Jump to content

నాకు ఎలాంటి స్ట్రోక్‌‌‌ రాలేదు : ట్రంప్‌ 😀


r2d2

Recommended Posts

అది తప్పుడు కథనమన్న అమెరికా అధ్యక్షుడునాకు ఎలాంటి స్ట్రోక్‌‌‌ రాలేదు : ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత నవంబరులో అస్వస్థతకు గురయ్యారనే వార్తలు వచ్చాయి. ఆయనకు స్ట్రోక్‌ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, అందుకే ఆకస్మికంగా ఆసుపత్రిని సందర్శించాల్సి వచ్చిందని అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాకుండా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ఉపాధ్యక్షుడిగా ఉన్న మైక్‌ పెన్స్‌ను సంసిద్ధం(స్టాండ్‌బై)గా ఉంచినట్లు కూడా ఓ వార్తా సంస్థ పేర్కొంది. అనంతరం సామాజిక మాధ్యమాల్లోనూ దీనిపై చర్చ జరిగింది. తాజాగా మరోసారి ఈ విషయం చర్చనీయాంశమైంది. వీటిని ఖండిస్తూ.. అమెరికా అధ్యక్షుడికి ఎలాంటి స్ట్రోక్‌ రాలేదని, ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు స్పష్టం చేశారు. తాజాచర్చకు దారితీసిన ఈ వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కూడా కొట్టిపారేశారు.

ఓవార్తా సంస్థకు చెందిన జర్నలిస్ట్‌ ‘డొనాల్డ్‌ ట్రంప్‌ Vs ది యునైటెడ్‌ స్టేట్స్‌’అనే పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలోనూ ట్రంప్‌ ఆసుపత్రి సందర్శన గురించిన విషయాలను ప్రస్తావించినట్లు సమాచారం. ఈపుస్తకంలో.. మైక్‌ పెన్స్‌ను అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు స్టాండ్‌ బైలో ఉంచిన విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. తనపై వచ్చిన వార్తలను కొట్టిపారేసిన ట్రంప్‌.., ‘ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ను ఎన్నడూ స్టాండ్‌బైలో పెట్టలేదు. అంతేకాకుండా నాకు ఎలాంటి మినీ స్ట్రోక్స్‌ రాలేదు. ఈమధ్య వచ్చిన వార్తలు పూర్తి అసత్య కథనాలు’ అని ట్విటర్‌లో స్పష్టంచేశారు. కేవలం సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగానే ఆసుపత్రికి వెళ్లానని పేర్కొన్నారు.

‘అధ్యక్షుడు ట్రంప్‌కు సెరెబ్రోవాస్క్యూలర్‌ యాక్సిడెంట్‌( స్ట్రోక్‌), ట్రాన్సియంట్‌ ఇషెమిక్‌ అటాక్‌(మినీ స్ట్రోక్‌), లేదా హృద్రోగ సమస్యలు తలెత్తాయని మీడియాలో వస్తోన్న వార్తలు పూర్తిగా అసత్యం. ఇలాంటి సమస్యలు ఆయనకు ఇప్పటివరకు తలెత్తలేదు’ అని అమెరికా అధ్యక్షుడి వ్యక్తిగత వైద్యుడు డాక్టర్‌ సీన్‌ కోన్లే స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు.

ఈ వార్తలపై అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌కూడా స్పందించారు. డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసుపత్రికి వెళ్లిన సందర్భంలో తనను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు స్టాండ్‌బైలో ఉండమని చెప్పినట్లు నాకు గుర్తులేదు. కానీ, కేవలం ట్రంప్‌కు వైద్యుని అపాయింట్‌మెంట్‌ ఉందని మాత్రమే తనకు తెలియజేసినట్లు తాజాగా ఓ మీడియా ఛానల్‌ అడిగిన ప్రశ్నకు మైక్‌పెన్స్ సమాధానం ఇచ్చారు.

గత సంవత్సరం నవంబరులో అధ్యక్షుడు ట్రంప్‌ అకస్మాత్తుగా వాల్టర్‌ రీడ్‌ జాతీయ మిలటరీ ఆసుపత్రిని సందర్శించారు. ఆ సమయంలో ట్రంప్‌కు పలుసార్లు స్వల్ప స్ట్రోక్‌(బ్రెయిన్) లేదా హృద్రోగ సమస్యలు ఏర్పడ్డాయనే వార్తలు వచ్చాయి. అప్పట్లో వైట్‌ హౌజ్‌ కూడా దీన్ని ఖండించింది. ప్రతిసంవత్సరం నిర్వహించే సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగానే ట్రంప్‌ ఆసుప్రతికి వెళ్లారని వివరణ ఇచ్చింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...