Jump to content

నూతన్‌నాయుడి మోసాలు!


r2d2

Recommended Posts

పీవీ రమేశ్‌నంటూ.. విశ్రాంత ఐఏఎస్‌ పేరిట మాట్లాడిన సినీ నిర్మాత
శిరోముండనం చేస్తున్నపుడు వీడియోకాల్‌లోనూ అతనే
ఉడుపిలో అరెస్టు.. త్వరలో విశాఖకు

పీవీ రమేశ్‌నంటూ.. నూతన్‌నాయుడి మోసాలు!

విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ), న్యూస్‌టుడే: విశాఖలో దళిత యువకుడికి శిరోముండనం కేసులో కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో ఇప్పటికే సినీ నిర్మాత నూతన్‌నాయుడి భార్య ప్రియమాధురి, అక్కడ పనిచేస్తున్న ఆరుగురు సిబ్బందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  నూతన్‌నాయుడి ప్రమేయంపై పోలీసులు విచారణ చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. శ్రీకాంత్‌కి శిరోముండనం చేస్తున్న సమయంలో ప్రియమాధురి, ఆమె సిబ్బంది ఎవరికో వీడియోకాల్‌ చేసినట్లు సీసీ కెమెరా ఫుటేజిలో నమోదైంది. వారు నూతన్‌నాయుడితోనే మాట్లాడారని పోలీసులు తేల్చారు. కేసు నమోదైన వెంటనే నిందితులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు వారిని కేజీహెచ్‌కి తీసుకెళ్లారు. ఆ సమయంలో వైద్యులు సుజాత, వాసుదేవ్‌లకు తాను విశ్రాంత ఐఏఎస్‌ పీవీ రమేశ్‌నంటూ ఫోన్‌ వచ్చింది. తనకు తెలిసినవారు పెందుర్తి నుంచి వస్తున్నారని, వారికి వెంటనే వైద్యపరీక్షలు చేయాలన్నది ఆ కాల్‌ సారాంశం. ఏడుగురిలో ఒకరిని కేజీహెచ్‌కు పంపించాలని సూచించారు. దీంతోపాటు కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌కు కూడా పీవీ రమేశ్‌ పేరిట ఫోన్‌చేసి కేజీహెచ్‌కు పంపిన వారిని రెండువారాలు పరిశీలనలో ఉంచేలా సూచించాలని కోరారు. పీవీ సుధాకర్‌కు పీవీ రమేశ్‌ పరిచయం ఉండటంతో వెంటనే ఆయనతో ఈ విషయాన్ని చర్చించారు. పీవీ రమేశ్‌.. ఈ విషయాన్ని విశాఖ సీపీ దృష్టికి తీసుకొచ్చారు. విచారణలో నూతన్‌నాయుడే ఆ ఫోన్లు చేస్తున్నట్లుగా గుర్తించి.. నిఘా ఉంచారు. అతడు హైదరాబాద్‌నుంచి బెంగళూరు, తర్వాత మంగళూరు వెళ్లాడు. ఈనెల 3న రాత్రి 8.30 గంటలకు ఉడుపి రైల్వేస్టేషన్‌లో అరెస్టుచేసి, శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు.

ట్రూ కాలర్‌లోనూ..
పీవీ రమేశ్‌ పేరిట మాట్లాడుతున్న సిమ్‌కు ట్రూ కాలర్‌లో ఆంధ్రప్రదేశ్‌  సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి పేరు వచ్చేలా చేసినట్లు విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. నూతన్‌నాయుడు పీవీ రమేశ్‌ పేరును దుర్వినియోగం చేస్తూ అనేక మోసాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. అతని ఫోన్‌లో రాష్ట్రవ్యాప్తంగా  సుమారు 30 మంది అధికారులతో మాట్లాడినట్లు సీపీ వెల్లడించారు.

Link to comment
Share on other sites

8 minutes ago, kittaya said:

Ee batch antha PK ni vadukune valle..

Pichi PK Nene na fans ni vadukunta ane bhramalo untadu

ee fraud edavalni antha easy vadiledhi ledhu kitti ... pawala gadi notlo M pettakunda vadhalaru aadi pans..

Link to comment
Share on other sites

22 minutes ago, reality said:

ee fraud edavalni antha easy vadiledhi ledhu kitti ... pawala gadi notlo M pettakunda vadhalaru aadi pans..

Already peduthunaru ... Kani manodiki ardm kavatla

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...