచన.శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కేసు విషయంలో 19.06.2020 న హైకోర్టు జారీ చేసిన డైరెక్షన్ ను అమలు చేయవలసిందిగా ప్రభుత్వానికి గవర్నర్ డైరెక్షన్. .

👉 చీవాటు (86) ON - 13--08-2020 ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం లో ఇళ్లస్థలాలకు 1307 ఎకరాల మైనింగ్ భూమి కేటాయింపు పై హైకోర్టు స్టే. మైనింగ్ భూమిని ఇతర అవసరాలకి కేటాయించవద్దని ప్రభుత్వానికి ఆదేశం. .

👉 చీవాటు (85) ON - 11--08-2020 కరోనా ఆర్ధిక ఇబ్బందుల కారణంగా జీతాలు పెన్షన్లు 50% మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం ఇచ్చిన జీవో లు కొట్టివేత. మార్చి ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్ల బకాయిలను 12% వడ్డీ తో సహా చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. .

👉 చీవాటు (84) ON - 06--08-2020 అమరావతి లో ప్రజాధనం వృధా అయితే చూస్తూ ఊరుకోము. రాజధాని నిర్మాణం మధ్యలో ఆపేస్తే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు ? అమరావతి నిర్మాణానికి ఇప్పటివరకూ అయినా ఖర్చుతో పాటు అసలు నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. .

👉 చీవాటు (83) ON - 04--08-2020 మూడు రాజధానులు సీఆర్డీయే రద్దు ఉత్తర్వులపై స్టే ఇచ్చిన హైకోర్టు. .

👉 చీవాటు (82) ON - 30--07-2020 అటవీ బఫర్ జోన్ లో ఉన్న భూమిని ఇళ్ల స్థలాలు గా ఎలా ఇస్తారు ? అటవీ భూమిని నిర్దేశిత అవసరాలకు మాత్రమే వినియోగించాలి. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోము. .

👉 చీవాటు (81) ON - 27--07-2020 అమర్ రాజా ఇన్ఫ్రా ప్రై లిమిటెడ్ భూములు వెనక్కి తీసుకోవడంపై ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు. .

👉 చీవాటు (80) ON - 24--07-2020 న్యాయవ్యవస్థ ను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు ? పూర్తి ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించిన సీఐడీ కోర్ట్ ఆదేశాలు. .

👉 చీవాటు (79) ON - 24--07-2020 నిమ్మగడ్డ వ్యవహారం లో ప్రభుత్వ తీరును తప్పుబట్టిన సుప్రీం కోర్ట్. హైకోర్టు తీర్పు ఇచ్చినా రమేష్ కుమార్ నియామకం ఎందుకు చేపట్టలేదు ? గవర్నర్ సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందన్న సుప్రీమ్ కోర్ట్. .

👉 చీవాటు (78) ON - 21--07-2020 టిడిపి కార్యాలయ భవనం పై ఎన్ని సార్లు పిటిషన్ వేస్తారని శ్రీ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ని ప్రశ్నించిన ధర్మాసనం. ** ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు, రాజకీయ ప్రయోజన వ్యాజ్యం. ** ఈ విషయంలో మీ ఆసక్తి ఏమిటి? **. దీనిపై మరల విచారణ జరపాల్సిన అవసరం లేదు. కావాలంటే సుప్రీంకోర్టు ను ఆశ్రయించవచ్చు. .

👉 చీవాటు (77) ON - 21--07-2020 5 సంవత్సరాలలో మారిపోయే ప్రభుత్వానికి ప్రభుత్వ ఆస్తులు అమ్మే హక్కు ఎక్కడిది అని హైకోర్టు ప్రశ్నించింది. ** రాజ్యం వేరు, ప్రభుత్వం వేరు. రాజ్యం శాశ్వతం, ప్రభుత్వం అశాశ్వతం అని వ్యాఖ్య .

👉 చీవాటు (76) ON - 21--07-2020 శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కేసు విషయంలో 19.06.2020 న హైకోర్టు జారీ చేసిన డైరెక్షన్ ను అమలు చేయవలసిందిగా ప్రభుత్వానికి గవర్నర్ డైరెక్షన్. .

