r2d2 Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ వైద్య కళాశాల నిర్మాణానికి గతంలో నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు ముందడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.2,050 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా అనుమతులు మంజూరు చేసింది. విశాఖ జిల్లా పాడేరులో వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.500 కోట్లు, కడప జిల్లా పులివెందులలో వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.500 కోట్లు, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైద్య కళాశాలకు రూ.500 కోట్లు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైద్య కళాశాలకు రూ.550 కోట్లను కేటాయించింది. పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల కళాశాలల్లో ఒక్కో చోట 100, మచిలీపట్నంలో 150 ఎంబీబీఎస్ సీట్లు రానున్నాయి. అలాగే ఆరు చోట్ల కళాశాల రూ.104.17 కోట్లతో స్థలాల కొనుగోలుకు అనుమతులిచ్చింది. అమలాపురం, ఏలూరు, పిడుగురాళ్ల, మదనపల్లి, ఆదోని, పులివెందులలో స్థలాల కొనుగోలుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 Kattinapudu choodam , ilantivi chandranna kooda vandha cheppadu . What corona has taught us is we need many many more government colleges , private medical care is a failure in times of crisis. Anni states inka chaala medical colleges kataali Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.