kakatiya Posted September 14, 2020 Report Share Posted September 14, 2020 అఖిల్‌తో ‘సిసింద్రీ’ అలా తీశారు! ఇంటర్నెట్ డెస్క్: అక్కినేని అఖిల్, నాగార్జున, శరత్‌బాబు, ఆమని కీలక పాత్రల్లో నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘సిసింద్రీ’. శివ నాగేశ్వరరావు దర్శకుడు. 1995 సెప్టెంబరు 14న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చిన్నా, పెద్దా అందరినీ అలరించింది. సోమవారంతో ఈ చిత్రం విడుదల 25ఏళ్లు పూర్తి చేసుకుంది. కథేంటంటే: శరత్‌కుమార్ (శరత్‌బాబు), ఆమని భార్యాభర్తలు. వీరికి సిసింద్రీ (అఖిల్) ఒక్కొగానొక్క కొడుకు. సిసింద్రీని కిడ్నాప్ చేసి శరత్‌కుమార్ దగ్గర డబ్బులు డిమాండ్ చేయాలని చూస్తాడు అతడి తమ్ముడు శివాజీ (శివాజీ రాజా). దీనికోసం జక్కన్న(గిరిబాబు), అక్కన్న (తనికెళ్ల భరణి), మాదన్న (సుధాకర్) సహకారంతో సిసింద్రీని కిడ్నాప్ చేస్తాడు? మరి వారి నుంచి సిసింద్రీ ఎలా తప్పించుకున్నాడు? బాబును కిడ్నాప్ చేసిన ముగ్గురు ఎలాంటి కష్టాలు పడ్డారు? చివరకు సిసింద్రీ తల్లిదండ్రులను చేరాడా? అన్నది కథ. అఖిల్‌తో ‘సిసింద్రీ’ అలా తీశారు! హాలీవుడ్ చిత్రం ‘బేబీ డే అవుట్’ స్ఫూర్తితో దర్శకుడు శివ నాగేశ్వరరావు, మరుధూరి రాజా ఈ కథను తీర్చిదిద్దారు. అప్పటికి అఖిల్ వయసు ఏడాది. ‘సిసింద్రీ’ కోసం చిత్ర బృందం ఎంతో కష్టపడింది. మరీ ముఖ్యంగా అఖిల్‌ను చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. సిసింద్రీ కిడ్నాప్ అయిన దగ్గరి నుంచి జక్కన్న, అక్కన్న, మాదన్న పడే కష్టాలు ప్రేక్షకులకు నవ్వులు పంచాయి. సినిమా మొత్తం అఖిల్ కనిపిస్తాడు. తెరపై తల్లిగా ఆమని కనిపించినా, ఆమె వెనుక అమల ఉండేవారు. అఖిల్ నేలపై పాకే సన్నివేశాలు, చిరు నవ్వులు చిందించే సన్నివేశాలు అంత అందంగా రావడానికి అమల ఎంతో కృషి చేశారు. షూటింగ్ జరిగినంత సేపూ అఖిల్‌తోనే ఉండేవారు. గ్లాస్ డోర్ వెనక నిలబడి అమల పిలిస్తే అఖిల్ పాకుతూ వచ్చేవాడు. ఇక నాగార్జున ఎక్కువ సన్నివేశాల్లో కనిపించారు. కారు మెకానిక్‌గా సిసింద్రీని కాపాడే పాత్రలో ఆయన నటించారు. అఖిల్‌తో ‘సిసింద్రీ’ అలా తీశారు! సెట్‌లో అఖిల్ గాయం.. భయపడిపోయిన యూనిట్ ‘సిసింద్రీ’ షూటింగ్ జరుగుతుండగా జరిగిన ఓ సంఘటనతో ఆ యూనిట్ మొత్తం భయపడిపోయింది. రోజూ అఖిల్‌తో అమల ఉండేవారు. అప్పుడప్పుడు నాగార్జున వచ్చేవారు. ఒకరోజు అమల బయటకు వెళ్తూ, సెట్‌లో అఖిల్‌ను కేర్‌టేకర్‌కు అప్పగించి వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో అఖిల్ ఆడుకుంటూ టీపాయ్‌పై పడ్డాడు. దీంతో కంటి రెప్పపై చిన్నగా గీసుకుంది. అంతే ఈ విషయం తెలిసిన నాగార్జున, అమల పరుగు పరుగున సెట్‌కు వచ్చారు. అప్పుడు దర్శకుడు శివనాగేశ్వరరావు సెట్‌లో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్‌లకు ఒక్కటే చెప్పారు. ‘నాగార్జున వస్తారు. ఒకళ్లిద్దరికి దెబ్బలు ఖాయం. ఆయన చేతిలో ఇప్పుడు దెబ్బలు తినడమే నయం. ఆ తర్వాత పెద్ద ఇష్యూ అవుతుంది’ అన్నారట. నాగార్జునతో పాటు ఆయన స్నేహితుడు సతీష్ కూడా సెట్‌కు వచ్చారు. అఖిల్ కంటిపై గీరుకోవడం చూసి, ‘పిల్లలకు దెబ్బలు తగలకుండా ఉంటాయా? చిన్నప్పుడు నాకు ఎన్నో దెబ్బలు తగిలాయి’ అని సర్ది చెప్పడంతో నాగార్జున కూల్ అయ్యారట. లేకపోతే ఆ దెబ్బతో సినిమా ఆగిపోయేదని దర్శకుడు శివనాగేశ్వరరావు ఓ సందర్భంలో చెప్పారు. Quote Link to comment Share on other sites More sharing options...
veerigadu Posted September 14, 2020 Report Share Posted September 14, 2020 Idhe last hit emo... 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted September 14, 2020 Author Report Share Posted September 14, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted September 14, 2020 Author Report Share Posted September 14, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
mustang302 Posted September 14, 2020 Report Share Posted September 14, 2020 🤣🤣first n last ani aa naluguru fans ki evadina chappandayya..! Quote Link to comment Share on other sites More sharing options...
DaatarBabu Posted September 14, 2020 Report Share Posted September 14, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted September 14, 2020 Report Share Posted September 14, 2020 idhi hit epudu ayindi Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted September 14, 2020 Author Report Share Posted September 14, 2020 3 hours ago, Piracy Raja said: idhi hit epudu ayindi Flop kaledhu Quote Link to comment Share on other sites More sharing options...
Chay Posted September 14, 2020 Report Share Posted September 14, 2020 nandi award kuda icheyalsindi maa fans kosam Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted September 14, 2020 Report Share Posted September 14, 2020 first and last hit antunna antis Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted September 14, 2020 Report Share Posted September 14, 2020 next 25 years akhil ey no. 1 antunna aa nuluguru Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.