👉 చీవాటు (75) ON - 21--07-2020 రాష్ట్రం లో రూల్ ఆఫ్ లా ఉందా ? పోలీస్ అధికారులు రాజకీయం కావాలి అనుకుంటే యూనిఫామ్ వదిలేసి వెళ్ళాలి. యూనిఫామ్ లో ఉండాలనుకుంటే ప్రజాహక్కులు కాపాడాల్సిందే. తలుపులు పగలకొట్టి ఒక న్యాయవాది ఇంట్లోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది ? న్యాయవాది సుభాష్ చంద్రబోస్ కేసులో హైకోర్టు. .

👉 చీవాటు (74) ON - 20--07-2020 చట్ట నిబంధనలు పాటించకుండా అధికారిక ఉత్తర్వులు లేకుండా రాత్రి ఒంటిగంట సమయంలో పోలీస్ అధికారులు పిటిషనర్ ఇంటికి ఎందుకు వెళ్లారో రాతపూర్వక వివరణ ఇవ్వాలని కోరిన హైకోర్టు. న్యాయవాది పైలా సుభాష్ చంద్ర బోస్ నిర్బందించారన్న వ్యాజ్యం లో హైకోర్టు. .

👉 చీవాటు (73) ON - 17--07-2020 మేము ఇచ్చిన తీర్పు ప్రకారం ఎన్నికల కమీషనర్ ను నియమించే అధికారం గవర్నర్ కు ఉంది. సుప్రీం కోర్ట్ స్టే ఇవ్వనందున హైకోర్టు తీర్పు అమల్లో ఉన్నట్టే అన్న ధర్మాసనం. గవర్నర్ ను కలిసి విజ్ఞాపన పత్రం అందచేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సూచించిన హైకోర్టు. .

👉 చీవాటు (72) ON - 15--07-2020 రెవిన్యూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ కు విరుద్ధంగా పశువుల మేత భూముల్లో ఇళ్లస్థలాలు కేటాయించడాన్ని తప్పు బట్టిన హైకోర్టు. .

👉 చీవాటు (71) ON - 8--07-2020 నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు తీర్పు పై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం. ఆయన తిరిగి బాధ్యతలు స్వీకరించినట్టే భావిస్తున్నాం అన్న సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం. .

👉 చీవాటు (70) ON - 18--06-2020 నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయం లో స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సీజేఐ ధర్మాసనం. ప్రతివాదులకు నోటీసులు జారీ. .

👉 చీవాటు (69) ON - 10--06-2020 నిమ్మగడ్డ కేసులో హైకోర్ట్ తీర్పు పై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీమ్ కోర్ట్. నిమ్మగడ్డ తొలగింపు పై కీలకవ్యాఖ్యలు చేసిన సీజేఐ బొబ్దే. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలు తగవు. ఆర్డినెన్సు వెనుక ఉన్న ప్రభుత్వ ఉద్దేశ్యాలు సంతృప్తికరంగా లేవన్న సీజేఐ. .

👉 చీవాటు (68) ON - 03--06-2020 గ్రామపంచాయతీ కార్యాలయాలకు నాలుగు వారాల్లోగా రంగులు తొలగించాలని సుప్రీమ్ కోర్టు ఆదేశం. లేకపోతే కోర్ట్ ధిక్కారంగా పరిగణించాల్సి వస్తుంది. నాలుగో రంగును కలపడంపైనా తీవ్రఅభ్యంతరం చెప్పిన కోర్ట్. .

👉 చీవాటు (67) ON - 29--5-2020 వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కు నోటీసులు. డాక్టర్ సుధాకర్ కేసు సిబిఐ కి ఇవ్వడంపై అసభ్యంగా మాట్లాడాడని నోటీసులు. .

👉 చీవాటు (66) ON - 29--5-2020 ఎస్ఈసీ రమేష్ కుమార్ తొలగింపు ఆర్డినెన్సు ను కొట్టేసిన హైకోర్టు. కొనసాగించాలని ఆదేశం. .

👉 చీవాటు (65) ON - 26--5-2020 బాపట్ల ఎంపీ సురేష్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కి నోటీసులు. న్యాయమూర్తుల మీద చేసిన వ్యాఖ్యల మీద సుయో మోటో గా విచారణ చేపట్టిన హైకోర్టు. .

