Jump to content

ఏది లీగల్‌.. ఎవరు లిటిగెంట్‌?


DaatarBabu

Recommended Posts

న్యాయవ్యవస్థను చంద్రబాబునాయుడు మేనేజ్‌ చేస్తున్నారన్నది జగన్‌ అండ్‌ కో ప్రధాన ఆరోపణ. హైకోర్టులో జగన్‌ రెడ్డి ప్రభుత్వానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నందున ఇలాంటి ఆరోపణలను నిజమేనని ప్రజలు నమ్మే ప్రమాదం లేకపోలేదు. జగన్‌ అండ్‌ కో కోరుకుంటున్నది కూడా ఇదే! అందుకే హేతుబద్ధత లేకపోయినా ఇటువంటి ఆరోపణలను పదే పదే చేస్తున్నారు. న్యాయ వ్యవస్థను నిజంగా మేనేజ్‌ చేయవచ్చా? మెరిట్‌తో సంబంధం లేకుండా న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వగలవా? చరిత్ర చూస్తే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని అర్థమవుతుంది. కేసుల విచారణ సత్వరం జరగకుండా కిందిస్థాయిలో మేనేజ్‌ చేయడం గురించి విన్నాం, చూస్తున్నాం. కానీ, తీర్పుల విషయంలో అలా సాధ్యం కాదు. జగన్‌ తనపై నమోదైన అవినీతి కేసులలో సత్వర విచారణ జరగకుండా చట్టంలో ఉన్న వెసులుబాట్లను ఉపయోగించుకున్నట్టుగానే ఇతరులు కూడా చేసి

ఉండవచ్చు. మెరిట్‌తో సంబంధం లేకుండా తీర్పులు వెలువడినా వాటిని సమీక్షించడానికి పై కోర్టులు ఉన్నాయని తెలుసుకోవాలి.

 

హైదరాబాద్‌ వంటి మహానగరంలోనే లేక్‌ వ్యూ వంటి అతిథిగృహం ఐదు ఎకరాలలో ఉండగా విశాఖలో 30 ఎకరాల్లో అతిథిగృహం నిర్మించాలనుకోవడం ఏమిటి? హైదరాబాద్‌ సమీపంలో దాదాపు 20 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ నెలకొల్పే పనులను తెలంగాణ ప్రభుత్వం ముమ్మరం చేసింది. అభివృద్ధి అంటే అటువంటి ఆలోచనలు చేయాలి గానీ, ప్యాలెస్‌లను తలపించే ఇళ్లు నిర్మించుకోవడం, ఏకంగా 30 ఎకరాల్లో అతిథిగృహం నిర్మించుకోవడం కాదు. హైదరాబాద్‌లో ప్రైవేట్‌ పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్‌ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటింది. ఇంతవరకు అటువంటి ఆలోచన ఒక్కటైనాచేశారా? నిజమైన అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఎవరినో నిందించి ప్రయోజనం ఏమిటి?

Link to comment
Share on other sites

పేదలకు ఇళ్ల స్థలాల కార్యక్రమం ఎప్పటికప్పుడు వాయిదా పడడానికి నిజంగా ప్రతిపక్షాలు కారణమా? అంటే కానే కాదు! ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లనే న్యాయస్థానాలలో ఆటంకాలు ఎదురవుతున్నాయని స్పష్టమవుతున్నది. ‌ఇళ్ల స్థలాల కోసం భూసేకరణలో జరిగిన అవినీతిని పక్కనపెడితే లబ్ధిదారులు తమకు లభించిన స్థలాలను అయిదేళ్ల తర్వాత అమ్ముకోవడానికి వీలుగా కన్వేయన్స్‌ డీడ్‌లు ఇవ్వాలని జగన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లో ఉన్న అసైన్‌మెంట్‌ చట్టానికి విరుద్ధం. ఈ కారణంగానే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. కన్వేయన్స్‌ డీడ్‌లు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని హైకోర్టు స్పష్టంచేసింది. అసైన్‌మెంట్‌ చట్టం పరిధిలో గత ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలను డీకేటీ

పట్టాల రూపంలో ఇచ్చేవి. ఈ విధానం గతంలో ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు! ఇప్పుడు మాత్రం ఎందుకు వివాదం అయిందంటే, అమల్లో ఉన్న చట్టానికి విరుద్ధంగా జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కారణం. ఈ వాస్తవాన్ని విస్మరించి ప్రతిపక్షాలను, న్యాయస్థానాలను తప్పుబట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? 