👉 చీవాటు (64) ON - 25--5-2020 ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్‌ చేసి ఉంచాలి. కంపెనీ లోనికి ఎవరినీ అనుమతించొద్దు. తమ అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లకూడదు వారి పాస్‌పోర్ట్‌లు అప్పగించాలి .

👉 చీవాటు (63) ON - 22-05-2020 సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత. ఆయనను సస్పెండ్‌ చేస్తూ జారీ చేసిన జీవోను రద్దుచేసి మొత్తం ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని కోర్టు ఆదేశం. .

👉 చీవాటు (62) ON 22-05-2020 డా.సుధాకర్ పై జరిగిన దౌర్జన్యంపై హైకోర్టు ఆగ్రహం. కేసును సీబీఐ విచారణకు ఆదేశం. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐకి ఆదేశం. 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలి .

👉 చీవాటు (61) ON - 22-05-2020 పంచాయతీ కార్యాలయాల రంగుల వ్యవహారంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 623ను సస్పెండ్ చేసిన హైకోర్టు. వైసీపీ జెండా రంగులే కనిపిస్తున్నాయన్న వాదనతో ఏకీభవించిన హైకోర్టు. .

👉 చీవాటు (60) ON - 20-05-2020 వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం – విచారణకు ఎందుకు ఆదేశించకూడదన్న హైకోర్టు. ప్రజాప్రతినిధులే నిబంధనలు పట్టించుకోకపోతే ఎలా..? .

👉 చీవాటు (59) ON - 07-05-2020 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.15 ను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు .

👉 చీవాటు (58) ON - 05-05-2020 ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ పంచాయతీ భవనాలకు కొత్తరంగులువేయాలని జీవో నెం.623 ఇచ్చిన ప్రభుత్వం వైసీపీ రంగులతోపాటు మరో రంగును వేయాలని జీవో తెచ్చిన ప్రభుత్వం. జీవో నెం.623ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు .

👉 చీవాటు (57) ON - 05-05-2020 ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టు నోటీసులు ఎమ్మెల్యేలు మధుసూదన్‍రెడ్డి, రోజా, సంజీవయ్య, వెంకటగౌడ, విడదల రజినికి నోటీసులు. కరోనా వ్యాప్తికి వైసీపీ నేతలు కారణమంటూ దాఖలైన పిటిషన్‍పై విచారణ. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ,ప్రభుత్వానికి ఆదేశం .

👉 చీవాటు (56) ON - 23-04-2020 వలస కూలీల సమస్యపై సీపీఐ నేత రామకృష్ణ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ. విజయవాడ, గుంటూరు నగరాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను వెంటనే వారి స్వస్థలాలకు పంపేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఏపీలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు ఈ సౌకర్యం కల్పించాలని హైకోర్టు ఆదేశం వలస కార్మికులకు తగిన వసతి ఆహారం అందించాలన్న హైకోర్టు .

👉 చీవాటు (55) ON - 20-040-2020 స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు పంచాయతీ కార్యాలయాలకు రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశం. వైసీపీ రంగులను తొలగించడానికి మూడు వారాలు గడువు కోరిన ప్రభుత్వం .

👉 చీవాటు (54) ON - 15-04-2020 ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి జీవో కొట్టివేత - జీవో81 85ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు .

👉 చీవాటు (53) ON - 23-03-2020 సుప్రీంకోర్టులోజగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్దించిన సుప్రీంకోర్టు. రంగులు తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం .

👉 చీవాటు (52) ON - 20-03-2020 కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను నిలుపుదల చేసిన హైకోర్టు. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలకు జారీ చేసిన జీవో సస్పెన్షన్. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు .

👉 చీవాటు (51) ON - 17-03-2020 ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన భూముల్ని ఇళ్ల స్థలాలకు ఇవ్వవద్దని హైకోర్టు ఆదేశం. సీఎస్‌ సహా పలువురికి నోటీసులు .

👉 చీవాటు (50) ON 13-03-2020 ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ వైకాపా నేతలు వ్యవహరించాని సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసినా.. వార్డు కార్యదర్శులు, వాలంటీర్లను వైకాపా ప్రచారం కోసం వినియోగిస్తున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) పట్టించుకోకపోవడంపై హైకోర్టు సీరియస్. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై తక్షణం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం .

👉 చీవాటు (49) ON - 12-03-2020 విశాఖలో చంద్రబాబుకి 151 సీఆర్పీసీ నోటీసు ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన హైకోర్టు .

👉 చీవాటు (48) ON - 11-03-2020 రాజకీయ రంగులొద్దు పంచాయితీ భవనాలకు వైకాపా జెండాను పోలిన రంగుల్ని తీసేయంది. పార్టీలతో సంబంధం లేని రంగు 10 రోజుల్లో వేయండి. ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం .

👉 చీవాటు (47) ON - 05-03-2020 పేదల భూములు గుంజుకుంటారా? అసైన్డ్ భూముల్లో ఇళ్ల పట్టాలా? ఒకరి వద్ద తీసుకొని మరొకరికిస్తారా? కెవిపిఎస్ రిట్ పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు .

👉 చీవాటు (46) ON - 03-03-2020 ఫిబ్రవరి 27న విశాఖలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు. కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి. సెక్షన్ 151 కింద నోటీసులు ఎలా ఇస్తారు? .

👉 చీవాటు (45) ON - 03-03-2020 ఉపాధి పథకం కింద కేంద్ర పభుత్వం విడుదల చేసిన రూ 1134 కోట్లను ఎందుకు పంపిణీ చేయరని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది .

👉 చీవాటు (44) ON - 28-02-2020 వన్ సైడ్ గేమ్ కుదరదు. రాజధాని కోసం రైతులిచ్చిన భూముల్ని ఇళ్ల స్థలాలకు ఎలా ఇస్తారు? .

👉 చీవాటు (43) ON - 27-02-2020 జీఎన్ రావు బోస్టన్ కమిటీల ఫైళ్లన్నీ అప్పగించండి .

👉 చీవాటు (42) ON - 26-02-2020 ఎమర్జెన్సీని తలపిస్తున్న పోలీసులు బీహార్ కన్నా ఏపీలోనే అక్రమ నిబంధనలు ఎక్కువయ్యాయి .

👉 చీవాటు (41) ON - 25-02-2020 ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు సరికాదు. డిప్యుటేషన్‌ పై ఉన్న అధికారిని సస్పెండ్‌ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపట్టింది. కృష్ణ కిశోర్‌ ను వెంటనే ఐటీ శాఖలో చేర్చుకోవాలని ఆదేశించింది .

👉 చీవాటు (40) ON - 06-02-2020 స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ కార్యాలయాలపై పార్టీ రంగులా..? దీనిపై కేంద్ర వైఖరి తెలపాలి .

👉 చీవాటు (39) ON - 05-02-2020 సౌర, పవన విద్యుదుత్పత్తి సంస్థల బకాయిలు 4 వారాల్లోగా చెల్లిస్తామని హామీనిచ్చి..ఇప్పటివరకు ఎందుకు చెల్లించలేదు..? ఏపీఎస్పీడీసీఎల్‌ను ప్రశ్నించిన హైకోర్టు .

👉 చీవాటు (38) ON - 05-02-2020 పార్లమెంట్లో పీఎం ఫోటో లేదు. హైకోర్టులపై సీజే ఫోలూ లేవు. కానీ ప్రభుత్వ కార్యాలయాలు పంచాయతీ భవనాలపై ముఖ్యమంత్రి బొమ్మ ఎందుకు..? .

👉 చీవాటు (37) ON - 04-2-2020 పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. రాజధాని వ్యవహారంపై పిషన్లు కోర్టు విచారణలో ఉండగా కార్యాలయాల తరలింపుకు ఎందుకంత తొందర..? .

👉 చీవాటు (36) ON - 29-01-2020 జీవీఎంసీ(గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడు..ఇంకెంతకాలం? .

👉 చీవాటు (35) ON - 28-01-2020 వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు అభ్యంతరమేమిటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. జగన్మోహన్‌రెడ్డి విపక్షనేతగా ఉండగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ అభ్యర్థనపై వైఖరి ఏమిటో చెప్పాలి .

👉 చీవాటు (34) ON - 27-01-2020 ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీల రంగులు వేయడానికి వీల్లేదు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులేస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోంది..? రెండు వారాల్లోగా రంగులు తొలగించాలి .

👉 చీవాటు (33) ON 27-01-2020 ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చే చర్యల్లో భాగంగా పాఠ్యపుస్తకాల ముద్రణ, శిక్షణ తరగతులు. తదితర చర్యలు చేపడితే ఖర్చును బాధ్యులైన అధికారుల నుంచి రాబడతాం .