 

చంద్రబాబు ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించి వివిధ నిర్మాణాల కోసం పది వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసిన తర్వాత ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం ‘‘అమరావతి మాకు వద్దు, విశాఖకు పోతాం’’ అంటే హైకోర్టులో కేసులు దాఖలు కాకుండా ఎందుకుంటాయి? అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా, చేసిన ఖర్చుకు బాధ్యత తీసుకోకుండా ‘‘మాకు ఇక్కడ ఉండబుద్ధి

కావడం లేదు. వెళ్లిపోతాం’’ అంటే కుదురుతుందా? అలా అయితే న్యాయస్థానాలు ఎందుకు? రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ద్వారా అమరావతిలో ఏర్పాటైన హైకోర్టును.. అధికారం ఉంది కదా అని కర్నూలుకు తరలించే విధంగా చట్టం చేస్తే చెల్లుబాటు అవుతుందా? న్యాయపరమైన, విధానపరమైన, నైతికపరమైన వివాదాలు ఎన్నో ఇమిడి ఉన్న అభివృద్ధి వికేంద్రీకరణ చట్టానికి వెంటనే ఆమోద ముద్ర వేయడానికి హైకోర్టు ఏమీ గవర్నర్‌ కార్యాలయం కాదు.

Link to comment
Share on other sites

‘‘ప్రజలకు మంచి చేద్దామనుకుంటుంటే లిటిగేషన్లతో న్యాయస్థానాలకు వెళుతూ అడ్డుకుంటున్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించి అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేద్దామంటే సైంధవ పాత్ర పోషిస్తున్నారు’’ అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని నిందిస్తోంది. ఇటు హైకోర్టులోనూ అటు సుప్రీంకోర్టులోనూ వరుసగా ఎదురుదెబ్బలు తగలడంతో అధికార వైసీపీ ఈ కొత్త పల్లవి అందుకుంది. ‘‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దామనుకుంటే అడ్డుపడుతున్నవారిని కమ్యూనిస్టులు కూడా నిలదీయకపోవడం ఏమిటి?’’ అని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వారు ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశం, లక్ష్యం ఎంత గొప్పవైనా దాన్ని చేరుకోవడానికి ఎంచుకొనే మార్గం కూడా అంతే ఉన్నతంగా ఉండాలని ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు పొందిన దివంగత సూదిని జైపాల్‌రెడ్డిఎప్పుడూ చెబుతుండేవారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఈ సూత్రాన్ని విస్మరించి తలబిరుసుతనం, అహం ప్రదర్శించడం వల్లనే న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లోపం ఎక్కడుందో గుర్తించకుండా తాము అనుకున్నది జరగడం లేదని ఆక్రోశం వెళ్లగక్కడం వల్ల ప్రయోజనం ఉండదని గ్రహించకపోగా, ప్రతిపక్షాలను నిందించే ఎత్తుగడకు తెర లేపారు. ప్రభుత్వం చేసే పనులలో లోపాలను ఎత్తిచూపినప్పుడు ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని అధికారంలో ఉన్నవారు విమర్శించడం కొత్తేమీ కాదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ప్రభుత్వ పోకడలు వింత రీతిలో ఉంటున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాల విషయమేతీసుకుందాం. ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు వాయిదా పడడానికి నిజంగా ప్రతిపక్షాలు కారణమా? అంటే కానే కాదు! ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లనే న్యాయస్థానాలలో ఆటంకాలు ఎదురవుతున్నాయని స్పష్టమవుతున్నది. ఇళ్ల స్థలాల కోసం భూసేకరణలో జరిగిన అవినీతిని పక్కనపెడితే లబ్ధిదారులు తమకు లభించిన స్థలాలను అయిదేళ్ల తర్వాత అమ్ముకోవడానికి వీలుగా కన్వేయన్స్‌ డీడ్‌లు ఇవ్వాలని జగన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లో ఉన్న అసైన్‌మెంట్‌ చట్టానికి విరుద్ధం. ఈ కారణంగానే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. కన్వేయన్స్‌ డీడ్‌లు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రభుత్వాలు తమకు కేటాయించే ఇళ్లస్థలాలను అమాయకంగా అమ్ముకుని మళ్లీ ఇళ్లు లేని పేదలుగా మిగలకూడదన్న ఉద్దేశంతో వాటిని అమ్ముకోవడాన్ని నిషేధిస్తూ 1977లో ఉమ్మడి రాష్ట్రంలోనే అసైన్‌మెంట్‌ చట్టం తెచ్చారు. ఈ చట్టం పరిధిలో గత ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలను డీకేటీ పట్టాల రూపంలో ఇచ్చేవి. ఈ విధానం గతంలో ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు! ఇప్పుడు మాత్రం ఎందుకు వివాదం అయిందంటే, అమల్లో ఉన్న చట్టానికి విరుద్ధంగా జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కారణం. ఈ వాస్తవాన్ని విస్మరించి ప్రతిపక్షాలను, న్యాయస్థానాలను తప్పుబట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఐదేళ్ల తర్వాత అమ్ముకోవడానికి వీలుగా డీడ్స్‌ ఇవ్వడాన్ని చట్టం అనుమతించదని అధికారులు చెప్పినా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి వినిపించుకోలేదు. 

లబ్ధిదారుల నుంచి పది రూపాయల ఫీజు తీసుకొని కన్వేయన్స్‌ డీడ్‌లు జారీ చేయడానికి వీలుగా 44వ నంబర్‌ జీవో జారీ చేశారు. ఈ జీవోకు చట్టబద్ధత లేదని హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం వివాదం సుప్రీంకోర్టులో ఉంది. 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...