👉 చీవాటు (32) ON - 25-01-2020 విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామివారి దేవస్థానం ఈవో నియామక జీవోను తప్పబట్టిన హైకోర్టు. ఆ జీవోను రద్దు చేయాలని ఆదేశం .

👉 చీవాటు (31) ON - 23-01-2020 రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాల విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసిన హైకోర్టు. ఈలోపు కార్యాలయాల తరలింపునకు చర్యలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు బాధ్యులవుతారు. ఖర్చుచేసిన సొమ్మును అధికారుల జేబు నుంచి రాబడతాం. .

👉 చీవాటు (30) ON - 17-01-2020 రాజధాని గ్రామాలలో 144 సెక్షన్‌ విధింపుపై మరోసారి హైకోర్టు ఆగ్రహం. రాజధాని ప్రాంతంలో పోలీసుల భారీ కవాతు. ఆందోళనలో పాల్గొన్న మహిళలను బూటు కాలుతో తన్నడం, మగ పోలీసులు మహిళలను అరెస్ట్‌ చేయడంపై సీరియస్. ‌.

👉 చీవాటు (29) ON 13-01-2019 రాజధాని గ్రామాలలో శాంతియుత నిరసనలపై 144 సెక్షన్‌ విధించడంపై హైకోర్టు సీరియస్ ‌.

👉 చీవాటు (28) ON 08-01-2020 ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద 2019-20 సంవత్సరానికి సంబంధించి మొది విడత చెల్లింపుల్లో భాగంగా..కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,845 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు జమ చేయకపోవడంపై హైకోర్టు సీరియస్‌.. నెల రోజుల్లో వాటిని జమ చేయాలని ఆదేశం. .

👉 చీవాటు (27) ON - 03-01-2020 స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిమిత్తం జనవరి 7వ తేదీ మధ్యాహ్నం 2గంటల లోపు రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని ఆదేశం. .

👉 చీవాటు (26) ON 25-12-2019 ఐపీఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెషన్‌పై ఘాటు వ్యాఖ్యలు. పాలించే పద్ధతి ఇది కాదు. హోదా మార్చి బదిలీ చేస్తారా..ఎంత ధైర్యం? ప్రభుత్వాన్ని తప్పుడు శక్తులు నడిపిస్తున్నాయి. రాజకీయ కక్షతో ఎంత వెంటాడారో అందరికి తెలుసు. .

👉 చీవాటు (25) ON - 25-12-2019 ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయ్‌భాస్కర్ విధుల్లో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దు. .

👉 చీవాటు (24) ON - 24-12-2019 వీసీగా దామోదర్‌ నాయుడికి అర్హత ఉంది. నియమకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాఖ్యలు కొట్టివేత. .

👉 చీవాటు (23) ON - 24-12-2019 బార్‌ లైసెన్సుల ఉపసంహరణపై స్టే. కొత్త లైసెన్సుల మంజూరు ప్రక్రియ నిలిపివేత. .

👉చీవాటు (22) ON - 22-12-2019 ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉండగా ఇంచార్జ్‌ ఛైర్మన్‌ ఎలా నియమిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. .

👉 చీవాటు (21) - 21-12-2019 అంతా ఆంగ్లం కుదరదు. విద్యా హక్కు చ్టానికి అది విరుద్దమే. ఇంగ్లీష్‌ జీవోకు బ్రేక్. .

👉 చీవాటు (20) - 21-12-2019 విద్యుత్‌ బకాయిలు తక్షణం చెల్లించండి. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై ఇంత జాప్యమా? .

👉 చీవాటు (19) ON 20-12-2019 బార్ల సంఖ్యను తగ్గించాలనుకున్నప్పుడు ముందుగా గుర్తించి యజమానులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాల్సింది. .

👉 చీవాటు (18) ON - 20-12-2019 సౌర, పవన, విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు: ? .

👉 చీవాటు (17) ON - 14-12-2019 ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులా? ప్రజాస్వామ్య దేశంలో ఇదేం పద్దతి? ఎవరి అనుమతులతో చేస్తున్నారో నిలదీత. .

👉 చీవాటు (16) ON - 04-12-2019 మద్య నిషేదమే లక్ష్యమైతే రిటైల్‌ను తగ్గించరేం? బార్లను తగ్గించడంలో మతులబేంటి? .

👉 చీవాటు (15) ON - 30-11-2019 ఆలయ బోర్డుల రద్దు మీ ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు. .

👉 చీవాటు (14) ON - 28-11-2019 పాస్టర్లు, ఇమాం, మౌజన్‌లకు ఏ నిబంధన ప్రకారం పారితోషకం? .

👉 చీవాటు (13) ON - 15-11-2019 కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా? పంచాయితీ ఎన్నికలు జరపరా? .

👉 చీవాటు (12) ON - 15-11-2019 రాజధాని కమిటీపై మీ వైఖరేంటి? బొత్సా, బుగ్గన్నలకు నోటీసులు. .

👉చీవాటు (11) ON - 14-11-2019 ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆక్షేపణ ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు సంస్థలకు కేయించేందుకు ఓ విధానం అంటూ లేదా? .

👉 చీవాటు (10) ON - 02-11-2019 రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్‌ విక్రయిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? .

👉 చీవాటు (9) ON - 29-10-2019 పాలక మండలి ఇదేం పద్దతి? విశ్వవిద్యాలయాల చట్టంకు విరుద్దంగా నిర్ణయాలు .

👉 చీవాటు (8) ON - 17-09-19 మీ పద్దతి బాగోలేదు. ధరలు ఖరారు పిటీషన్లను త్వరగా తేల్చాలని ఏపీఈఆర్‌సీకి ఆదేశం .

👉 చీవాటు (7) ON - 14-09-2019 వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లను ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలి .

👉చీవాటు (6) ON - 13-09-2019 బందరు పోర్టుకు భూముల్ని అప్పగించడంలో సర్కారు విఫలం. జీవో నిలిపివేస్తూ ఉత్తర్వులివ్వండి. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దన్న ఏజీ. .

👉 చీవాటు (5) ON - 04-09-2019 స్విస్‌ ఛాలెంజ్‌పై మీ వైఖరింటి? .

👉 చీవాటు (4) ON - 23-08-2019 పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు విషయంలో రివర్స్‌ చెల్లదు. కాంట్రాక్టు రద్దు కుదరదు. ఇది జెన్కో కుదుర్చుకున్న ఒప్పందం. రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. రద్దు నిబంధనలు అనుసరించలేదు. .

👉 చీవాటు (3) ON - 15-08-2019 చంద్రబాబుకు భద్రత తగ్గించవద్దు. కాన్వాయ్‌లో జామర్‌ ఉండాల్సిందే .

👉 చీవాటు (2) ON - 31-07-19 మేం చెప్పినా ఇంతేనా? విద్యుత్‌ కొనుగోలు చేయరా? ఇది మా ఆదేశాల ఉల్లంఘనగా భావించాలి .

👉 చీవాటు (1) ON - 26-07-2019 ఎందుకీ తొందర..? పీపీఏల సమీక్ష అధికారం మీకెక్కడిది? ధరలు నిర్ణయించేది ఈఆర్‌సీ. తగ్గించుకోవాలని బెదిరింపులా?

Link to comment
Share on other sites

Vachina kotta lo monthly vachevi... tarvatha tarvatha weekly... ee roju record 5 in a single day 

 

This is not just a track record. its an all time record ... Never Before .. Ever again 

Link to comment
Share on other sites

18 minutes ago, AndhraneedSCS said:

Vachina kotta lo monthly vachevi... tarvatha tarvatha weekly... ee roju record 5 in a single day 

 

This is not just a track record. its an all time record ... Never Before .. Ever again 

devudi palana antunna @tom bhayya

Link to comment
Share on other sites

54 minutes ago, AndhraneedSCS said:

Vachina kotta lo monthly vachevi... tarvatha tarvatha weekly... ee roju record 5 in a single day 

 

This is not just a track record. its an all time record ... Never Before .. Ever again 

:giggle::giggle:

Link to comment
Share on other sites

15 minutes ago, snoww said:

Number 95 

Repu acham vuncle ki bail 

96 ramesh hospital staff ki bail 

97 phone tapping is going on 

98 jaffas ministers not following corona rules, CBI investigation on it

Inko 2 kaavali. 

Doctor sudhakar vuncle case em ayyindi ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...